
ఈ బిల్లును మొదట రాజ్యసభలో ప్రవేశపెట్టకూడదు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ బిల్లు (తెలంగాణ బిల్లు)ను మొదట రాజ్యసభలో ప్రవేశపెట్ట కూడదని విశాఖలాంధ్ర మహాసభ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ బిల్లును మొదట లోక్‌సభలోనే ప్రవేశపెట్టాలని తెలిపింది.
తెలంగాణ బిల్లు ఆర్థిక అంశాలతో ముడిపడి ఉన్నందున మొదట రాజ్యసభలో ప్రవేశపెట్టకూడదని ఆ ప్రకటనలో వివరించింది. లోక్‌సభ బిల్లును ఆమోదించిన తర్వాత రాజ్యసభకు పంపాలని తెలిపింది.