Aatagallu Trailer: Nara Rohit as a Movie Director and Jagapati Babu as a Lawyer - Sakshi
Sakshi News home page

Published Sat, Jun 30 2018 11:54 AM | Last Updated on Sat, Jun 30 2018 3:23 PM

Nara Rohith Jagapathi Babu Aatagallu Trailer - Sakshi

విభిన్న చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న టాలీవుడ్‌ యంగ్‌ హీరో నారా రోహిత్‌ త్వరలో ఆటగాళ్ళు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. పరుచూరి మురళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న  ఈ సినిమాలో సీనియర్ నటుడు జగపతిబాబు మరో కీలక పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరపుకుంటున్న ఈ సినిమా ట్రైలర్‌ రిలీజ్‌ అయ్యింది. ఈ సినిమాలో నారా రోహిత్ సినీ దర్శకుడిగా కనిపిస్తుండగా జగపతి బాబు లాయర్‌ పాత్రలో నటించారు.

క్రైం థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో రోహిత్ తన భార్యను చంపిన కేసులో ముద్దగా , జగపతి బాబు, రోహిత్‌కు వ్యతిరేకంగా వాదించే లాయర్‌గా కనిపిస్తున్నారు. రోహిత్‌ను దోషిగా ప్రూవ్‌ చేసేందుకు జగ్గుబాయ్‌ ఎత్తులు, కేసు నుంచి బయటపడేందుకు రోహిత్ ప్రయత్నాల నేపథ్యం సినిమా తెరకెక్కించారు. ఫ్రెండ్స్‌ మూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఆటగాళ్లు చిత్రానికి సాయి కార్తీక్‌ సంగీతమందిస్తున్నారు. ఈ సినిమా జూలై 5నప్రేక్షకుల ముందుకు రానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement