chakravarthy
-
ఓ చాంపియన్ కథ
భారతదేశానికి 1980లలో ప్రాతినిధ్యం వహించిన కబడ్డీ ఆటగాడు అర్జున్ చక్రవర్తి జీవితం ఆధారంగా రూపొందిన ద్విభాషా (తెలుగు, తమిళం) చిత్రం ‘అర్జున్ చక్రవర్తి: జర్నీ ఆఫ్ యాన్ అన్సంగ్ ఛాంపియన్’. విజయ రామరాజు టైటిల్ రోల్లో, సిజా రోజ్ కీ రోల్లో విక్రాంత్ రుద్ర దర్శకత్వంలో శ్రీని గుబ్బల ఈ చిత్రాన్ని నిర్మించారు. -
చక్రవర్తి చాలా గొప్ప వ్యక్తి.. అతను పాటలు సూపర్ హిట్
-
ప్రవీణ్... ఎ డ్రగ్ డిస్ట్రిబ్యూటర్!!
సాక్షి, హైదరాబాద్: నగరంలోని కెమికల్ షాపుల నుంచి అక్రమంగా పెట్రోలియం ఈథర్ ఖరీదు చేయడం... దీన్ని విశాఖ ఏజెన్సీకి తరలించి హష్ ఆయిల్ తయారీదారులకు విక్రయించడం... వాళ్ల నుంచి హష్ ఆయిల్ కొనుగోలు చేసి హైదరాబాద్‌తో పాటు బెంగళూరులో ఉన్న పెడ్లర్లకు సరఫరా చేయడం... కొన్నాళ్లుగా ఈ పంథాలో రెచ్చిపోతున్న ‘డ్రగ్ డిస్ట్రిబ్యూటర్’ ఎన్.ప్రవీణ్ కుమార్ హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ (హెచ్–న్యూ) అధికారు లకు చిక్కాడు. ఇతడితో పాటు ముగ్గురు పెడ్లర్స్‌ను పట్టుకున్నట్లు డీసీపీ చక్రవర్తి గుమ్మి మంగళవారం వెల్లడించారు. మూడేళ్ల క్రితం పెడ్లర్‌గా మొదలెట్టి... కుత్బుల్లాపూర్ ప్రాంతానికి చెందిన ప్రవీణ్ కుమార్ దాదాపు మూడేళ్ల క్రితం గంజాయి పెడ్లర్‌గా మారాడు. ఇతడికి విశాఖ ఏజెన్సీలోని గూడెం మాడుగుల మండలం అలగాం ప్రాంతానికి చెందిన గంజాయి పండించే గిరిజనులతో పరిచయమైంది. కొన్నాళ్లుగా వాళ్లు గంజాయి నుంచి తీసే హష్ ఆయిల్ ఉత్పత్తి చేస్తున్నారు. దీంతో ప్రవీణ్ అదే దందా చేశాడు. హష్ ఆయిల్ తయారీకి పెట్రోలియం ఈథర్ అవసరం. ఇది ఏజెన్సీలో దొరకట్లేదనే విషయం తెలుసుకున్న ఇతగాడు తాను సరఫరా చేస్తానంటూ గిరిజను లతో ఒప్పందం చేసుకున్నాడు. దాన్ని వినియో గించి తనకు హష్ ఆయిల్ తయారు చేసి ఇవ్వాలంటూ షరతు పెట్టాడు. రెండు ఏజెన్సీల నుంచి అక్రమంగా... పెట్రోలియం ఈథర్‌ను పారిశ్రామిక అవసరాల కోసం మాత్రమే విక్రయించాలి. అదీ అధీకృత పత్రాలు సేకరించిన తర్వాతే అమ్మాలి. అయితే నగరంలోని కూకట్పల్లి ప్రశాంతినగర్‌కు చెందిన నర్మద ట్రేడర్స్, మహాలక్ష్మీ కెమికల్ ట్రేడర్స్ ఈ నిబంధనను తుంగలో తొక్కాయి. ఎలాంటి పత్రాలు లేకుండా ప్రవీణ్‌కు భారీ మొత్తంలో విక్రయిస్తున్నాయి. దీని రవాణా కోసం ఓ వాహ నం ఖరీదు చేసిన ఇతను డ్రైవర్‌ను నియమించుకున్నాడు. ఈథర్‌ను ఇక్కడ లీటర్ రూ.100కు కొని, అలగాం తరలించి అక్కడి వారికి రూ.400కు అమ్ముతున్నాడు. ఇలా ఇప్పటి వరకు ఈ రెండు ఏజెన్సీల నుంచి 1400 లీటర్లు కొనుగోలు చేశాడు. హష్ ఆయిల్ ‘డిస్ట్రిబ్యూటర్’గా మారి... పెట్రోలియం ఈథర్‌తో తయారు చేసిన హష్ ఆయిల్‌ను ప్రవీణ్ గిరిజనుల నుంచి తక్కువ రేటుకు కొనుగోలు చేస్తున్నాడు. లీటర్ గరిష్టంగా రూ.30 వేలకు కొని, తీసుకువచ్చి హైదరాబాద్ లోని 15 మంది పెడ్లర్స్‌తో పాటు బెంగళూరులో ఉన్న వారికీ సరఫరా చేస్తున్నాడు. నగరంలో లీటర్ రూ.70 వేల నుంచి రూ.80 వేలకు, బెంగళూరులో రూ.1.2 లక్షలు నుంచి రూ.1.4 లక్ష లకు విక్రయిస్తున్నాడు. చిన్న చిన్న డబ్బాల్లో ప్యాక్ చేసి డబ్బాల్లో అమ్మితే ప్రవీణ్‌కు లీటర్‌కు రూ.2 లక్షల వరకు ఆదాయం వస్తోంది. ఇలా అటు ఇథనాల్, ఇటు హష్ ఆయిల్ రెండింటి దందా చేస్తూ కొన్నాళ్లుగా రెచ్చిపోతున్న ఇతడికి గోవాలో కూడా నెట్వర్క్ ఉన్నట్లు అనుమానిస్తున్నారు. చిక్కడపల్లిలో సరఫరా చేస్తుండగా... ప్రవీణ్ కుమార్‌కు నగరంలో ఉన్న పెడ్లర్లలో పటాన్చెరు, కూకట్పల్లి ప్రాంతాలకు చెందిన పి.మోహన్ యాదవ్, పి.కళ్యాణ్, బి.సురేష్ కీల కం. ఇటీవల ఏజెన్సీ నుంచి హష్ ఆయిల్ తెచ్చిన ఇతడు దాన్ని చిన్న డబ్బాల్లో ప్యాక్‌చేసి పెడ్లర్స్‌కు సరఫరా చేస్తున్నాడు. మంగళవారం చిక్కడపల్లి వద్దకు ఈ ముగ్గురికీ ఇచ్చేందుకు 60 డబ్బాలు తీసుకువచ్చాడు. దీనిపై హెచ్–న్యూ ఇన్స్పెక్టర్ పి.రమేష్‌రెడ్డికి సమాచారం అందింది. ఆయన ఆదేశాల మేరకు ఎస్సై సి.వెంకటరాములు నేతృత్వంలోని బృందం వలపన్ని నలుగురినీ పట్టు కుంది. వీరి నుంచి హష్ ఆయిల్‌తో పాటు 400 లీటర్ల ఈథర్, వాహనం స్వాధీనం చేసుకున్నా రు. నిబంధనలకు విరుద్ధంగా పెట్రోలియం ఈథర్‌ను వికయ్రించిన కూకట్పల్లి ప్రశాంతినగర్‌కు చెందిన నర్మద ట్రేడర్స్, మహాలక్ష్మీ కెమికల్ ట్రేడర్స్‌పై కేసులు నమోదు చేశారు. ప్రవీణ్‌పై గతంలోనూ కేసులు కాగా, ప్రవీణ్‌పై గతంలో రెండు కేసులు నమోదై నట్టు పోలీసులు గుర్తించారు. 2015లో కూకట్ పల్లిలో ఓ చిన్నారిని కిడ్నాప్ చేసి డబ్బు డిమాండ్ చేసిన ముఠాలో సభ్యుడిగా కేసు నమోదైంది. 2020లో కూకట్‌పల్లిలోనే గంజాయి అమ్ముతూ పట్టుబడిన కేసు విచారణలో ఉంది. -
సీనియర్ నటుడు చక్రవర్తి కన్నుమూత
తమిళసినిమా: సీనియర్ తమిళ నటుడు చక్రవర్తి శనివారం ఉదయం ముంబయిలో గుండెపోటుతో మరణించాడు. ఈయన వయసు 62 ఏళ్లు. 1980 ప్రాంతంలో ప్రముఖ నటుడిగా రాణించిన ఈయన తమిళంలో వివిధ పాత్రల్లో 80 చిత్రాల వరకు చేశారు. శివాజీ గణేశన్, రజనీకాంత్, కమలహాసన్ వంటి ప్రముఖ నటులతో కలిసి నటించారు. శివాజీ గణేశన్ కథానాయకుడు నటించిన రిషి మూలం చిత్రం ద్వారా చక్రవర్తి నటుడిగా పరిచయమయ్యారు. కొంతకాలం తరువాత సినిమాలకు దూరమై ముంబయికి వెళ్లిపోయారు. అక్కడ సోనీ స్టార్ స్పోర్ట్స్ ఛానల్లో పని చేశారు. ఈయన దక్షిణ భారత సినీ నటీనటుల సంఘంలో సభ్యుడిగా కొనసాగుతూ వచ్చారు. కాగా శనివారం ఉదయం గుండెపోటుతో నిద్రలోనే తుది శ్వాస విడిచారు. ఆయన సతీమణి ఉదయాన్నే లేపినా లేవకపోవడంతో వెంటనే సమీపంలోని ఆసుపత్రిలో చేర్చారు. అయితే వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు చక్రవర్తి గుండెపోటుతో నిద్రలోనే మరణించినట్లు తెలిపారు. ఈయనకు భార్య లలిత, శశికుమార్, అజయ్‌కుమార్ అనే ఇద్దరు కొడుకులు ఉన్నారు. చదవండి: (వెటరన్ స్క్రీన్ రైటర్ కన్నుమూత.. ప్రముఖుల సంతాపం) -
దర్శకుడు ఎన్బీ చక్రవర్తి కన్నుమూత
ప్రముఖ దర్శకుడు ఎన్బీ చక్రవర్తి కన్ను మూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. శోభన్‌బాబుతో ‘సంపూర్ణ ప్రేమాయణం’, నందమూరి బాలకృష్ణతో ‘కత్తుల కొండయ్య’ చిత్రాలను తెరకెక్కించారు చక్రవర్తి. ఇంకా ‘నిప్పులాంటి మనిషి’, ‘కాష్మోరా’ వంటి చిత్రాలకూ దర్శకత్వం వహించారాయన. 1986లో వచ్చిన ‘కాష్మోరా’ చిత్రం మంచి విజయం సాధించింది. ‘‘చక్రవర్తిగారు చాలా సినిమాలకు కో డైరెక్టర్‌గా చేశారు. ప్రముఖ సంగీత దర్శకుడు పెండ్యాల నాగేశ్వరరావు కుమార్తెను ఆయన పెళ్లి చేసుకున్నారు. వారికి ఇద్దరు అమ్మాయిలు, ఓ కుమారుడు. మూసాపేటలోని తన నివాసంలో నిద్రలోనే హార్ట్ ఎటాక్‌తో చక్రవర్తిగారు మృతి చెందారు. శుక్రవారమే అంత్యక్రియలు పూర్తి చేశాం. జూనియర్స్‌కి కూడా ఎన్బీగారు ఎంతో సపోర్ట్‌గా ఉండేవారు. ఎవర్నీ హర్ట్ చేయకుండా మాట్లాడే మంచి గుణం ఆయనలో ఉంది. అలాంటి వ్యక్తి భౌతికంగా లేకపోవడం సినిమా పరిశ్రమకి తీరని లోటుగా భావిస్తున్నాం. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటున్నా’’ అని తెలుగు చలన చిత్రదర్శకుల సంఘం అధ్యక్షుడు ఎన్. శంకర్ తెలిపారు. చక్రవర్తి మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. -
స్టార్ స్టార్ సూపర్ స్టార్ సంగీత దర్శకుడు చక్రవర్తి
-
ఆలోచింపజేస్తోంది
ఈశ్వర్ హీరోగా టువ చక్రవర్తి, అంకిత మహారాణా హీరోయిన్లుగా ఆర్.రఘురాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘4 లెటర్స్’. ఓం శ్రీచక్ర క్రియేషన్స్ బ్యానర్‌పై దొమ్మరాజు ఆశాలత, దొమ్మరాజు ఉదయ్ కుమార్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 22న విడుదలైంది. హైదరాబాద్‌లో ఈ సినిమా ప్రదర్శితమవుతున్న పలు థియేటర్లను చిత్రబృందం సందర్శించింది. అదేవిధంగా సెయింట్ మేరీస్ ఇంజినీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్‌తో చిత్రవిజయాన్ని పంచుకున్నారు. ‘‘నేటితరం ప్రేమకథా చిత్రంగా రుపొందిన ‘4 లెటర్స్’ యువతకు ఎంతగానో నచ్చింది. ప్రధానంగా హీరో కళాశాల ప్రొఫెసర్ల గురించి గొప్పగా, గౌరవంగా మాట్లాడే సన్నివేశాలు, ప్రేమ–పెళ్లి నేపథ్యంలో సాగే పతాక సన్నివేశాలతో పాటు కళాశాలలో జరిగే సన్నివేశాలలోని వినోదం ప్రేక్షకులను అలరిస్తున్నాయి. విద్యా బుద్ధులు నేర్పించిన గురువులకు విద్యార్థులు అండగా నిలవాలన్న సందేశం యువతను ఆలోచించేలా చేస్తోంది. ఇదే చిత్ర విజయానికి సంకేతం’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. -
‘4 లెటర్స్’ విజయవంతం కావాలి : వెంకటేష్
ఓం శ్రీ చక్ర క్రియేషన్స్ బ్యానర్ ప్రొడక్షన్ నెం.1గా రూపొందుతోన్న చిత్రం ‘4 లెటర్స్’. ఈశ్వర్, చక్రవర్తి, అంకిత మహారాణా హీరో హీరోయిన్లుగా పరిచయం అవుతున్న ఈ చిత్రాన్ని ఆర్.రఘురాజ్ దర్శకత్వంలో దొమ్మరాజు హేమలత, దొమ్మరాజు ఉదయ్‌కుమార్ నిర్మిస్తున్నారు. ప్రముఖ కథానాయకుడు విక్టరీ వెంకటేష్ టీజర్, ట్రైలర్‌ను చూసి చిత్ర కథానాయకుడు, దర్శక, నిర్మాతలను అభినందించి, చిత్రం విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ఈ ట్రైలర్‌ను ఈ రోజు (మంగళవారం) సాయంత్రం విడుదల చేయనున్నారు. ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని ‘A ’ సర్టిఫికెట్ ను పొందింది. ఫిబ్రవరి 22 న చిత్రం ను విడుదల చేస్తున్నట్లు నిర్మాత ఉదయ్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా... నిర్మాతలు దొమ్మరాజు హేమలత, ఉదయ్‌కుమార్ మాట్లాడుతూ - ‘మా బ్యానర్లో నిర్మిస్తోన్న తొలి చిత్రం 4 లెటర్స్. ఈ చిత్రం టీజర్ ను సుప్రసిద్ధ దర్శకులు శ్రీ రాఘవేంద్ర రావు గారు విడుదల చేయటం మాకెంతో ఆనందంగా ఉంది. ఆయనకు కృతఙ్ఞతలు. చిత్రం ద్వారా ఈశ్వర్‌ను హీరోగా పరిచయం చేయడం ఆనందంగా ఉంది. చాలా చక్కగా నటించాడు. సత్యానంద్‌గారి వద్ద శిక్షణ తీసుకున్న ఈశ్వర్.. ఈ సినిమా కోసం చాలా హార్డ్ వర్క్ చేశాడు. కమర్షియల్ హంగులతో యూత్ సహా అన్నీ వర్గాలను ఆకట్టుకునే ఎంటర్టైనర్గా ఈ సినిమా రూపొందించాం అన్నారు. హీరో ఈశ్వర్ మాట్లాడుతూ.. ‘విక్టరీ వెంకటేష్ గారి ఆశీస్సులు అందుకోవటం ఎంతో ఆనందంగా ఉంది. చిత్రం కూడా ప్రేక్షకాదరణకు నోచుకుంటుందనే నమ్మకం ఉందని అన్నారు. దర్శకుడు ఆర్.రఘురాజ్ మాట్లాడుతూ ‘కలుసుకోవాలని తర్వాత తెలుగులో నేను డైరెక్ట్ చేసిన మూవీ ఈ 4 లెటర్స్. ఇది నేటితరం ప్రేమకథాచిత్రం. ప్రేమ, పెళ్లి విషయాలలో నేటితరం యువత ఆలోచనలు, అభిప్రాయాలు, వాస్తవాలు ఏమిటన్నది విషయాలను వాస్తవానికి దగ్గరగా ఉండేలా చిత్రీకరించటం జరిగింది. -
ఆవినీతి చక్రవర్తి పుస్తకాన్ని ఆవిష్కరించిన వైఎస్ జగన్
-
కోలం, పొన్ను, చిట్టి ముత్యాలు!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కిరాణా సరుకులను కూడా ఆన్లైన్లో కొనే రోజులివి. కానీ ఏ గ్రాసరీ స్టార్టప్స్‌లోనైనా ఉప్పులు, పప్పుల వంటి వాటిల్లో లభ్యమయ్యేన్ని బ్రాండ్లు బియ్యంలో దొరకవు! ఇది చూశాక హైదరాబాద్‌కు చెందిన విక్రమ్ చక్రవర్తి... బియ్యాన్ని మాత్రమే విక్రయించే ‘ఓన్లీ రైస్.కామ్’ను ప్రారంభించారు. మరిన్ని వివరాలు ఆయన మాటల్లోనే... ప్రస్తుతం మేం కోలం, పొన్ను, జై శ్రీరామ్, చిట్టి ముత్యాలు, సోనా మసూరీ, సాంబ మసూరీ, ఇడ్లీ రైస్, దోశ రైస్, బాస్మతీ, హెచ్ఎంటీ వంటి 18 రకాల బియ్యం బ్రాండ్లు విక్రయిసు ్తన్నాం. ఇవి మిర్యాలగూడ, కర్నూల్, కర్ణాటక నుంచి దిగుమతవుతాయి. ఆర్గానిక్ డయాబెటిక్ పేటెంట్ రైస్‌తో ప్రత్యేక ఒప్పందం ఉంది. వీటిని మైసూర్ నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. ప్రసుతం నెలకు 1,200–1,500 బస్తాలు విక్రయిస్తున్నాం. వీటి విలువ రూ.15 లక్షల వరకూ ఉంటుంది. కిలో బియ్యం ధర రూ.32 నుంచి రూ.120 వరకూ ఉంది. కిలో బియ్యం కూడా డెలివరీ చేస్తాం. రూ.500 కంటే ఎక్కువ ఆర్డరైతే డెలివరీ ఉచితం. అంతకంటే తక్కువైతే రూ.45 డెలివరీ చార్జీ ఉంటుంది. హోటల్స్‌కు రూ.లక్ష వరకు రుణం... రిటైల్, హోల్‌సేల్ వంటి బీ2బీ వర్తకులకు, గృహ కస్టమర్లకు (బీ2సీ) రుణాలందించేందుకు ఒక ఎన్‌బీఎఫ్‌సీతో ఒప్పందం చేసుకున్నాం. దీనిప్రకారం హోటళ్లు, రెస్టారెంట్లకు 30 రోజుల కాల పరిమితితో రూ.లక్ష వరకు రుణమిస్తాం. ఇక, బీ2సీలకు 14 రోజుల పాటు రూ.10 వేల క్రెడిట్ ఉం టుంది. ఆధార్, పాన్, ఈ–మెయిల్, ఫోన్ నంబర్ వంటి వివరాలు సమర్పిస్తే చాలు నిమిషం వ్యవధిలోపే రుణం జమ అవుతుంది. ప్రస్తుతం బీ2బీలో 40, బీ2సీ 4 వేల మంది కస్టమర్లున్నారు. ఉచితంగా ఓన్లీ రైస్ ఫ్రాంచైజీ కూడా.. ఓన్లీ రైస్‌కు హైదరాబాద్‌లో నాలుగు సొంత ఔట్‌లెట్లున్నాయి. ఏడాదిలో 500కి చేర్చాలన్నది లక్ష్యం. అందుకే ఫ్రాంచైజీ ఇస్తున్నాం. రైస్ మర్చంట్స్‌కు, ఇతర దుకాణాదారులకు ఉచితంగా ఫ్రాంచైజీ ఇస్తున్నాం. ప్రతి బస్తా అమ్మకంపై 5 శాతం కమీషన్ తీసుకుంటాం. ప్రతి నెలా 50 శాతం ఆదాయ వృద్ధిని నమోదు చేస్తున్నాం. వచ్చే ఏడాది నాటికి రూ.50 కోట్ల ఆదాయాన్ని లకి‡్ష్యంచాం. ఫిబ్రవరికి బెంగళూరు, చెన్నై నగరాల్లో సేవలను విస్తరిస్తాం. ఇటీవలే హైదరాబాద్‌కు చెందిన ఓ కంపెనీ రూ.7 కోట్ల పెట్టుబడి పెట్టింది. త్వరలో రూ.25 కోట్లు సమీకరిస్తాం’’ అని చక్రవర్తి వివరించారు. -
గోపీచంద్ ‘పంతం’ టీజర్
గోపీచంద్ హీరోగా కె.చక్రవర్తిని దర్శకుడిగా పరిచయం చేస్తూ తెరకెక్కిస్తున్న సినిమా పంతం. ‘ఫర్ ఏ కాస్’ అనే ట్యాగ్ లైన్‌తో రూపొందుతున్న ఈ సినిమాను శ్రీసత్య సాయి బ్యానర్‌పై కె.కె.రాధామోహన్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈసినిమా టీజర్ రిలీజ్ అయ్యింది. గోపీచంద్ బాడీ లాంగ్వేజ్‌కు తగ్గ యాక్షన్ కథతో పంతం సినిమాను తెరకెక్కించారు. గోపీచంద్ 25వ సినిమాగా రూపొందుతున్న ఈ మూవీలో మెహరీన్ కథానాయిక. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి జూలై 5న సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
గోపిచంద్ ‘పంతం’ ఫస్ట్ లుక్
కొంతకాలంగా వరుస ఫ్లాప్‌లతో ఇబ్బంది పడుతున్న మాస్ హీరో గోపిచంద్ లీడ్ రోల్లో తెరకెక్కుతున్న తాజా చిత్రం పంతం. గోపిచంద్ 25వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్ పై కె. చక్రవర్తి దర్శకత్వంలో రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో గోపిచంద్ సరసన మెహరీన్ హీరోయిన్గా నటిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణదశలో ఉన్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను చిత్రయూనిట్ విడుదల చేశారు. పూర్తి స్థాయి కమర్షియల్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పృథ్వీ, జయప్రకాష్ రెడ్డిలు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాతో సక్సెస్ సాధించి తిరిగి ఫాంలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నాడు గోపిచంద్. -
మరో ప్రాజెక్ట్ ఓకె చేసిన రోహిత్
హిట్.. ఫ్లాప్.. లతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో బిజీగా ఉండే యంగ్ హీరో నారా రోహిత్ మరో సినిమాకు ఓకె చెప్పాడు. నిర్మాతగానూ బిజీ అవుతున్న రోహిత్ ప్రస్తుతం జగపతిబాబుతో కలిసి ఆటగాళ్లు సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే ఇప్పుడు మరో ప్రాజెక్ట్‌కు సైన్ చేశాడు రోహిత్. ఎస్డీ చక్రవర్తిని దర్శకుడిగా పరిచయం చేస్తూ ఈఎమ్వీఈ స్టూడియోస్ బ్యానర్‌పై తెరకెక్కతున్న సినిమాలో నటించనున్నాడు. వైవిధ్యమైన కథతో విలేజ్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఈ సినిమా మార్చి లో సెట్స్ మీదకు వెళ్లనుంది. -
సందర్భం వేటూరి సుందరరామమూర్తి వర్ధంతి తేనెపాటల పూదోట
‘ఆరేసుకోబోయి పారేసు’కున్న అల్లరి పాటకు (‘అడవిరాముడు’ - 1977) తెలుగు ప్రేక్షకులతో ఈలలు, కేరింతలు, కేకలు వేయించిన ఘనత వేటూరి సుందరరామమూర్తిది. అదే సినిమాలో ఆయన ‘కోకిలమ్మ పెళ్లికి కోనంతా పందిరి’ వేసిన వైనం ఆ స్థాయి గుర్తింపునకు నోచుకుందా అంటే సందేహమే. జనామోదం అలానే ఉంటుంది మరి. ‘నిన్న మొన్న తుళ్లి తుళ్లి తూనీగల్లే ఎగిరిన పిల్లదానికొచ్చింది కళ, పెళ్లికళ’ అంటూ సుతారంగా, సున్నితంగా సంపెంగ రెక్కలతో సరాగమాడిన గీతర్షి ఆయన. 1974లో గీత రచయితగా పరిచయమైనా, ఆయన ఘన సినీ యానం మాత్రం అలా 1977లో ప్రారంభమైంది. ఒక్కసారి వెనక్కి చూస్తే, 1978లో వచ్చిన ‘సిరిసిరి మువ్వ’ సుందరరామమూర్తి ప్రతిభకు నిలువెత్తు అద్దమైంది. ఆ తరువాత మూడు దశాబ్దాల పాటు ఆయన పాటల తేరు ఊరేగడానికి ఆ సినిమా ఓ రహదారి అయింది. పడికట్టు పదాల దొంతరలు వదిలేసి, ‘ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక... ఏరు దారెటు పోతుందో ఎవరినీ అడగక...’ అంటూ ఒకింత వేదాంతంతో వేటూరి తానేమిటో ఆవిష్కరించుకున్నారు. ఇక అంతే... పదేళ్ల పాటు ఎన్నెన్ని సినిమాలకు ఆయన సింగిల్‌కార్డు గేయ రచయితగా నిలిచారో లెక్క లేదు. చక్రవర్తి, ఇళయరాజా, కీరవాణి, రాజ్‌కోటి... ఎందరో సంగీత దర్శకులు ఏరి కోరి ఆయనే కావాలని తమ బాణీలకు పాటలు రాయించుకున్నారు. కె. విశ్వనాథ్ నుంచి కె. రాఘవేంద్రరావు, ఎ. కోదండరామిరెడ్డి, ఇవాళ్టి శేఖర్ కమ్ముల, గుణశేఖర్‌ల దాకా ఎందరో దర్శకులకు ఆయన హాట్‌ఫేవరెట్. మూడు దశాబ్దాలకు పైగా ఆయన కలం అందించిన పాటలు దాదాపు 5,000 పైనే ఉంటాయని ఓ అంకెల అంచనా. ‘రాయక నిర్మాతలను ఏడిపించే’ గుణం ఆయనకు అసలుండేది కాదు. 1970లలో సినిమా నిర్మాణంలో పెరిగిన వేగం, వ్యాపారాత్మక పాటల కోసం నిర్మాతలు రోజులూ వారాలూ ఎదురుచూసే ధోరణికి స్వస్తి చెప్పింది. అనుకున్నది తడవుగా సన్నివేశానికి అతికే పాటలు, ఇచ్చిన ట్యూన్‌కు అనుగుణంగా చెక్కిన పద సముదాయం గుబాళించే పాటలు వెంట వెంటనే రాయాల్సి వచ్చిన సంక్లిష్ట సంధిలో తన కోసం సిద్ధమైన సింహాసనాన్ని వేటూరి సరైన సమయంలో అధిరోహించారు. ట్యూన్ వినిపిస్తే అరగంటలో ఆయన ఫోనులోనే పాట వినిపించేవారని చెప్పుకుంటారు. ‘శంకరాభరణం’ లాంటి క్లాసిక్స్‌కి, ‘వేటగాడు’, ‘జగదేకవీరుడు - అతిలోకసుందరి’ వంటి ఫక్తు ఫార్ములా సినిమాలకు సమాంతరంగా సాహితీ గౌరవం కలిగిన పాటలు రాస్తూ, ఆయన తన ప్రతిభను ప్రపంచానికి స్పష్టం చేశారు. ‘ఓంకారనాదాను సంధానమౌ గానమే శంకరాభరణము...’ అని ఒక చేత్తో రాస్తున్న కాలంలోనే ‘ఆకుచాటు పిందె తడిసె... కోక మాటు పిల్ల తడిసె’ అంటూ యువతరానికి చక్కిలిగిలి పెట్టే పాటలు మరో చేత్తో రాసి చలాయించుకున్నారు. ‘అచ్చెరువున... విచ్చిన కన్నులతో’ రసహృదయుల్ని తన్మయానికి లోను చేశారు. అలవోకగా, అతి సుందరంగా మాటలతో ప్రయోగాలు చేసి పాటలల్లిన మాంత్రికుడు ఆయన. మైనా పిట్టలు ‘జిలిబిలి పలుకులు చిలిపిగ పలికిన’ సోయగాన్ని ఆయన ‘సితార’లో అక్షరబద్ధం చేస్తే ఇళయరాజా స్వరమాలిక కూర్చి అజరామరం చేశారు. ‘వానకారు కోయిలనై /తెల్లవారి వెన్నెలనై / ఈ ఎడారి దారులలో / ఎడద నేను పరిచానని/కడిమి వోలె నిలిచానని’ అంటూ ఆయన లిఖించిన ‘మేఘసందేశం’ ఎన్నేళ్లు గడిచినా ఆ పరిమళాన్ని పోగొట్టుకోదు. ‘కలలారని పసిపాప / తలవాల్చిన ఒడిలో తడినీడలు పడనీకే / ఈ దేవత గుడిలో’అని లేబ్రాయపు ప్రియురాలికి ఆయన చేరవేసిన ‘గీతాంజలి’ ఎన్నటికీ సుమదళ సుకుమారమే. ‘ఎన్నెల్లుతేవే/ ఎదమీటిపోవే’ అంటూ ‘పంతులమ్మ’కు ఆయన శ్రుతి చేసిన పున్నాగపూల సన్నాయి సినీ సంగీత ప్రియుల వీనులకు విందు చేస్తూనే ఉంటుంది. అంతర్లీనంగా ‘వీణ వేణువైన మధురిమ’లా పల్లవిస్తూనే ఉంటుంది. ఆయనకే తెలిసిన ‘ఎడారి కోయిల’లు, ‘తెల్లారని రేయి’లు కోకొల్లలు. కడలి తరంగమంత జీవన విషాదాన్ని ‘బ్రతుకంటే మృతి కంటే చేదైన ఒక తీపి పాట...’ అంటూ సంక్షిప్తీకరించడం సుందరరామమూర్తి కంటే వేరెవరికి తెలుసు? ‘వేణువై వచ్చాను భువనానికి... గాలినై పోతాను గగనానికి’ అన్న జీవన క్రోడీకరణ ఆయనకే సాధ్యం. వెరసి ఒక గంధర్వ కవిత్వపు కుంచె భువిపై దిగి, 1936 నుండి 2010 దాకా 74 ఏళ్ల పాటు ‘వేదం’లా, ‘అణువణువున నాదం’లా, ‘పంచప్రాణాల నాట్యవినోదం’లా విలసిల్లి, ‘నిర్వాణ సోపానమధిరోహించి’ంది. అక్షరాలా అమృతమూర్తి వేటూరి సుందరరామమూర్తి. - తిరువాయపాటి రాజగోపాల్ -
సాంఘిక బహిష్కరణ
కర్నూలు(విద్య), న్యూస్‌లైన్: ప్యాకేజీల కోసం పాకులాడుతూ రాష్ట్రాన్ని విభజించేందుకు యత్నిస్తున్న సమైక్య ద్రోహులను సాంఘికంగా బహిష్కరించాలని వక్తలు పిలుపునిచ్చారు. విశాలాంధ్ర మహాసభ, జిల్లా సమైక్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో గురువారం కర్నూలు పాతబస్టాండ్ వద్ద సమైక్య సత్యాగ్రహం పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ముఖ్యఅతిథిగా అస్సాం గణపరిషత్ అధ్యక్షుడు, ఎంపీ జోసఫ్ టోపో, సమతాపార్టీ మాజీ జాతీయ అధ్యక్షుడు వి.వి. కృష్ణారావు, విశాలాంధ్ర మహాసభ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నల్లబోతుల చక్రవర్తి ప్రసంగించారు. రాష్ట్ర విభజన కోరుకుంటున్న వారికి ఎవరూ సహకారాన్ని అందించవద్దని సూచించారు. డిసెంబర్లో 371డిని సవరించే ప్రసక్తే లేదని, గట్టిగా పోరాటం చేస్తే విభజన ఆగిపోతుందని పేర్కొన్నారు. జోసఫ్ టోపో మాట్లాడుతూ.. విదేశీయులు అస్సాంపై దండయాత్ర చేసినప్పుడు విద్యార్థులు, ఉద్యోగులు, ప్రజలు రోడ్లపైకి వచ్చి ఎదుర్కొన్నారని, సీమాంధ్ర ఉద్యమం సైతం తనకు అలాగే కనిపిస్తోందన్నారు. భాష, జాతి ఐక్యతను కాపాడుకోవడం కోసం ఉద్యమాలు చేసి విజయం సాధించామని పేర్కొన్నారు. బ్రిటీష్ వారు స్వాతంత్య్రం ఇచ్చి వెళ్తూ విభజించు పాలించు అనే సూత్రాన్ని కాంగ్రెస్ నేతలకు నేర్పిపోయారని ఎద్దేవా చేశారు. ఈశాన్యరాష్ట్రాలన్నీ కలుపుకుని హక్కుల కోసం పోరాటం చేసేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నామనిచెప్పారు. సీమాంధ్రలో రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా చేసే ఈ ఉద్యమం ఫలిస్తుందన్నారు. ఉద్యమానికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని పేర్కొన్నారు. ఎన్టీఆర్ ఆశయానికి చంద్రబాబు తూట్లు తెలుగుజాతి ఆత్మగౌరవం కోసం పోరాడిన నందమూరి తారక రామారావు ఆశయానికి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తూట్లు పొడుస్తున్నారని సమతాపార్టీ మాజీ జాతీయ అధ్యక్షుడు వి.వి. కృష్ణారావు ఆరోపించారు. కాంగ్రెస్, టీడీపీ నాయకులు ఒక్కో ప్రాంతం వారు ఒక్కో విధంగా మాట్లాడుతూ ప్రజలను గందరగోళంలో పడేస్తున్నారన్నారు. ఈ తరుణంలో విభజన చేయడం సరికాదని పేర్కొన్నారు. కేంద్రం, రాష్ట్రంలో ప్రభుత్వాలు మైనార్టీలో ఉన్నాయని, వాటినికి రాష్ట్రాన్ని విభజించే అధికారం లేదన్నారు. సీడబ్ల్యుసీ తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. మైనార్టీలు, ఆదివాసీల హక్కుల కోసం ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పుడే అసెంబ్లీ తీర్మానం అవసరం లేదని అంబేద్కర్ చెప్పారన్నారు. అయితే ఆంధ్రప్రదేశ్‌లో ఏ ప్రాంతం వారు మైనార్టీలో తేల్చి అప్పుడు రాష్ట్రాన్ని విభజించాలని కోరారు.కార్యక్రమంలో విశాలాంధ్ర మహాసభ ప్రధాన కార్యదర్శి రవితేజ, నాయకులు రామజోగయ్య, శ్రీనివాసరెడ్డి, జిల్లా సమైక్యాంధ్ర జేఏసీ నాయకులు జి. పుల్లయ్య, వి. జనార్దన్‌రెడ్డి, కె. చెన్నయ్య, శ్రీనివాసరెడ్డి, పిబివి సుబ్బయ్య, వాసుదేవయ్య, ఇతర శాఖల జేఏసీ నాయకులు ప్రసంగించారు. సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి జిల్లా చైర్మన్ చిన్న వెంకటస్వామి, ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ కొణిదేల శివనాగిరెడ్డి, జిల్లా విద్యార్థి జేఏసీ చైర్మన్ బాలకిరణ్ పాల్గొన్నారు. కళాకారుల గీతాలు ఉద్యమ స్ఫూర్తిని నింపాయి. ఈ కార్యక్రమానికి నగరంలోని విద్యార్థులు, ప్రజలు వేల సంఖ్యలో హాజరయ్యారు. సమైక్యాంధ్ర నినాదాలతో సభాప్రాంగణం దద్దరిల్లింది. సమైక్యాంధ్ర కోసం ప్రాణాలర్పించిన అమర వీరు స్థూపం నమూనా ఆకట్టుకుంది. -
తక్కువ వడ్డీ ప్రణాళికలు సరికాదు
ముంబై: డిమాండ్‌ను పెంచే విధంగా కాస్త తక్కువ వడ్డీ రేటుకు బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి వీలు కల్పించే ప్రభుత్వ ప్రణాళికలను ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ కేసీ చక్రవర్తి వ్యతిరేకించారు. ఇవి బ్యాంకుల అసెట్ క్వాలిటీపై ప్రభావం చూపే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ద్విచక్ర వాహనాలు, కన్సూమర్ డ్యూ రబుల్స్ వంటి ఎంపిక చేసిన కొన్ని రంగాల్లో డిమాండ్‌ను పెంచాలన్న లక్ష్యంగా ప్రభుత్వం ‘తక్కువ వడ్డీరేటు రుణాలకు’ ప్రణాళికకు రూపకల్పన చేసింది. ఇక్కడి ఒక మేనేజ్మెంట్ స్కూల్లో శనివారం జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న చక్రవర్తి, అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఈ అంశాన్ని ప్రస్తావించారు. వడ్డీరేట్లకు సంబంధించి ఆర్బీఐ అనుసరిస్తున్న విధానం వృద్ధికి ప్రతికూలంగా మారుతోందన్న విమర్శను ఆయన తోసిపుచ్చుతూ, వృద్ధి పురోగమనానికి అధిక ధరలే అడ్డంకిగా ఉన్నాయని వివరించారు. -
ఆంటోని కమిటీని బహిష్కరించండి: చక్రవర్తి
రాష్ట్ర విభజనపై ఏర్పాటు అయిన కేంద్ర రక్షణ మంత్రి ఆంటోని నేతృత్వంలోని కమిటీని బహిష్కరించాలని విశాలాంధ్ర మహాసభ అధ్యక్షుడు చక్రవర్తి సీమాంధ్రవాసులను పిలుపునిచ్చారు. గురువారం ఆయన హైదరాబాద్‌లో విలేకర్ల సమావేశంలో ప్రసంగించారు. ఈ నెల 16 నుంచి విశాలాంధ్ర మహాసభ సమైక్యత యాత్రను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఆ యాత్ర ఈ నెల 25న కడపలో ముగుస్తుందన్నారు. అలాగే శ్రీకాకుళం నుంచి రెండో విడద సమైక్యత యాత్రను కూడా త్వరలో ప్రారంభం అవుతుందని చెప్పారు. అయితే ఈ నెల 18న న్యూఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద సమైక్యవాదులు ధర్నా నిర్వహిస్తున్నారని విశాలాంధ్ర మహాసభ అధ్యక్షుడు చక్రవర్తి తెలిపారు.