రాష్ట్ర విభజనపై ఏర్పాటు అయిన కేంద్ర రక్షణ మంత్రి ఆంటోని నేతృత్వంలోని కమిటీని బహిష్కరించాలని విశాలాంధ్ర మహాసభ అధ్యక్షుడు చక్రవర్తి సీమాంధ్రవాసులను పిలుపునిచ్చారు. గురువారం ఆయన హైదరాబాద్లో విలేకర్ల సమావేశంలో ప్రసంగించారు. ఈ నెల 16 నుంచి విశాలాంధ్ర మహాసభ సమైక్యత యాత్రను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.
ఆ యాత్ర ఈ నెల 25న కడపలో ముగుస్తుందన్నారు. అలాగే శ్రీకాకుళం నుంచి రెండో విడద సమైక్యత యాత్రను కూడా త్వరలో ప్రారంభం అవుతుందని చెప్పారు. అయితే ఈ నెల 18న న్యూఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద సమైక్యవాదులు ధర్నా నిర్వహిస్తున్నారని విశాలాంధ్ర మహాసభ అధ్యక్షుడు చక్రవర్తి తెలిపారు.
ఆంటోని కమిటీని బహిష్కరించండి: చక్రవర్తి
Published Thu, Aug 15 2013 1:36 PM | Last Updated on Fri, Sep 1 2017 9:51 PM
Advertisement
Advertisement