
నటుడు చక్రవర్తి (ఫైల్)
తమిళసినిమా: సీనియర్ తమిళ నటుడు చక్రవర్తి శనివారం ఉదయం ముంబయిలో గుండెపోటుతో మరణించాడు. ఈయన వయసు 62 ఏళ్లు. 1980 ప్రాంతంలో ప్రముఖ నటుడిగా రాణించిన ఈయన తమిళంలో వివిధ పాత్రల్లో 80 చిత్రాల వరకు చేశారు. శివాజీ గణేశన్, రజనీకాంత్, కమలహాసన్ వంటి ప్రముఖ నటులతో కలిసి నటించారు. శివాజీ గణేశన్ కథానాయకుడు నటించిన రిషి మూలం చిత్రం ద్వారా చక్రవర్తి నటుడిగా పరిచయమయ్యారు. కొంతకాలం తరువాత సినిమాలకు దూరమై ముంబయికి వెళ్లిపోయారు.
అక్కడ సోనీ స్టార్ స్పోర్ట్స్ ఛానల్‌లో పని చేశారు. ఈయన దక్షిణ భారత సినీ నటీనటుల సంఘంలో సభ్యుడిగా కొనసాగుతూ వచ్చారు. కాగా శనివారం ఉదయం గుండెపోటుతో నిద్రలోనే తుది శ్వాస విడిచారు. ఆయన సతీమణి ఉదయాన్నే లేపినా లేవకపోవడంతో వెంటనే సమీపంలోని ఆసుపత్రిలో చేర్చారు. అయితే వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు చక్రవర్తి గుండెపోటుతో నిద్రలోనే మరణించినట్లు తెలిపారు. ఈయనకు భార్య లలిత, శశికుమార్, అజయ్‌కుమార్ అనే ఇద్దరు కొడుకులు ఉన్నారు.
చదవండి: (వెటరన్ స్క్రీన్ రైటర్ కన్నుమూత.. ప్రముఖుల సంతాపం)
Comments
Please login to add a commentAdd a comment