తెలివైన ఆట | Nara Rohith starts dubbing for Aatagallu | Sakshi
Sakshi News home page

తెలివైన ఆట

Published Thu, Apr 5 2018 12:53 AM | Last Updated on Thu, Apr 5 2018 12:53 AM

Nara Rohith starts dubbing for Aatagallu  - Sakshi

నారా రోహిత్

నారా రోహిత్, జగపతిబాబు ముఖ్య తారలుగా తెరకెక్కిన చిత్రం ‘ఆటగాళ్లు’. పరుచూరి మురళి దర్శకత్వంలో వాసిరెడ్డి రవీంద్ర, వాసిరెడ్డి శివాజీ, మక్కెన రాము, వడ్లపూడి జితేంద్ర సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రంతో దర్శనా బానిక్‌ కథానాయికగా తెలుగు తెరకు పరిచయమవుతున్నారు. ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుపుకుంటోంది. నారా రోహిత్‌ బుధవారం ఈ చిత్రానికి డబ్బింగ్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ–‘‘ఇంటిలిజెంట్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో రూపొందిన సినిమా ఇది.

మేం ఊహించినదానికంటే అవుట్‌పుట్‌ చాలా బాగా వచ్చింది. దర్శకుడు ఈ చిత్రాన్ని అద్భుతంగా మలిచిన తీరు ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది.  రోహిత్‌–జగపతిబాబుల పాత్రలు ప్రేక్షకుల్ని ఆద్యంతం ఆకట్టుకుంటాయి. త్వరలో ఫస్ట్‌ లుక్, ట్రైలర్‌ విడుదల చేసి, వేసవిలోనే చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: విజయ్‌.సి. కుమార్, సంగీతం: సాయికార్తీక్, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: ఎం.సీతారామరాజు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement