రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ విశాలాంధ్ర మహాసభ కార్యకర్తలు దేశ రాజధానిలో ఉద్యమ బాటతొక్కారు.
రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ విశాలాంధ్ర మహాసభ కార్యకర్తలు దేశ రాజధానిలో ఉద్యమ బాటతొక్కారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేస్తూ బీజేపీ జాతీయ కార్యాలయాన్ని ముట్టించారు.
జై సమక్యాంధ్ర అని నినాదాలు చేస్తూ కార్యాలయం ముందు బైఠాయించారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. బీజేపీ కార్యాలయం వద్ద భారీగా బలగాలను మోహరించారు. తెలంగాణ ఏర్పాటుకు బీజేపీ మద్దతు ఇవ్వరాదని విశాలాంధ్ర మహాసభ కార్యకర్తలు డిమాండ్ చేశారు.