
నారా రోహిత్, జగపతిబాబు ముఖ్య తారలుగా రూపొందుతోన్న చిత్రం ‘ఆటగాళ్లు’. ‘గేమ్ విత్ లైఫ్’ అన్నది ఉపశీర్షిక. పరుచూరి మురళి దర్శకత్వంలో ఫ్రెండ్స్ మూవీ క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతోన్న ఈ చిత్రం షూటింగ్ సోమవారం పూర్తవడంతో గుమ్మడికాయ కొట్టేశారు. నిర్మాతలు వాసిరెడ్డి రవీంద్ర, వాసిరెడ్డి శివాజీ, మక్కెన రాము, వడ్లపూడి జితేంద్ర మాట్లాడుతూ– ‘‘ఇంటెలిజెంట్ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న చిత్రమిది. వైవిధ్యమైన కథ కావడంతో ఇద్దరు హీరోలు నటించడానికి అంగీకరించారు. వీరు ఇలాంటి కథను ఒప్పుకోవడం వల్ల భవిష్యత్తులో మరిన్ని మంచి కథలు వస్తాయి. బ్రహ్మానందంగారి కామెడీ హైలైట్. అవుట్‌పుట్ చాలా బాగా వచ్చింది.
మురళి ఈ చిత్రాన్ని మలిచిన తీరు ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలో ఫస్ట్ లుక్, ట్రైలర్ రిలీజ్ చేస్తాం. వేసవి కానుకగా చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నద్ధమవుతున్నాం. నారా రోహిత్ సరసన దర్శనా బానిక్ కథానాయికగా పరిచయం అవుతున్నారు’’ అన్నారు.
ఈ చిత్రానికి సంగీతం: సాయికార్తీక్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎం.సీతారామరాజు.
Comments
Please login to add a commentAdd a comment