చంద్రబాబు మాటలు నమ్మొద్దు | State division of the TDP, BJP, Congress | Sakshi
Sakshi News home page

చంద్రబాబు మాటలు నమ్మొద్దు

Published Mon, Apr 28 2014 2:14 AM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM

చంద్రబాబు మాటలు నమ్మొద్దు - Sakshi

చంద్రబాబు మాటలు నమ్మొద్దు

 గజపతినగరం రూరల్, న్యూస్‌లైన్ : టీడీపీ అధినేత చంద్రబాబు ఎలాగైనా అధికారంలోకి రావాలన్న ఉద్దేశంతో ఆచరణ సాధ్యం కాని హామిలిస్తున్నారని, ఆయన మాటలను ఎవరూ నమ్మవద్దని వైఎస్సార్ సీపీ గజపతినగరం ఎమ్మెల్యే అభ్యర్థి కడుబండి శ్రీనివాసరావు అన్నారు. రాష్ట్రాభివృద్ధి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలనతోనే సాధ్యమని తెలిపారు. ఆదివారం మండల కేంద్రంలోని వైఎస్సార్ విగ్రహం ఆవరణలో కాంగ్రెస్, టీడీపీలకు చెందిన వందలాది మంది నా యకులు, కార్యకర్తలు వైఎస్సార్ సీపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజనకు టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్ ప్రధాన కారణమన్నారు. ఆ మూడు పార్టీలకు ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. టీడీపీ ప్రజల విశ్వసనీయతను పూ ర్తిగా కోల్పోయిందన్నా రు.
 
 తమ పార్టీ మేనిఫెస్టో అన్ని వర్గాలకు మేలు చేసే విధం గా ఉందని తెలిపారు. అనంతరం టీడీపీ మండల మాజీ అధ్యక్షుడు గెద్ద రవి, మాజీ ఎంపీపీ కర్రి దేవి, కర్రి శ్రీనివాసరావు, టీడీపీ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి మండల లక్ష్మునాయుడు,ఎం. గుమడాం ఎంపీటీసీ   మాజీ సభ్యుడు అల్లు శ్రీనివాసరావు, గెద్ద బాను, శీర రమణ తదితరులతో పాటు 2000 వేల కుటుంబాలు పార్టీలో చేరాయి. వారికి కడుబండి కండువాలు వేసి, పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకుడు గెద్ద రవి మాట్లాడుతూ టీడీపీలో దొంగలు చేరి ఆ పార్టీని పూర్తిగా నాశనం చేశారన్నారు. పార్టీలో 26 ఏళ్ల పాటు కష్టపడిన తమలాంటి వారికి గుర్తింపు లేకుండా చేశారని విమర్శించారు. ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థిని ఓడిస్తామని తెలిపారు.     ఈ కార్యక్రమంలో రాంజీ రాజు, జెడ్పీటీసీ అభ్యర్థ్దిని తాడ్డి పార్వతమ్మ, ఏండ్రాపు శ్రీను, బూడి వెంకటరావు, దేవుడు జేఈ మంత్రి నర్సింగరావు, తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement