
కొత్త కథలతో ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేస్తుంటాడు నారా రోహిత్. మొదట్నుంచీ విభిన్న కథలతో సినిమాలు చేస్తూ వచ్చినా ఆశించిన స్థాయిలో ఈ యువ హీరోకు గుర్తింపు రాలేదు. అప్పట్లో ఒకడుండేవాడు, ప్రతినిధి, రౌడీఫెలో లాంటి సినిమాలతో మంచి విజయాలను అందుకున్నాడు. ప్రస్తుతం ఆటగాళ్లు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
నారా రోహిత్, జగపతి బాబు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ చిత్రం జూలై 5న విడుదల కానుంది. వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలే ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ అని చిత్రబృందం తెలిపింది. రోహిత్‌కు జంటగా దర్శనా బానిక్ తెలుగు తెరకు పరిచయమవుతున్నారు. పరుచూరి మురళి దర్శకత్వం వహించగా.. వాసిరెడ్డి రవీంద్ర, వాసిరెడ్డి శివాజీ, మక్కెన రాము, వడ్లపూడి జితేంద్ర సంయుక్తంగా నిర్మించారు. గేమ్ ఫర్ లైఫ్ అనే ఉపశీర్షికతో వస్తోన్న ఈ మూవీలో ఎవరి జీవితాలతో ఎవరు ఆడుకున్నారో తెలియాలంటే రిలీజ్ అయ్యేవరకూ వేచి చూడాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment