‘4 లెట‌ర్స్‌’ విజయవంతం కావాలి : వెంకటేష్ | Hero Venkatesh Wishes 4 Letters Movie Team | Sakshi
Sakshi News home page

‘4 లెట‌ర్స్‌’ విజయవంతం కావాలి : వెంకటేష్

Published Tue, Feb 5 2019 1:02 PM | Last Updated on Wed, Feb 6 2019 5:33 AM

Hero Venkatesh Wishes 4 Letters Movie Team - Sakshi

ఓం శ్రీ చ‌క్ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ ప్రొడ‌క్షన్ నెం.1గా రూపొందుతోన్న చిత్రం ‘4 లెట‌ర్స్‌’. ఈశ్వర్‌, చ‌క్రవ‌ర్తి, అంకిత మ‌హారాణా హీరో హీరోయిన్లుగా ప‌రిచ‌యం అవుతున్న ఈ చిత్రాన్ని ఆర్‌.ర‌ఘురాజ్ ద‌ర్శకత్వంలో దొమ్మరాజు హేమ‌ల‌త‌, దొమ్మరాజు ఉద‌య్‌కుమార్ నిర్మిస్తున్నారు. ప్రముఖ కథానాయకుడు విక్టరీ వెంకటేష్‌ టీజర్, ట్రైలర్ను చూసి చిత్ర కథానాయకుడు, దర్శక, నిర్మాతలను అభినందించి, చిత్రం విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ఈ ట్రైలర్‌ను ఈ రోజు (మంగళవారం) సాయంత్రం విడుదల చేయనున్నారు.

ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని ‘A ’ సర్టిఫికెట్ ను పొందింది. ఫిబ్రవరి 22 న చిత్రం ను విడుదల చేస్తున్నట్లు నిర్మాత ఉదయ్ కుమార్  తెలిపారు. ఈ సంద‌ర్భంగా... నిర్మాత‌లు దొమ్మరాజు హేమ‌ల‌త‌, ఉద‌య్‌కుమార్ మాట్లాడుతూ - ‘మా బ్యాన‌ర్‌లో నిర్మిస్తోన్న తొలి చిత్రం 4 లెట‌ర్స్. ఈ చిత్రం టీజర్ ను సుప్రసిద్ధ దర్శకులు శ్రీ రాఘవేంద్ర రావు గారు విడుదల చేయటం మాకెంతో ఆనందంగా ఉంది. ఆయనకు కృతఙ్ఞతలు. చిత్రం ద్వారా ఈశ్వర్‌ను హీరోగా ప‌రిచ‌యం చేయ‌డం ఆనందంగా ఉంది. చాలా చ‌క్కగా న‌టించాడు. స‌త్యానంద్‌గారి వ‌ద్ద శిక్షణ తీసుకున్న ఈశ్వర్.. ఈ సినిమా కోసం చాలా హార్డ్ వ‌ర్క్ చేశాడు.  క‌మ‌ర్షియ‌ల్ హంగుల‌తో యూత్ స‌హా అన్నీ వ‌ర్గాల‌ను ఆకట్టుకునే ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ సినిమా రూపొందించాం అన్నారు.

హీరో ఈశ్వర్ మాట్లాడుతూ.. ‘విక్టరీ వెంకటేష్ గారి ఆశీస్సులు అందుకోవటం ఎంతో ఆనందంగా ఉంది.  చిత్రం కూడా ప్రేక్షకాదరణకు నోచుకుంటుందనే నమ్మకం ఉందని అన్నారు. ద‌ర్శకుడు ఆర్.ర‌ఘురాజ్ మాట్లాడుతూ ‘క‌లుసుకోవాల‌ని త‌ర్వాత  తెలుగులో నేను డైరెక్ట్ చేసిన మూవీ ఈ 4 లెట‌ర్స్‌. ఇది నేటితరం ప్రేమకథాచిత్రం. ప్రేమ, పెళ్లి విషయాలలో నేటితరం యువత ఆలోచనలు, అభిప్రాయాలు, వాస్తవాలు ఏమిటన్నది విషయాలను వాస్తవానికి దగ్గరగా ఉండేలా చిత్రీకరించటం జరిగింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement