'వీర తెలంగాణ మాది, వేరు తెలంగాణ కాదు' | Veera Telangana ours, is not a separate Telangana: Visalandhra Mahasabha | Sakshi
Sakshi News home page

'వీర తెలంగాణ మాది, వేరు తెలంగాణ కాదు'

Published Sun, Aug 4 2013 2:49 PM | Last Updated on Fri, Sep 1 2017 9:38 PM

'వీర తెలంగాణ మాది, వేరు తెలంగాణ కాదు'

'వీర తెలంగాణ మాది, వేరు తెలంగాణ కాదు'

హైదరాబాద్: ముందుముందు రాష్ట్రం మరిన్ని ముక్కలుగా విడిపోయే ప్రమాదం ఉందని  విశాలాంధ్ర మహాసభలో ప్రసంగించిన వక్తలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈరోజు ఇక్కడ జరుగుతున్న విశాలాంధ్ర మహాసభలో పలువురు మాట్లాడుతూ వీర తెలంగాణ మాది, వేరు తెలంగాణ కాదన్నారు. వేర్పాటు వాదాన్ని తిప్పి కొడతామని శపధం చేశారు.

 తెలంగాణ ప్రాంతంలోని ప్రజలందరూ ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుకోవడం లేదని  స్పష్టం చేశారు. సమైక్యరాష్ట్రం కోరుకునే వారి సంఖ్య ఇక్కడ కూడా ఎక్కువగానే వుందని తెలిపారు. తెలంగాణలోని ప్రజలందరూ ప్రత్యేకవాదులు కాదని చెప్పారు.  రాష్ట్ర విభజనకు తాము వ్యతిరేకమని, రాష్ట్రం సమైక్యంగా ఉంచేందుకు ఏ త్యాగానికైనా తాము సిద్దమని ప్రతిన బూనారు. రాష్ట్ర విభజన ప్రయత్నాలను అడ్డుకుంటామన్నారు. తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ మూడు ప్రాంతాల్లోని సమైక్య గళం వినిపించే నాయకులు ముందుకు రావాలని పిలుపు ఇచ్చారు.  రాష్ట్ర విభజనకు ఒప్పుకునేదిలేదని స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement