ముంబై: డిమాండ్‌ను పెంచే విధంగా కాస్త తక్కువ వడ్డీ రేటుకు బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి వీలు కల్పించే ప్రభుత్వ ప్రణాళికలను ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్ కేసీ చక్రవర్తి వ్యతిరేకించారు. ఇవి బ్యాంకుల అసెట్ క్వాలిటీపై ప్రభావం చూపే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ద్విచక్ర వాహనాలు, కన్సూమర్ డ్యూ రబుల్స్ వంటి ఎంపిక చేసిన కొన్ని రంగాల్లో డిమాండ్‌ను పెంచాలన్న లక్ష్యంగా ప్రభుత్వం ‘తక్కువ వడ్డీరేటు రుణాలకు’ ప్రణాళికకు రూపకల్పన చేసింది.
ఇక్కడి ఒక మేనేజ్‌మెంట్ స్కూల్‌లో శనివారం జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న చక్రవర్తి, అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఈ అంశాన్ని ప్రస్తావించారు. వడ్డీరేట్లకు సంబంధించి ఆర్‌బీఐ అనుసరిస్తున్న విధానం వృద్ధికి ప్రతికూలంగా మారుతోందన్న విమర్శను ఆయన తోసిపుచ్చుతూ, వృద్ధి పురోగమనానికి అధిక ధరలే అడ్డంకిగా ఉన్నాయని వివరించారు.