United activists
-
కేంద్ర మంత్రి కావూరిని అడ్డుకున్న సమైక్యవాదులు
ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా పోలవరంలో కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావుకు సమైక్యసెగ తగిలింది. రచ్చబండకు వెళ్తున్న కావూరిని సమైక్యవాదులు అడ్డుకోవడానికి ప్రయత్నించారు. పోలీసుల పహారాలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. రచ్చబండలో కావూరి మాట్లాడుతూ కేంద్ర మంత్రుల బృందం(జిఓఎం) ముందు రేపు సమైక్యవాదం గట్టిగా వినిపిస్తామని చెప్పారు. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హొదా ఖాయం అని చెప్పారు. విభజన అనివార్యమైతే భద్రాచలం సీమాంధ్రకే చెందాలన్నారు. -
ఢిల్లీలో సమైక్యవాదుల అరెస్ట్
-
ఢిల్లీలో సమైక్యవాదుల అరెస్ట్
ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ సమైక్యవాదులను ఢిల్లీ పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేశారు. విశాలాంధ్ర మహాసభ ఆధ్వర్యంలో సమైక్యవాదులు ఏఐసిసి కార్యాలయాన్ని ముట్టడించారు. ఎన్నడూ జరగనంత భారీస్థాయిలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. కార్యకర్తలు అధిక సంఖ్యలో కార్యాలయం లోపలకు చొచ్చుకుపోవడానికి ప్రయత్నించారు. పోలీసులు వారిని నెట్టివేశారు. ఈ సందర్భంగా కార్యకర్తలకు, పో్లీసులకు మధ్య తోపులాట జరిగింది. కొందరు విశాలాంధ్ర మహాసభ సభ్యులకు గాయాలయ్యాయి. కార్యకర్తలు కార్యాలయం లోపలకు చెప్పులు విసిరేశారు. సమైక్యవాదులు 3 గంటలపాటు ధర్నా నిర్వహించారు. తెలుగుతల్లి, వందేమాతరం గేయాలు పాడుతూ నిరసన తెలిపారు. పోలీసులు భారీగా మోహరించారు. దాంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సమైక్యవాదులు పలువురిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల అరెస్ట్‌లకు నిరసనగా వారు నినాదాలు చేశారు. -
పల్లంరాజును అడ్డుకున్న సమైక్యవాదులు
-
పల్లంరాజును అడ్డుకున్న సమైక్యవాదులు
కాకినాడ: తూర్పుగోదావరి జిల్లాలో అడుగడుగున కేంద్ర మంత్రి పల్లంరాజును సమైక్యవాదులు అడ్డుకుంటున్నారు. ఈ రోజు సామర్లకోటలో సమైక్యవాదులు ఆయనను అర్ధగంటసేపు ఘోరావ్ చేశారు. రాజీనామా ఎందుకు చేయలేదని నిలదీశారు. తక్షణం రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కాకినాడ నుంచి సామర్లకోట వస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. సమైక్యవాదులు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి పల్లంరాజు మాట్లాడుతూ తన చేతిలో ఏమీలేదని అంతా కేంద్ర చేతిలో ఉన్నట్లు తెలిపారు. అంతకు ముందు శ్రీకాకుళం జిల్లా కొత్తూరులో మంత్రి శత్రుచర్ల విజయమరామరాజును సమైక్యవాదులు అడ్డుకున్న విషయం తెలిసిందే. ఆయన కాన్వాయ్‌పై సమైక్యవాదులు రాళ్లు, చెప్పులు విసిరారు. సమైక్యాంధ్రకు ద్రోహం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.