
కేంద్ర మంత్రి కావూరిని అడ్డుకున్న సమైక్యవాదులు
పశ్చిమగోదావరి జిల్లా పోలవరంలో కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావుకు సమైక్యసెగ తగిలింది.
ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా పోలవరంలో కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావుకు సమైక్యసెగ తగిలింది. రచ్చబండకు వెళ్తున్న కావూరిని సమైక్యవాదులు అడ్డుకోవడానికి ప్రయత్నించారు. పోలీసుల పహారాలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు.
రచ్చబండలో కావూరి మాట్లాడుతూ కేంద్ర మంత్రుల బృందం(జిఓఎం) ముందు రేపు సమైక్యవాదం గట్టిగా వినిపిస్తామని చెప్పారు. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హొదా ఖాయం అని చెప్పారు. విభజన అనివార్యమైతే భద్రాచలం సీమాంధ్రకే చెందాలన్నారు.