విశాలాంధ్ర మహాసభ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో ముట్టడి కార్యక్రమానికి హైదరాబాద్ నుంచి వెళ్తున్న ఆ మహాసభ నేతలను శనివారం పోలీసులు ఆగ్రా వద్ద అడ్డుకున్నారు. దాంతో పోలీసులు, విశాలాంధ్ర మహసభ నేతల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. దాంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
న్యూఢిల్లీ వెళ్లే క్రమంలో విశాలాంధ్ర మహాసభ నేతలు శుక్రవారం మహారాష్ట్రలోని నాగపూర్ పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనను అడ్డుకోవాలని ఆర్ఎస్ఎస్ అధినేత భగవతికి విజ్ఞాపన పత్రం అందించేందుకు ఆ సంస్థ ప్రధాన కార్యాలయానికి వెళ్లారు. అక్కడ ఆయన లేకపోవడంతో ఆయన కార్యదర్శికి విజ్ఞాపన పత్రాన్ని అందజేశారు. సమైక్యాంధ్రకు మద్దతుగా న్యూఢిల్లీలో ఈ రోజు ధర్నా నిర్వహించాలని విశాలాంధ్ర మహాసభ నేతలు నిర్ణయించారు. ఆ క్రమంలో వారిని ఆగ్రాలలో అడ్డుకున్నారు.