
ఈశ్వర్ హీరోగా టువ చక్రవర్తి, అంకిత మహారాణా హీరోయిన్లుగా ఆర్.రఘురాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘4 లెటర్స్’. ఓం శ్రీచక్ర క్రియేషన్స్ బ్యానర్‌పై దొమ్మరాజు ఆశాలత, దొమ్మరాజు ఉదయ్ కుమార్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 22న విడుదలైంది. హైదరాబాద్‌లో ఈ సినిమా ప్రదర్శితమవుతున్న పలు థియేటర్లను చిత్రబృందం సందర్శించింది. అదేవిధంగా సెయింట్ మేరీస్ ఇంజినీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్‌తో చిత్రవిజయాన్ని పంచుకున్నారు.
‘‘నేటితరం ప్రేమకథా చిత్రంగా రుపొందిన ‘4 లెటర్స్’ యువతకు ఎంతగానో నచ్చింది. ప్రధానంగా హీరో కళాశాల ప్రొఫెసర్ల గురించి గొప్పగా, గౌరవంగా మాట్లాడే సన్నివేశాలు, ప్రేమ–పెళ్లి నేపథ్యంలో సాగే పతాక సన్నివేశాలతో పాటు కళాశాలలో జరిగే సన్నివేశాలలోని వినోదం ప్రేక్షకులను అలరిస్తున్నాయి. విద్యా బుద్ధులు నేర్పించిన గురువులకు విద్యార్థులు అండగా నిలవాలన్న సందేశం యువతను ఆలోచించేలా చేస్తోంది. ఇదే చిత్ర విజయానికి సంకేతం’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది.