Aatagallu
-
‘ఆటగాళ్ళు’ మూవీ రివ్యూ
టైటిల్ : ఆటగాళ్ళు జానర్ : థ్రిల్లర్ తారాగణం : నారా రోహిత్, జగపతి బాబు, దర్శన బానిక్, సుబ్బరాజు, బ్రహ్మానందం సంగీతం : సాయి కార్తీక్ దర్శకత్వం : పరుచూరి మురళి నిర్మాత : వాసిరెడ్డి రవీంద్రనాథ్, వాసిరెడ్డి శివాజీ ప్రసాద్, మక్కెన రాము, వడ్లపూడి జితేంద్ర కెరీర్ స్టార్టింగ్ నుంచి డిఫరెంట్ సినిమాలు చేస్తూ వస్తున్న యంగ్ హీరో నారా రోహిత్ మరో డిఫరెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. సీనియర్ నటుడు జగపతి బాబుతో కలిసి ఆటగాళ్ళుగా ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. లాంగ్ గ్యాప్ తరువాత పరుచూరి మురళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై టీజర్ రిలీజ్ అయిన దగ్గర నుంచే మంచి హైప్ క్రియేట్ అయ్యింది. మరి ఆ అంచనాల్ని ఆటగాళ్ళు అందుకున్నారా..? నారా రోహిత్ ఈ సినిమాతో కమర్షియల్ హిట్ సాధించాడా..? కథ ; ఎప్పటికైనా మహాభారతాన్ని డైరెక్ట్ చేయాలని కలలు గనే సినీ దర్శకుడు సిద్ధార్థ్ (నారా రోహిత్) . ఆ ప్రాజెక్టు పని మీద అంజలి(దర్శన్ బానిక్) అనే అమ్మాయిని కలిసి సిద్ధార్థ ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. మూడేళ్ల తర్వాత తన ఇంట్లోనే అంజలి ని దారుణంగా హత్య చేస్తారు. తన భార్యను చంపిన కేసులో సిద్ధార్థ్ ను రిమాండ్ కు పంపిస్తారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ వీరేంద్ర (జగపతిబాబు) సిద్ధార్థ్ ని కేసు నుంచి బయట పడేస్తాడు. (సాక్షి రివ్యూస్) అంజలిని చంపిన కేసు లో మున్నా అనే వ్యక్తికి శిక్ష పడుతుంది. నిజంగా మున్నానే అంజలి చంపాడా.? సిద్ధార్థని విడిపించిన వీరేంద్రే తనని ఎందుకు చంపాలనుకున్నాడు.? సిద్ధార్థ, వీరేంద్రల మధ్య యుద్ధంలో ఎవరు గెలిచారు? అన్నదే మిగతా కథ. నటీనటులు ; ఎత్తుకు పై ఎత్తులతో సాగే కథలో నారా రోహిత్, జగపతిబాబులు ఒకరితోఒకరు పోటి పడి నటించారు. రొమాంటిక్ సన్నివేశాల్లో లవర్ బాయ్ గా కనిపించిన నారా రోహిత్ తరువాత సీరియస్ లుక్‌లోనూ సూపర్బ్ అనిపించాడు. నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో మరోసారి తన మార్క్ చూపించాడు. న్యాయం ఎటు ఉంటే అటు వైపే వాదించే లాయర్‌గా జగపతిబాబు నటన సినిమాకు ప్లస్ అయ్యింది. హీరోయిన్ గా నటించిన దర్శన బానిక్ ది కథా పరంగా కీలక పాత్రే అయిన నటనకు పెద్దగా ఆస్కారం లేదు. (సాక్షి రివ్యూస్) ఉన్నంతలో నటనతో పాటు గ్లామర్షోతోను మంచి మార్కులు సాధించింది. చాలా కాలం తరువాత బ్రహ్మానందంకు కామెడీకి మంచి స్కోప్ ఉన్న పాత్ర దక్కింది. పోలీస్ ఆఫీసర్‌గా సుబ్బరాజు ఆకట్టుకున్నాడు. ఇతర పాత్రల్లో తులసి, శ్రీతేజ్, జీవా తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు. విశ్లేషణ ; ఓ కేసు నేపథ్యంలో కథా కథనాలను తయారు చేసుకున్న దర్శకుడు పరుచూరి మురళి నటీనటులు ఎంపికలో సగం సక్సెస్ అయ్యాడు. ఇలాంటి ప్రయోగాత్మక చిత్రాలకు ఎప్పుడు ముందుండే నారా రోహిత్, ప్రస్తుతం ఫుల్ ఫాంలో ఉన్న నటుడు జగపతి బాబు సినిమా స్థాయిని పెంచారు. ఫస్ట్ హాఫ్‌లో ఎక్కువ సేపు హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ సన్నివేశాలకు కేటాయించిన దర్శకుడు అసలు కథ స్టార్ట్ చేయడానికి చాలా సమయం తీసుకున్నాడు. కథనంలో థ్రిల్లర్ సినిమాకు కావాల్సిన వేగం కనిపించలేదు. (సాక్షి రివ్యూస్) ముఖ్యంగా లవ్ ట్రాక్ ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తుంది. ఫస్ట్ హాఫ్‌లో బ్రహ్మానందం కామెడీ కాస్త రిలీఫ్. కోర్టు సీన్ స్టార్ట్ అయిన తర్వాత కథనం ఆసక్తికరంగా మారుతుంది. సాయి కార్తీక్ సంగీతం పరవాలేదు. సినిమాటోగ్రఫి, ఎడిటింగ్ నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ ; నారా రోహిత్, జగపతి బాబు నటన నేపథ్య సంగీతం మైనస్ పాయింట్స్ ; లవ్ సీన్స్ స్లో నేరేషన్ సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్. -
వారికోసమైనా ‘ఆటగాళ్ళు’ ఆడాలి
‘‘ఆటగాళ్ళు’ వంటి సినిమా చేయడం కొంతవరకూ రిస్కే. అయినా నిర్మాతలు బడ్జెట్లో రాజీ పడకుండా ఈ సినిమా గ్రాండ్‌గా నిర్మించారు. మేమంతా బాగా ఇన్వాల్వ్ అయి ఈ సినిమా చేశాం. మా కోసం కాకపోయినా నిర్మాతల కోసమైనా ఈ సినిమా ఆడాలి’’ అని నటుడు జగపతిబాబు అన్నారు. నారా రోహిత్, దర్శనా బానిక్ జంటగా జగపతిబాబు ముఖ్యపాత్రలో పరుచూరి మురళి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఆటగాళ్ళు’. వాసిరెడ్డి రవీంద్రనాథ్, వాసిరెడ్డి శివాజీప్రసాద్, మక్కెన రాము, వడ్లపూడి జితేంద్ర నిర్మించిన ఈ సినిమా రేపు రిలీజ్ అవుతున్న సందర్భంగా ప్రెస్మీట్లో జగపతిబాబు మాట్లాడుతూ– ‘‘నేనీ సినిమా చేయడానికి ప్రధాన కారణం డైరెక్టర్ మురళి. నాతో ‘పెదబాబు’ సినిమా చేశాడు. ‘ఆటగాళ్ళు’ అవుట్‌పుట్ చూశాక కచ్చితంగా సక్సెస్ అవుతుందనిపించింది’’ అన్నారు. ‘‘ఆటగాళ్ళు’ చిత్రంలో ఫస్ట్ టైమ్ కొత్త జోనర్ చేశా. నన్ను కన్విన్స్ చేసి ఈ చిత్రం తీసిన మురళికి ధన్యవాదాలు. ఈ సినిమా బాగా ఆడి నిర్మాతలకు డబ్బులొస్తే వారు మరిన్ని సినిమాలు తీస్తారు’’ అన్నారు నారా రోహిత్. ‘‘ఈ చిత్ర నిర్మాతలు నా ఫ్రెండ్సే. వాళ్లు లేకపోతే ఈ సినిమా లేదు’’ అన్నారు పరుచూరి మురళి. ‘‘ఫ్రెండ్ కోసం ఓ పర్పస్‌తో ఈ సినిమా చేశాం’’ అన్నారు వాసిరెడ్డి రవీంద్రనాథ్. -
హీరోల్లో ఆ ముగ్గురంటే ఇష్టం
‘‘నాది కలకత్తా. బెంగాలీలో ఆరు సినిమాలతో పాటు ఓ వెబ్ సిరీస్‌లో నటించా. తెలుగులో ‘ఆటగాళ్ళు’ నా తొలి సినిమా’’ అని దర్శనా బానిక్ అన్నారు. నారా రోహిత్, జగపతిబాబు ప్రధాన పాత్రల్లో పరుచూరి మురళి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఆటగాళ్ళు’. వాసిరెడ్డి రవీంద్రనాథ్, వాసిరెడ్డి శివాజీ ప్రసాద్, మక్కెన రాము, వడ్లపూడి జితేంద్ర నిర్మించిన ఈ సినిమా ఈ నెల 24న విడుదలవుతోంది. ఈ సందర్భంగా చిత్రకథానాయిక దర్శనా బానిక్ మాట్లాడుతూ– ‘‘గతేడాది బాంబేలో ఓ మ్యూజిక్ వీడియోలో యాక్ట్ చేశా. ఆ వీడియో కొరియోగ్రాఫర్ విష్ణుదేవా నా ఫొటోషూట్ పిక్స్‌ని ‘ఆటగాళ్ళు’ చిత్ర దర్శక–నిర్మాతలకి పంపారు. ఆడిషన్స్, రోహిత్‌తో ఫొటోషూట్ చేశాక నన్ను ఎంపిక చేశారు. ఈ చిత్రంలో నా పాత్ర పేరు అంజలి. చాలా ఇండిపెండెంట్, వర్కింగ్ లేడీ. సిన్సియర్ ప్రేమికురాలు కూడా. పరుచూరి మురళిగారు ప్రతి సన్నివేశాన్ని చక్కగా తెరకెక్కించారు. నారా రోహిత్, జగపతిబాబుగారు పోటీ పడి నటించారు. బెంగాలీలో అనువాదమైన ‘మగధీర, ఆర్య, ధృవ, అరుంధతి, బాహుబలి’ సినిమాలు చూశా. ‘బాహుబలి’ బాగా నచ్చింది. హీరోల్లో షారుక్ ఖాన్, ప్రభాస్, అల్లు అర్జున్ అంటే ఇష్టం. డైరెక్టర్స్‌లో రాజమౌళిగారికి అభిమానిని. తెలుగు సినిమాల బడ్జెట్ ఎక్కువ.. బెంగాలీ సినిమాల బడ్జెట్ కాస్త తక్కువగా ఉంటుంది. తెలుగు, బెంగాలీ సినిమాలకి అంతే తేడా. ప్రస్తుతం నేను తెలుగు అర్థం చేసుకోగలను, కానీ మాట్లాడలేను. నెక్ట్స్ టైమ్ తెలుగులోనే మాట్లాడతా’’ అన్నారు. -
గేర్ మర్చాను
‘‘ఇంతకు ముందు కమర్షియల్ సినిమాలు చేశాను. కానీ ‘ఆటగాళ్లు’ సినిమాతో గేర్ మార్చాను. కమర్షియల్ ఫార్మాట్‌కు ఈ సినిమా భిన్నమైనది. మంచి సినిమా తీశాడని ప్రేక్షకులు ప్రశంసిస్తే చాలు. దర్శకునిగా నేను సక్సెస్ అయినట్లే’’ అన్నారు దర్శకుడు పరుచూరి మురళి. జగపతిబాబు, నారా రోహిత్ హీరోలుగా పరుచూరి మురళి దర్శకత్వంలో ఫ్రెండ్స్ మూవీ క్రియేషన్స్ పతాకంపై వాసిరెడ్డి రవీంద్రనాథ్, వాసిరెడ్డి శివాజీ ప్రసాద్, మక్కెన రాము, వడ్లమూడి జితేంద్రలు నిర్మించిన సినిమా ‘ఆటగాళ్లు’. ‘గేమ్ విత్ లైఫ్’ అనేది ఉపశీర్షిక. ఈ చిత్రం ఈ నెల 24న విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు మురళి మాట్లాడుతూ– ‘‘పర్సనల్ లైఫ్‌లో వచ్చే ప్రాబ్లమ్స్‌ను మైండ్ గేమ్‌తో ఇద్దరు హీరోలు ఎలా సాల్వ్ చేసుకుంటారు? అన్నదే ఈ సినిమా కథ. ఇందులో జగపతిబాబు, నారా రోహిత్ ఇద్దరు పాత్రలు హైలైట్‌గా ఉంటాయి. నారా రోహిత్ పాత్రకు ముందుగా ఏ హీరోనూ సంప్రదించలేదు. ఈ సినిమాలో రోహిత్ పాత్రకు జోడీగా దర్శనా బానిక్ కనిపిస్తారు. బెంగాల్లో ఆమె మంచి నటిగా పేరు సంపాదించారు. బ్రహ్మానందం, సుబ్బరాజు కీలక పాత్రలు చేశారు. ఈ సినిమాకు మా ఫ్రెండ్స్ నిర్మాతలుగా వ్యవహరించారు. జనరల్‌గా లాభం ఆశించి నిర్మాతలు డబ్బు ఖర్చు పెడతారు. కానీ ఈ సినిమా నిర్మాతలు కథకు ఖర్చుపెట్టారు. ఈ సినిమాలో జగపతిబాబు, నారా రోహిత్‌లలో ఎవరిని గెలిపించారు అంటే.. మంచిని గెలిపించాను. ప్రేక్షకులు మెచ్చే ప్రతిదీ మంచే’’ అన్నారు. ఇంకా మాట్లాడుతూ– ‘‘నిజానికి ఈ సినిమా కంటే ముందు యూపీ బ్యాక్‌డ్రాప్‌లో ఓ కమర్షియల్ సినిమా చేద్దాం అనుకున్నా. కానీ నా బంధువు సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఒకరు ‘ఆటగాళ్లు’ స్టోరీ లైన్ చెప్పాడు. చాలా ఎగై్జట్ అయ్యాను. నిర్మాతలకు కూడా కథ నచ్చడంతో సినిమా స్టార్ట్ చేశాం. ప్రేక్షకులకు కూడా నచ్చుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు దర్శకుడు మురళి. -
‘ఆటగాళ్ళు’ మూవీ స్టిల్స్
-
జీవితం కోసం ఆట
‘నీ స్నేహం, ఆంధ్రుడు’ వంటి హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించిన పరుచూరి మురళి తెరకెక్కించిన తాజా చిత్రం ‘ఆటగాళ్ళు’. ‘గేమ్ ఫర్ లైఫ్’ అన్నది ఉపశీర్షిక. నారా రోహిత్, జగపతిబాబు హీరోలుగా నటించారు. దర్శనా బానిక్ ఈ చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమకు కథానాయికగా పరిచయం అవుతున్నారు. ఫ్రెండ్స్ మూవీ క్రియేషన్స్ పతాకంపై వాసిరెడ్డి రవీంద్రనాథ్, వాసిరెడ్డి శివాజీ ప్రసాద్, రాము మక్కెన, వడ్లపూడి జితేంద్ర నిర్మించిన ఈ చిత్రాన్ని ఈ నెల 24న విడుదల చేస్తున్నారు. నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘ఇంటెలిజెంట్ థ్రిల్లర్ మూవీ ఇది. కథ వైవిధ్యంగా ఉంటుంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది. నారా రోహిత్, జగపతిబాబుపై వచ్చే ప్రతి సీన్ ఆకట్టుకుంటుంది. బ్రహ్మానందంగారు తనదైన శైలిలో నవ్విస్తారు. సాయికార్తీక్ సంగీతం, విజయ్ సి.కుమార్ సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి మరో హైలైట్. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి’’ అన్నారు. -
ఆటాడుకున్నారు
‘‘థ్రిల్లర్, మర్డర్ మిస్టరీ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘ఆటగాళ్ళు’. ప్రేక్షకులను థ్రిల్ చేస్తుంది. పరుచూరి మురళి ట్రైలర్‌ను అద్భుతంగా కట్ చేశాడు. మురళి స్నేహితుడు కావడంతో నిర్మాతలు కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమా గ్రాండ్‌గా నిర్మించారు’’ అని నటుడు జగపతిబాబు అన్నారు. నారా రోహిత్, జగపతిబాబు, బ్రహ్మానందం, దర్శనా బానిక్ ముఖ్య తారలుగా రూపొందిన చిత్రం ‘ఆటగాళ్ళు’. పరుచూరి మురళి దర్శకత్వంలో వాసిరెడ్డి రవీంద్రనాథ్, వాసిరెడ్డి శివాజీ ప్రసాద్, మక్కెన రాము, వడ్లపూడి జితేంద్ర నిర్మించిన ఈ సినిమా ట్రైలర్‌ను దర్శకుడు శేఖర్ కమ్ముల విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాతల్లో ఒకరైన వాసిరెడ్డి రవీంద్రనాథ్ మాట్లాడుతూ– ‘‘సినిమా మైండ్ గేమ్‌తో ఆసక్తికరంగా ఉంటుంది. నటన, డైలాగ్స్ పరంగా జగపతిబాబుగారు, నారా రోహిత్‌గారు ఆటాడుకున్నారు. సినిమా బాగా వచ్చింది. జగపతిబాబుగారు తొలిసారి లాయర్ పాత్రలో నటించారు’’ అన్నారు. ‘‘మర్డర్ మిస్టరీ మూవీ ఇది. ఇలాంటి జానర్లో సినిమా చేయడం నాకు కొత్త ఎక్స్పీరియన్స్ ఇచ్చింది’’ అన్నారు నారా రోహిత్. ‘‘ఈ సినిమాను ప్రేక్షకులకు రీచ్ చేయిస్తే చాలు. ఎందుకంటే థియేటర్‌కి వచ్చే ప్రేక్షకుడికి తప్పకుండా సినిమా నచ్చుతుంది. నా స్నేహితులే నిర్మాతలు కావడంతో నన్ను భరించి సినిమా పూర్తి చేశారు’’ అన్నారు పరుచూరి మురళి. నటులు శ్రీతేజ్, ఫణి, రైటర్ గోపీ పాల్గొన్నారు. -
లాయర్ vs డైరెక్టర్ : ఆటగాళ్లు
విభిన్న చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న టాలీవుడ్ యంగ్ హీరో నారా రోహిత్ త్వరలో ఆటగాళ్ళు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. పరుచూరి మురళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సీనియర్ నటుడు జగపతిబాబు మరో కీలక పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరపుకుంటున్న ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యింది. ఈ సినిమాలో నారా రోహిత్ సినీ దర్శకుడిగా కనిపిస్తుండగా జగపతి బాబు లాయర్ పాత్రలో నటించారు. క్రైం థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో రోహిత్ తన భార్యను చంపిన కేసులో ముద్దగా , జగపతి బాబు, రోహిత్‌కు వ్యతిరేకంగా వాదించే లాయర్‌గా కనిపిస్తున్నారు. రోహిత్‌ను దోషిగా ప్రూవ్ చేసేందుకు జగ్గుబాయ్ ఎత్తులు, కేసు నుంచి బయటపడేందుకు రోహిత్ ప్రయత్నాల నేపథ్యం సినిమా తెరకెక్కించారు. ఫ్రెండ్స్ మూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఆటగాళ్లు చిత్రానికి సాయి కార్తీక్ సంగీతమందిస్తున్నారు. ఈ సినిమా జూలై 5నప్రేక్షకుల ముందుకు రానుంది. -
‘ఆటగాళ్లు’
-
వార్ డ్రామాలో నారా రోహిత్
జయాపజయాలతో సంబంధం లేకుండా విభిన్న చిత్రాలతో అలరిస్తున్న నటుడు నారా రోహిత్. హీరోగా సినిమాలు చేస్తూనే నిర్మాతగా మారి తన అభిరుచికి తగ్గ సినిమాలను స్వయంగా నిర్మిస్తున్నాడు ఈ యంగ్ హీరో. ప్రస్తుతం సీనియర్ నటుడు జగపతి బాబుతో కలిసి ఆటగాళ్లు సినిమాలో నటిస్తున్న రోహిత్ త్వరలో పీరియాడిక్ వార్ డ్రామాకు అంగీకరించనట్టుగా తెలుస్తోంది. యువ దర్శకుడు చైతన్య 1971 యుద్ధ నేపథ్యంలో రెడీ చేసుకున్న కథ నారా రోహిత్‌కు బాగా నచ్చింది. అందుకే ఈ సినిమాను పెద్ద బడ్జెట్‌తో నారా రోహిత్ స్వయంగా నిర్మిత్చేందుకు రెడీ అవుతున్నారు. తన మార్కెట్ రేంజ్‌ను కూడా పక్కన పెట్టి భారీ ప్రాజెక్ట్‌గా ఈ సినిమాను తెరకెక్కించే ఆలోచనలో ఉన్నాడు నారా రోహిత్. ప్రస్తుతం చర్చల దలో ఉన్న ఈ ప్రాజెక్ట్‌పై త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడించనున్నారు. -
ఆటగాళ్ళు : రోహిత్ vs జగ్గు భాయ్
విభిన్న చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న టాలీవుడ్ యంగ్ హీరో నారా రోహిత్ త్వరలో ఆటగాళ్ళు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. పరుచూరి మురళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సీనియర్ నటుడు జగపతిబాబు మరో కీలక పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరపుకుంటున్న ఈ సినిమా టీజర్ రిలీజ్ అయ్యింది. ఈ సినిమాలో నారా రోహిత్ సినీ నటుడిగా కనిపిస్తుండగా జగపతి బాబు లాయర్ పాత్రలో నటించారు. టీజర్లోనే సినిమా కథేంటో రివీల్ చేసేశారు చిత్రయూనిట్. తన భార్యను చంపిన కేసులో రోహిత్ అరెస్ట్ కాగా రోహిత్‌కు వ్యతిరేకంగా వాధించే లాయర్ పాత్రగా నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో జగపతిబాబు కనిపించారు. ఫ్రెండ్స్ మూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి సాయి కార్తీక్ సంగీతమందిస్తున్నారు. ఈ సినిమా జూలై మొదటి వారంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. -
‘ఆటగాళ్ళ’ కోసం రానా
విభిన్న చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న టాలీవుడ్ యంగ్ హీరో నారా రోహిత్ త్వరలో ఆటగాళ్ళు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. పరుచూరి మురళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సీనియర్ నటుడు జగపతిబాబు మరో కీలక పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరపుకుంటున్న ఈ సినిమా టీజర్‌ను శనివారం రిలీజ్ చేయనున్నారు. శనివారం ఉదయం పదిన్నరకు యంగ్ హీరో రానా చేతుల మీదుగా ఈ టీజర్ ను రిలీజ్ చేస్తున్నారు. ఫ్రెండ్స్ మూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ సినిమాకు సాయి కార్తీక్ సంగీతమందిస్తున్నారు. రోహిత్ సరసన బెంగాలీ మోడల్ దర్శన బానిక్ హీరోయిన్గా నటిస్తున్నారు. జూలై మొదటి వారంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. -
జీవితంతో ఆట
నారా రోహిత్, జగపతిబాబు ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రం ‘ఆటగాళ్ళు’. ‘గేమ్ విత్ లైఫ్’ అన్నది ట్యాగ్‌లైన్. పరుచూరి మురళి దర్శకత్వంలో ఫ్రెండ్స్ మూవీ క్రియేషన్స్ పతాకంపై వాసిరెడ్డి రవీంద్ర, వాసిరెడ్డి శివాజీ, మక్కెన రాము, వడ్లపూడి జితేంద్ర నిర్మించారు. బ్రహ్మానందం ముఖ్య పాత్రలో కనిపించనున్న ఈ సినిమాతో దర్శనా బానిక్ హీరోయిన్గా పరిచయమవుతున్నారు. ఈ చిత్రాన్ని జూలై 5న విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘ఇంటెలిజెంట్ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రమిది. ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్‌కి మంచి స్పందన వచ్చింది. నారా రోహిత్, జగపతిబాబు పాత్రలు ఈ సినిమాకు ప్రధాన బలం. బ్రహ్మానందంగారి కామెడీ హైలైట్. మురళి ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు. సాయి కార్తీక్ సంగీతం, విజయ్ సి. కుమార్ సినిమాటోగ్రఫీ ప్రధాన ఆకర్షణలు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. మా సినిమా ప్రేక్షకులను అలరిస్తుందన్న నమ్మకం ఉంది’’ అన్నారు. -
‘ఆటగాళ్లు’ విడుదల తేదీ ఖరారు
కొత్త కథలతో ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేస్తుంటాడు నారా రోహిత్. మొదట్నుంచీ విభిన్న కథలతో సినిమాలు చేస్తూ వచ్చినా ఆశించిన స్థాయిలో ఈ యువ హీరోకు గుర్తింపు రాలేదు. అప్పట్లో ఒకడుండేవాడు, ప్రతినిధి, రౌడీఫెలో లాంటి సినిమాలతో మంచి విజయాలను అందుకున్నాడు. ప్రస్తుతం ఆటగాళ్లు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. నారా రోహిత్, జగపతి బాబు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ చిత్రం జూలై 5న విడుదల కానుంది. వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలే ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ అని చిత్రబృందం తెలిపింది. రోహిత్‌కు జంటగా దర్శనా బానిక్ తెలుగు తెరకు పరిచయమవుతున్నారు. పరుచూరి మురళి దర్శకత్వం వహించగా.. వాసిరెడ్డి రవీంద్ర, వాసిరెడ్డి శివాజీ, మక్కెన రాము, వడ్లపూడి జితేంద్ర సంయుక్తంగా నిర్మించారు. గేమ్ ఫర్ లైఫ్ అనే ఉపశీర్షికతో వస్తోన్న ఈ మూవీలో ఎవరి జీవితాలతో ఎవరు ఆడుకున్నారో తెలియాలంటే రిలీజ్ అయ్యేవరకూ వేచి చూడాల్సిందే. -
ఇద్దరు హీరోలు ఫ్రీడమ్ ఇచ్చారు
నారా రోహిత్, జగపతిబాబు ముఖ్య తారలుగా పరుచూరి మురళి దర్శకత్వంలో వాసిరెడ్డి రవీంద్రనాథ్, వాసిరెడ్డి శివాజీప్రసాద్, మక్కెన రాము, వడ్లమూడి జితేంద్రలు సంయుక్తంగా నిర్మించిన సినిమా ‘ఆటగాళ్ళు’. ‘గేమ్ ఫర్ లైఫ్’ అనేది ఉపశీర్షిక. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను జగపతిబాబు, నారా రోహిత్ కలిసి విడుదల చేశారు. జగపతిబాబు మాట్లాడుతూ–‘‘మురళి కథ చెప్పినప్పుడు..‘నాకు హీరోగా మార్కెట్ లేదు. విలన్‌గా ఉందని’ చెప్పి వెనక్కి పంపాను. కానీ మురళి పట్టువదలకుండ రోహిత్‌ను ఒకే చేసుకుని వచ్చాడు. రోహిత్ పాత్ర చేయడానికి ఎవరూ సాహసించరు. కథను నమ్మి పాత్ర చేసిన రోహిత్‌కు అభినందనలు’’ అన్నారు. నారా రోహిత్ మాట్లాడుతూ – ‘‘జగపతిబాబు గారితో ఫస్ట్‌టైమ్ వర్క్ చేశా. ఇలాంటి జోనర్ చేయడం ఇదే ఫస్ట్‌టైమ్. నా పాత్ర నాకే కొత్తగా అనిపించింది’’అన్నారు.‘‘పెదబాబు’ తర్వాత జగపతిబాబుగారితో చేసిన చిత్రమిది. ఫ్రీడమ్ ఇచ్చిన ఇద్దరు హీరోలకు థ్యాంక్స్. నా ముగ్గురు మిత్రులతో పాటు నేనూ నిర్మాతగా మారా. టెక్నీషియన్స్ చాలా కష్టపడ్డారు’’ అన్నారు దర్శకుడు పరుచూరి మురళి. వాసిరెడ్డి రవీంద్రనాథ్ మాట్లాడుతూ–‘‘షూటింగ్ పూర్తి అయ్యింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. త్వరలోనే ఆడియో, ట్రైలర్లను విడుదల చేసి ఆ నెక్ట్స్ మూవీ రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తాం’’ అన్నారు. ఈ కార్యక్రమంలో సాయికార్తీక్, ఫణిలతో పాటు ఇతర నిర్మాతలు, టెక్నీషియన్స్ పాల్గొన్నారు. -
తెలివైన ఆట
నారా రోహిత్, జగపతిబాబు ముఖ్య తారలుగా తెరకెక్కిన చిత్రం ‘ఆటగాళ్లు’. పరుచూరి మురళి దర్శకత్వంలో వాసిరెడ్డి రవీంద్ర, వాసిరెడ్డి శివాజీ, మక్కెన రాము, వడ్లపూడి జితేంద్ర సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రంతో దర్శనా బానిక్ కథానాయికగా తెలుగు తెరకు పరిచయమవుతున్నారు. ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. నారా రోహిత్ బుధవారం ఈ చిత్రానికి డబ్బింగ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ–‘‘ఇంటిలిజెంట్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందిన సినిమా ఇది. మేం ఊహించినదానికంటే అవుట్‌పుట్ చాలా బాగా వచ్చింది. దర్శకుడు ఈ చిత్రాన్ని అద్భుతంగా మలిచిన తీరు ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది. రోహిత్–జగపతిబాబుల పాత్రలు ప్రేక్షకుల్ని ఆద్యంతం ఆకట్టుకుంటాయి. త్వరలో ఫస్ట్ లుక్, ట్రైలర్ విడుదల చేసి, వేసవిలోనే చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: విజయ్.సి. కుమార్, సంగీతం: సాయికార్తీక్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎం.సీతారామరాజు. -
ఆట ముగిసింది
నారా రోహిత్, జగపతిబాబు ముఖ్య తారలుగా రూపొందుతోన్న చిత్రం ‘ఆటగాళ్లు’. ‘గేమ్ విత్ లైఫ్’ అన్నది ఉపశీర్షిక. పరుచూరి మురళి దర్శకత్వంలో ఫ్రెండ్స్ మూవీ క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతోన్న ఈ చిత్రం షూటింగ్ సోమవారం పూర్తవడంతో గుమ్మడికాయ కొట్టేశారు. నిర్మాతలు వాసిరెడ్డి రవీంద్ర, వాసిరెడ్డి శివాజీ, మక్కెన రాము, వడ్లపూడి జితేంద్ర మాట్లాడుతూ– ‘‘ఇంటెలిజెంట్ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న చిత్రమిది. వైవిధ్యమైన కథ కావడంతో ఇద్దరు హీరోలు నటించడానికి అంగీకరించారు. వీరు ఇలాంటి కథను ఒప్పుకోవడం వల్ల భవిష్యత్తులో మరిన్ని మంచి కథలు వస్తాయి. బ్రహ్మానందంగారి కామెడీ హైలైట్. అవుట్‌పుట్ చాలా బాగా వచ్చింది. మురళి ఈ చిత్రాన్ని మలిచిన తీరు ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలో ఫస్ట్ లుక్, ట్రైలర్ రిలీజ్ చేస్తాం. వేసవి కానుకగా చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నద్ధమవుతున్నాం. నారా రోహిత్ సరసన దర్శనా బానిక్ కథానాయికగా పరిచయం అవుతున్నారు’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: సాయికార్తీక్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎం.సీతారామరాజు. -
గుమ్మడికాయ కొట్టిన ‘ఆటగాళ్లు’
సెన్సిబుల్ యాక్టర్ నారా రోహిత్, స్టైలిష్ యాక్టర్ జగపతిబాబులు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా ‘ఆటగాళ్లు’. పరుచూరి మురళి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఫ్రెండ్స్ మూవీ క్రియేషన్స్ పతాకంపై వాసిరెడ్డి రవీంద్ర, వాసిరెడ్డి శివాజీ, మక్కెన రాము, వడ్లపూడి జితేంద్రలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇంటిలిజెంట్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు గేమ్ విత్ లైఫ్ అనేది ట్యాగ్‌లైన్. సోమవారంతో ఈసినిమా షూటింగ్ పూర్తయ్యింది. చిత్రబృందం సెట్ లో గుమ్మడికాయ కొట్టి షూటింగ్ పనులు ముగించారు.. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ.. ‘కథ నచ్చి ఇద్దరు హీరోలు నటించడానికి అంగీకరించారు. నారా రోహిత్‌గారు, జగపతిబాబుగారు ఇలాంటి కథను ఒప్పుకోవడం వల్ల భవిష్యత్తులో మరిన్ని మంచి కథలు వస్తాయి. చాలా వైవిద్యమైన సినిమా ఇది. బ్రహ్మానందంగారి కామెడీ హైలైట్ గా నిలుస్తుంది. అవుట్ పుట్ చాలా బాగా వచ్చింది. దర్శకుడు మురళి ‘ఆటగాళ్లు’ చిత్రాన్ని అద్భుతంగా మలిచిన తీరు ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది. నారా రోహిత్, జగపతిబాబుల పాత్రలు ఆడియన్స్ ను ఆకట్టుకుంటాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతోంది. త్వరలో ఫస్ట్ లుక్, ట్రైలర్ విడుదల చేసి వేసవి కానుకగా చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నద్ధమవుతున్నాం’ అన్నారు. -
మరో ప్రాజెక్ట్ ఓకె చేసిన రోహిత్
హిట్.. ఫ్లాప్.. లతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో బిజీగా ఉండే యంగ్ హీరో నారా రోహిత్ మరో సినిమాకు ఓకె చెప్పాడు. నిర్మాతగానూ బిజీ అవుతున్న రోహిత్ ప్రస్తుతం జగపతిబాబుతో కలిసి ఆటగాళ్లు సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే ఇప్పుడు మరో ప్రాజెక్ట్‌కు సైన్ చేశాడు రోహిత్. ఎస్డీ చక్రవర్తిని దర్శకుడిగా పరిచయం చేస్తూ ఈఎమ్వీఈ స్టూడియోస్ బ్యానర్‌పై తెరకెక్కతున్న సినిమాలో నటించనున్నాడు. వైవిధ్యమైన కథతో విలేజ్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఈ సినిమా మార్చి లో సెట్స్ మీదకు వెళ్లనుంది. -
‘ఆటగాళ్లు’ మొదలు పెట్టారు..!
విలన్ గా మారిన తరువాత వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్న సీనియర్ స్టార్ జగపతి బాబు, త్వరలో ఓ మల్టీ స్టారర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. విభిన్న చిత్రాలతో ఆకట్టుకుంటున్న యంగ్ హీరో నారా రోహిత్ తో కలిసి ఆటగాళ్లు అనే మల్టీ స్టారర్ సినిమాలో నటిస్తున్నాడు. పరుచూరి మురళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మాస్ యాక్షన్ జానర్ లో రూపొందుతోంది. ప్రారంభమైంది. ఫ్రెండ్స్ మూవీ క్రియేషన్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ బుధవారం మొదలైంది. ఇప్పటికే ఫస్ట్ లుక్ కు మంచి రెస్పాన్స్ రావటంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అభిమానుల అంచనాలను అందుకునే స్థాయిలో సినిమా తెరకెక్కుతుందంటున్నారు చిత్రయూనిట్.