
నారా రోహిత్
హిట్.. ఫ్లాప్.. లతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో బిజీగా ఉండే యంగ్ హీరో నారా రోహిత్ మరో సినిమాకు ఓకె చెప్పాడు. నిర్మాతగానూ బిజీ అవుతున్న రోహిత్ ప్రస్తుతం జగపతిబాబుతో కలిసి ఆటగాళ్లు సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే ఇప్పుడు మరో ప్రాజెక్ట్‌కు సైన్ చేశాడు రోహిత్. ఎస్‌డీ చక్రవర్తిని దర్శకుడిగా పరిచయం చేస్తూ ఈఎమ్‌వీఈ స్టూడియోస్ బ్యానర్‌పై తెరకెక్కతున్న సినిమాలో నటించనున్నాడు. వైవిధ్యమైన కథతో విలేజ్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఈ సినిమా మార్చి లో సెట్స్ మీదకు వెళ్లనుంది.
Comments
Please login to add a commentAdd a comment