
జయాపజయాలతో సంబంధం లేకుండా విభిన్న చిత్రాలతో అలరిస్తున్న నటుడు నారా రోహిత్. హీరోగా సినిమాలు చేస్తూనే నిర్మాతగా మారి తన అభిరుచికి తగ్గ సినిమాలను స్వయంగా నిర్మిస్తున్నాడు ఈ యంగ్ హీరో. ప్రస్తుతం సీనియర్ నటుడు జగపతి బాబుతో కలిసి ఆటగాళ్లు సినిమాలో నటిస్తున్న రోహిత్ త్వరలో పీరియాడిక్ వార్ డ్రామాకు అంగీకరించనట్టుగా తెలుస్తోంది.
యువ దర్శకుడు చైతన్య 1971 యుద్ధ నేపథ‍్యంలో రెడీ చేసుకున్న కథ నారా రోహిత్‌కు బాగా నచ్చింది. అందుకే ఈ సినిమాను పెద్ద బడ్జెట్‌తో నారా రోహిత్ స్వయంగా నిర్మిత్చేందుకు రెడీ అవుతున్నారు. తన మార్కెట్ రేంజ్‌ను కూడా పక్కన పెట్టి భారీ ప్రాజెక్ట్‌గా ఈ సినిమాను తెరకెక్కించే ఆలోచనలో ఉన్నాడు నారా రోహిత్. ప్రస్తుతం చర్చల దలో ఉన్న ఈ ప్రాజెక్ట్‌పై త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment