ఢిల్లీలో సమైక్యవాదుల అరెస్ట్
ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ సమైక్యవాదులను ఢిల్లీ పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేశారు. విశాలాంధ్ర మహాసభ ఆధ్వర్యంలో సమైక్యవాదులు ఏఐసిసి కార్యాలయాన్ని ముట్టడించారు. ఎన్నడూ జరగనంత భారీస్థాయిలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. కార్యకర్తలు అధిక సంఖ్యలో కార్యాలయం లోపలకు చొచ్చుకుపోవడానికి ప్రయత్నించారు. పోలీసులు వారిని నెట్టివేశారు. ఈ సందర్భంగా కార్యకర్తలకు, పో్లీసులకు మధ్య తోపులాట జరిగింది. కొందరు విశాలాంధ్ర మహాసభ సభ్యులకు గాయాలయ్యాయి. కార్యకర్తలు కార్యాలయం లోపలకు చెప్పులు విసిరేశారు.
సమైక్యవాదులు 3 గంటలపాటు ధర్నా నిర్వహించారు. తెలుగుతల్లి, వందేమాతరం గేయాలు పాడుతూ నిరసన తెలిపారు. పోలీసులు భారీగా మోహరించారు. దాంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సమైక్యవాదులు పలువురిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల అరెస్ట్లకు నిరసనగా వారు నినాదాలు చేశారు.