GAJAPATHINAGARAM
-
గజపతినగరం... ఇక్కడా మాక్ పోలింగ్‌తోనే ఈసీ సరి!
సాక్షి, విజయనగరం: గజపతినగరం నియోజకవర్గంలో ఈవీఎం తనిఖీ అనుమానాస్పదంగా మారింది. గజపతినగరం అసెంబ్లీ సెగ్మెంట్ ఓట్లపై వైఎస్సార్సీపీ నేతలు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. పోలింగ్ బూత్ నంబర్ 20, పెదకాద ఈవీఎం తనిఖీ చేయాలని, వీవీప్యాట్ లెక్కించాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే వైఎస్సార్సీపీ ఫిర్యాదుకు సంబంధం లేకుండా అధికారులు మాక్ పోలింగ్ నిర్వహించడం వివాదస్పదంగా మారింది.పెదకాద ఈవీఎంలో డేటా మొత్తం అధికారులు తొలగించారు. వీవీప్యాట్ బాక్స్‌లోనూ వీవీప్యాట్లు కనిపించలేదు. ఈవీఎంలో డేటా తొలగించి కొత్త గుర్తులను లోడ్ చేశారు. అయితే కొత్త గుర్తులతో మాక్ పోలింగ్ నిర్వహించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వైఎస్సార్సీపీ అడిగిన ఈవీఎం స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ కేంద్రం సీసీ ఫుటేజ్, బాటరీ లెవెల్ డేటాను ఎన్నికల అధికారులు ఇవ్వలేదు.దీంతో ఒంగోలు తరహాలోనే మాక్ పోలింగ్‌తో అధికారులు డ్రామా నడిపిస్తున్నట్లు ఆరోపణలు వస్తన్నాయి. కొత్త గుర్తులతో 1400 ఓట్లు మాక్ పోలింగ్ జరిగింది. ఫ్యాన్, సైకిల్ గుర్తులు లేకుండానే మాక్ పోలింగ్ నిర్వహణ పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
వెరిఫికేషన్ కి వచ్చి తాళాలు లేవని ఎన్నికల అధికారుల హై డ్రామా
-
అయ్యో..పాపం పసికందు..!
సాక్షి, గజపతినగరం రూరల్: ఏ తల్లి కన్నదో ఆ బిడ్డను. నవమాసాలు మోసి... ప్రసవవేదన అనుభవించి... చివరకు జన్మనిచ్చింది. కానీ ఆ బిడ్డ వారికి బరువైందో... మృతశిశువును కన్నదో... పుట్టిన బిడ్డ ఊపిరాగిందో... లేక ఏ ప్రబుద్ధుడి మోసానికి బలై అన్యాయంగా తల్లిగా మారిందో... కానీ ఓ మగబిడ్డను నిర్దాక్షిణ్యంగా రోడ్డు పక్కన కాలువలో పడేశారు. నీటిలో తేలియాడితూ పసికందు మృతదేహం మంగళవారం ఉదయం వెలుగు చూసింది. గజపతినగరం రైల్వేస్టేషన్ సమీపంలో జాతీయ రహదారి వద్ద చిన్న పాటిగా ఉన్న లోతట్టు ప్రాంతంలోని నీటిలో తేలియాడుతున్న ఆ పసికందు మృతదేహాన్ని స్థానికులు గుర్తించి మధుపాడ వీఆర్ఓ దాసరి అప్పలరాజుకు సమాచారం అందించారు. ఆయన గజపతినగరం పోలీస్ స్టేషన్‌కు తెలియజేయడంతో సీఐ విద్యాసాగర్, ఎస్ఐ సన్యాసినాయుడు అక్కడకు చేరుకొని మృతశిశువును పరిశీలించారు. అనంతరం ఆ మృతశిశువును శవపంచనామాకోసం తరలించారు. అయితే ఆ బిడ్డ మృతి చెంది మూడు లేదా నాలుగు రోజులు అయి ఉండవచ్చని ప్రాథమికంగా ఆస్పత్రిలో పరిశీలించిన గజపతినగరం సూపరింటెండెంట్ డాక్టర్ అరుణా దేవి తెలిపారు. కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ఎ.సన్యాసినాయుడు తెలిపారు. -
ఫోర్జరీ సంతకాలతో విత్తనాలు స్వాహా...
సాక్షి, గజపతినగరం రూరల్ (విజయనగరం): మండలానికి చెందిన కొంతమంది టీడీపీ నాయకులు వ్యవసాయాధికారుల సంతకాలు ఫోర్జరీ చేసి వరి విత్తనాలు తీసుకెళ్లిన సంఘటన చర్చనీయాంశమవుతోంది. ఈ వ్యవహారంపై పో లీసులకు ఫిర్యాదు చేసే యోచనలో వ్యవసాయా శాఖాధికారులున్నారు. విషయంలోకి వెళ్తే... మండల వ్యవసాయాధికారి టి. సంగీత ఈ నెల 20వ తేదీన మండల కేంద్రంలోని పీఏసీఎస్ కార్యాలయం వద్ద కెంగువ, తుమ్మికాపల్లి, లోగిశ గ్రామాలకు చెందిన రైతులకు రాయితీ వరి విత్తనాలు పంపిణీ చేశారు. అయితే కెంగువ గ్రామానికి సంబంధించి 25 స్లిప్పులు ఎక్కువగా వచ్చాయి. దీంతో ఏఓ సంగీతకు అనుమానం వచ్చి ఆయా స్లిప్పులను పరిశీలించగా.. 25 స్లిప్పులపై తమ సంతకాలను ఫోర్జరీ చేసినట్లు గుర్తించారు. వాస్తవానికి రైతుకు విత్తన బస్తా మంజూరు కావాలంటే వ్యవసాయాధికారి సంతకం చేసిన స్లిప్పు ఉండాలి. రైతులందరూ వారి పట్టాదారు పాస్ పుస్తకాలు అధికారులకు చూపిస్తే ఏఓ కార్యాలయం సిబ్బంది స్లిప్పు అందిస్తారు. ఈ స్లిప్పు పీఏసీఎస్ కార్యాలయంలో చూపించి రాయితీపై వరి విత్తన బస్తా పొందాల్సి ఉంటుంది. అయితే రైతులకు స్లిప్పులు పంపిణీ చేయడం కోసం వ్యవసాయ శాఖ కార్యాలయం సిబ్బంది స్టాంప్ వేసిన స్లిప్పులను సిద్ధంగా ఉంచుకున్నారు. ఇదే అదునుగా ఏఓ కార్యాలయంలోని స్లిప్పులను కెంగువకు చెందిన టీడీపీ నాయకులు కొందరు స్వాహా చేసి.. వాటిపై ఏఓ సంతకం చేసి విత్తనాలు తీసుకున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఈ విషయమై గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు మజ్జి గోవింద, తదితరులను ఏఓ ప్రశ్నించారు. అయితే ఆయన నుంచి సరైన సమాధానం రాకపోవడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళ్లింది. అయితే ఏమైందో ఏమో కాని పోలీసులకు ఎటువంటి ఫిర్యాదు చేయలేదు. వాస్తవాలు తెలియాలి... ఫోర్జరీ సంతకాలతో విత్తనాలు తీసుకెళ్లినట్లు ఆధారాలున్నా అధికారులు టీడీపీ నాయకులపై వ్యవసాయాధికారులు ఎందుకు ఫిర్యాదు చేయలేదో అర్థం కావడం లేదని వైఎస్సార్సీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఫోర్జరీ పత్రాలపై కెంగువ గ్రామానికి చెందిన మజ్జి రామునాయుడు, యిజ్జిరోతు పాపినాయుడు, దాసరి చిన్నంనా యుడు, మండల రామునాయుడు, మండల అప్పలనాయుడు, మిత్తిరెడ్డి సింహాచలం, మిత్తిరెడ్డి సూర్యనారాయణ, మిత్తిరెడ్డి బంగారునాయుడు, గుడివాడ రమణ, అలుగోలు పెంటయ్య, కొండల రాము, ఎండ బంగారప్పడు, ఎండ నారాయణ, మజ్జి సన్యాసియుడు, మజ్జి కామునాయుడు, కర్రి తవుడు, దాసరి సూరినాయుడు, మజ్జి సింహాచలం, మద్ది సత్యం, మద్ది పైడిరాజు, పల్లేడ సత్యమమ్మ, బూడి పాపినాయుడు, పెనుమజ్జి రాము, మజ్జి చిన్నంనాయుడు, తదితరులకు విత్తనాలు అందినట్లు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ఫోర్జరీ చేసిన నిందితులపై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ నాయకులు, రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఫిర్యాదు చేస్తాను... ఈ నెల 20వ తేదీన జరిగిన విత్తనాల పంపిణీలో 25 ప్యాకెట్లకు సంబంధించి ఫోర్జరీ సంతకంతో కూడిన స్లిప్పులు వచ్చినా తొందరపాటులో విత్తనాలు ఇచ్చేశాం. వెంటనే అక్రమాన్ని పసిగట్టి నిందితులపై ఫిర్యాదు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. విత్తనాల విషయంలో రైతులు ఎటువంటి ఆందోళన చెందనవసరం లేదు. – టి. సంగీత, మండల వ్యవసాయాధికారి, గజపతినగరం ఎందుకు ఫిర్యాదు చేయలేదు.. ఫోర్జరీ సంతకాల విషయంలో అ టు టీడీపీ, ఇటు వ్యవసాయ శా ఖాధికారులపై అనుమానాలు న్నాయి. 25 బస్తాల విత్తనాలు బయటకు వెళ్లిపోయినా ఎందుకు పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. ఫోర్జరీ సంతకాలతో విత్తనాలు వెళ్లిపోయిన విష యం ఏఓకు తెలుసు. అయినా ఎటువంటి చర్యలు తీ సుకోకపోవడం దారుణం. – లెంక గణేష్, కెంగువ విచారకరం.. అందరి రైతులకు అందాల్సిన విత్తనాలు కొంతమంది తప్పుడు సంతకాలతో తీసుకెళ్లిపోవడం విచారకరం. టీడీపీ నాయకులు స్లిప్పులు దొంగిలించి వాటిపై రైతుల పేరు రాసుకుని ఏఓ సంతకం ఫోర్జరీ చేసి విత్తనాలు తీసుకెళ్లిపోయారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి జరిగిన తతంగంపై విచారణ చేపట్టాలి. – గుడివాడ తాతయ్యలు -
284వ రోజు ప్రారంభమైన ప్రజాసంకల్పయాత్ర
సాక్షి, గజపతినగరం: ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 284వ రోజు శనివారం ఉదయం విజయనగరం జిల్లా గజపతినగరం శివారు నుంచి ప్రారంభమైంది. ఆయన వెంట నడిచేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ జననేత పాదయాత్ర సాగిస్తున్నారు. అడుగడునా సమస్యలు తెలుసుకుంటూ వైఎస్ జగన్ ముందుకు కదులుతున్నారు. వైఎస్ జగన్ రాకతో పాదయాత్ర సాగుతున్న మార్గంలో పండుగ వాతావరణం నెలకొంది. గజపతినగరం నియోజకవర్గంలోని మధుపాడు, భూదేవీపేట క్రాస్, మరుపల్లి, కొత్తరోడ్డు జంక్షన్, గుడివాడ క్రాస్, మానాపురం, మానాపురం సంత మీదుగా కోమటిపల్లి వరకు ఈ రోజు పాదయాత్ర సాగనుంది. -
అన్నదాతకు అండ..
సాక్షి ప్రతినిధి, విజయనగరం: ఓ వైపు టిట్లీ పెను తుఫాన్... మరో వైపు ఉదయం నుంచి వీస్తున్న భారీ ఈదురుగాలులు... ఇంకో వైపు భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ హెచ్చరికలు ప్రజాభిమానం ముందు చిన్నబోయాయి. తమ కష్టాలు తీర్చే నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపడుతున్న ప్రజా సంకల్పయాత్ర నేపథ్యంలో ఇవేమీ ఖాతరు చేయని జనఝరి నడుమ 283వ రోజు పాదయాత్ర విజయవంతంగా సాగింది. చిక్కటి చిరునవ్వుతో.. ఆప్యాయత... ఆదరణతో జననేతకు ఎదురేగి స్వాగతం పలికారు. బుధవారం ఉదయం నుంచి జనాభిమానం నడుమ పాదయాత్ర చేపట్టిన జగన్‌కు అపూర్వ ఆదరణ లభించగా... సాయంత్రం గజపతినగరంలో నిర్వహించిన భారీ బహిరంగ సభకు వేలాది సంఖ్యలో తరలివచ్చిన ప్రజలు జగనన్నకు అండగా నిలిచారు. సభ నిర్వహించిన విజయనగరం –రాయపూర్ జాతియ రహదారి జన సంద్రంగా మారింది. అన్నా మీ వెంటే ఉంటామంటూ అండగా నిలిచారు. బహిరంగ సభ జరుగుతున్న సమయంలో రామభద్రపురం నుంచి విజయనగరం వైపు వెళుతున్న మూడు ప్రైవేటు అంబులెన్స్‌లకు మార్గం ఇవ్వాలంటూ వైఎస్ జగన్మోహన్రెడ్డి ‘దారివ్వండి అన్నా... అక్కా’ అంటూ మానవతా ధృక్పథంతో స్పందించారు. ప్రభు త్వ అంబులెన్స్‌లు ఎలాగూ అందుబాటులో ఉండవు, కనీసం ప్రైవేటు అంబులెన్స్లకైనా దారివ్వండన్నా అం టూ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని ఎండగట్టారు. ఎమ్మెల్యే అవినీతిపై నిప్పులు నాలుగేళ్ల టీడీపీ ప్రభుత్వ పాలనలో ప్రజా సంక్షేమంపై స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై ప్రతిపక్షనేత, వైఎస్సార్సీపీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గజపతినగరం నియోజకవర్గం ఎమ్మెల్యే చేస్తున్న ఇసుక దోపిడీ, ఔట్సోర్సింగ్ పోస్టుల అమ్మకాల్లో అవినీతిపై తూర్పరబట్టా రు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల అమల్లో ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిపై జననేత విరుచుకుపడ్డారు. జననేత ప్రసంగాన్ని ఆద్యంతం ఉత్సాహంగా విన్న ప్రజలు జై జగన్ జైజై జగన్... అంటూ నినాదాలు చేశారు. జనసందోహం నడుమ పాదయాత్ర గజపతినగరం మండలం జిన్నాం గ్రామ పంచాయతీ శివారున ఏర్పాటు చేసిన శిబిరం నుంచి పాదయాత్రను ప్రారంభించిన జగన్ లింగాలవలస, లోగిశ క్రాస్ కొత్త శ్రీరంగరాజపురం మీదుగా నారాయణ గజపతిరాజపురం చేరుకున్నారు. మధ్యాహ్న భోజన విరామానంతరం గజపతినగరం వరకూ సాగింది. పాదయాత్రకు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన విద్యార్థులు, అభిమానులు, పార్టీ కార్యకర్తలు సంఘీభావం తెలిపారు. గ్రామాల్లో పెద్ద సంఖ్యలో మహిళలు, విద్యార్థులు, యువత, రైతన్నలు జననేతకు స్వాగతం పలికారు. అన్నా మా వేదన పట్టించుకోండి... పాదయాత్రలో ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డి వద్ద నియోజకవర్గ ప్రజలు తమ ఆవేదన వ్యక్తం చేశారు. డ్వాక్రా మహిళలకు రుణాలు సక్రమంగా ఇవ్వడం లేద నీ, లింగాలవలస గ్రామంలో తనతో పాటు 12 మంది సభ్యులను వెలుగు సిబ్బంది, బ్యాంకు అధికారులు కలి సి నిట్టనిలువునా ముంచారని వాపోయారు. రాష్ట్ర వ్యా ప్తంగా 2 లక్షల మంది ఫార్మసిస్టులు ఉన్నా పోస్టులను భర్తీ చేయడం లేదనీ, 20 ఏళ్లుగా ప్రభుత్వాస్పత్రుల్లో 4700 ఫార్మసిస్టు పోస్టులు ఖాళీగా ఉన్నా భర్తీ చేయడం లేదని తెలిపారు. క్షత్రియులకు కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలనీ పోరాట సంఘం కోరింది. వైఎస్ హయాం లో వికలాంగులకు రుణాలు, మూడు సైకిళ్ల చక్రాలు అందివ్వగా, చంద్రబాబు బ్యాటరీ సైకిలు అందిస్తామని హామీ ఇచ్చి డిగ్రీ అర్హత ఉండాలని లింకు పెట్టారని, వాటికి కూడా జన్మభూమి కమిటీలకు అప్పజెప్పారని, వారికి నచ్చినవారికి మాత్రమే సంక్షేమ పథకాలు అందిస్తున్నారని ఎం కొత్తవలస గ్రామానికి చెందిన వికలాంగుడు ఆవేదన వ్యక్తం చేశారు. లింగాలవలస గ్రామంలోని పంట పొలాలకు తోటపల్లి రిజర్వాయర్ నుంచి వచ్చే సాగునీరు అందకపోవడంతో పంటలు సాగుచేసేందుకు రైతులంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామనీ, లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటు చేయాలని కోరారు. పాదయాత్రలో పాల్గొన్న పార్టీ నాయకులు ః పాదయాత్రలో వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల ఇన్చార్జి భూమన కరుణాకరరెడ్డి, రాష్ట్ర ప్రొగ్రామ్స్ కమిటీ కన్వీనర్ తల శిల రఘురాం, మాజీ మంత్రులు బొత్స సత్యనారా య ణ, మోపిదేవి వెంకటరమణ, మాజీ ఎంపీ బొత్స ఝా న్సీలక్ష్మి, ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి, బద్వేల్ ఎమ్మెల్సీ గోవిందరెడ్డి, సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర,రాష్ట్ర అధికార ప్రతినిధి నారమల్లి పద్మాజారెడ్డి, రా ష్ట్ర ప్రచార కమిటీ అధ్యక్షుడు విజయ్‌చందర్, జిల్లా రాజ కీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు, విజయనగరం, అరకు పార్లమెంటరీ జిల్లాల అధ్యక్షులు బెల్లాన చంద్రశేఖర్, శత్రుచర్ల పరీక్షిత్‌రాజ్, మాజీ ఎమ్మెల్యేలు బొత్స అప్పలనర్సయ్య, బడ్డుకొండ అప్పలనాయుడు, నెల్లిమర్ల, ఎస్‌కోట, బొబ్బిలి సమన్వయకర్తలు పెనుమత్స సాంబశివరాజు, కడుబండి శ్రీనివాసరా వు, శంబంగి వెంకటచిన అప్పలనాయుడు, రా ష్ట్ర కార్యదర్శి డాక్టర్ పెనుమత్స సురేష్‌బాబు, జిల్లా ఎస్సీ సెల్ కన్వీనర్ పీరుబండి జైహింద్‌కుమార్, ఘట్టంనేని ఆదిశేషగిరిరావు, జమ్మాన ప్రసన్నకుమార్ పాల్గొన్నారు. -
రేపు ప్రజాసంకల్పయాత్రకు విరామం
సాక్షి, గజపతినగరం : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విజయనగరం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. అయితే ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం గురువారం ఉదయం గజపతినగరం నియోజకవర్గం నుంచి జననేత పాదయాత్ర ప్రారంభం కావాలి. కానీ ఉత్తరాంధ్రలో భారీ తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో రేపటి(గురువారం) పాదయాత్రకు విరామం ఇచ్చినట్లు వైఎస్సార్ సీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ఓ ప్రకటన విడుదల చేశారు. -
283వ రోజు ప్రారంభమైన ప్రజాసంకల్పయాత్ర
సాక్షి, గజపతినగరం : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విజయనగరం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. బుధవారం ఉదయం 283వ రోజు పాదయాత్ర జిన్నాం నుంచి ప్రారంభమైంది. అడుగడుగునా ప్రజాసమస్యలు సమస్యలు తెలుసుకుంటూ వైఎస్ జగన్ ముందుకు సాగుతున్నారు. వైఎస్ జగన్ రాకతో పాదయాత్ర సాగుతున్న మార్గంలో పండుగ వాతావారణం నెలకొంది. గజపతినగరం నియోజకవర్గంలోని లింగాల వలస, లోగిస క్రాస్, కొత్త శ్రీరంగ రాజపురం, నారాయణ గజపతిరాజపురం, గజపతినగరం వరకు నేడు పాదయాత్ర కొనసాగనుంది. ఈ సాయంత్రం గజపతినగరంలో జరిగే బహిరంగ సభలో వైఎస్ జగన్ పాల్గొని ప్రసంగిస్తారు. -
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
గజపతినగరం రూరల్: మండలంలోని కొత్తబగ్గాం సమీపంలో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మహిళ గురువారం చికిత్స పొందుతూ మృతి చెందింది. వివరాల్లోకి వెళితే.. కొత్తబగ్గాం గ్రామానికి చెందిన కానూరు రామయ్యమ్మ (63) బుధవారం రాత్రి బహిర్బూమి వెళ్తుండగా, మెంటాడ నుంచి గజపతినగరం వైపు వస్తున్న వ్యాన్ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రామయ్యమ్మ తీవ్రంగా గాయపడింది. వెంటనే క్షతగాత్రురాలిని విజయనగరం కేంద్రాస్పత్రికి తరలించగా, ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం మృతి చెందింది. మృతురాలి కుమారుడు నారాయణరావు ఫిర్యాదు మేరకు ఎస్సై పి. వరప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
170 క్వింటాళ్ల బియ్యం పట్టివేత
గజపతినగరం: నిబంధనలకు విరుద్ధంగా తరలిస్తున్నారనే అనుమానంతో 170 క్వింటాళ్ల బియ్యాన్ని స్థానిక తహశీల్దార్ ఆర్ఎల్ఎల్ ప్రసాద్‌పాత్రో పట్టుకున్నారు. పౌరసరఫరాల శాఖ అనుమతి లేకుండా జిన్నాం గ్రామ సమీపంలో ఉన్న రామాంజనేయ రైస్ మిల్ యజమాని బియ్యం తరలిస్తున్నారన్న సమాచారం మేరకు తహశీల్దార్ ప్రసాద్ పాత్రో బుధవారం రాత్రి గ్రామ సమీపంలో కాపు కాసి బియ్యాన్ని సీజ్ చేశారు. విషయూన్ని ఏజేసీ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తహశీల్దార్ తెలిపారు. ఇదిలాఉంటే మిల్లు యజమాని కొప్పల రామునాయుడు మాట్లాడుతూ, ప్రభుత్వం నిర్ణయించిన ధరకే రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసినట్లు చెప్పారు. -
జిల్లావ్యాప్తంగా ఆరువేల సౌర విద్యుత్ కనెక్షన్లు
గజపతినగరం రూరల్: జిల్లా వ్యాప్తంగా ఆరువేల సౌర విద్యుత్ కనెక్షన్లను ప్రభుత్వం మంజూరు చేసిందని ఏపీ ట్రాన్స్‌కో డివిజినల్ ఇంజినీర్ జి.ప్రసాద్ తెలిపారు. విద్యుత్ సబ్‌స్టేషన్‌లోని విద్యుత్ కాల్‌సెంటర్‌ను ఆయన బుధవారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేసారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇప్పటికే గజపతినగరం, దత్తిరాజేరు, గంట్యాడ, బొండపల్లి మండలాలకు చెందిన 96మంది సౌర విద్యుత్ కనెక్షన్లకు దరఖాస్తు చేసుకున్నారని, వారిలో 80మందికి కనెక్షన్లు ఇచ్చామన్నారు. 3హెచ్‌పీ, 5హెచ్‌పీ మోటార్లకు రాయితీ ఉంటుందని తెలిపారు. రూ.3.36 లక్షల విలువైన 3హెచ్‌పి మోటార్‌కు రైతు కేవలం రూ.40 వేలు కడితే చాలని, మిగతా మొత్తం రాయితీ అని, 5హెచ్‌పి మోటార్ ఖరీదు రూ.4.29 లక్షలుండగా రూ.55 వేలు కట్టి రాయితీ పొందవచ్చని తెలిపారు. సౌర విద్యుత్ ప్యానల్స్‌ను వాడిన వినియోగదారులకు 30 ఏళ్ల హామీ ఇస్తున్నట్టు తెలిపారు. ఆయన వెంట ట్రాన్స్‌కో ఏడీఈ కె.శ్రీనివాసరావు, ఏఈ డి.పిచ్చయ్య ఉన్నారు. -
రైతుబజార్ల అభివృద్ధికి చర్యలు
గజపతినగరం రూరల్ : ఉత్తరాంధ్రలోని రైతు బజార్లను దశల వారీగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వ్యవసాయ మార్కెటింగ్ శాఖ కమిషనర్ , డెరైక్టర్ పి. మల్లికార్జునరావు అన్నారు. గురువారం స్థానిక వ్యవసాయ శాఖ మార్కెట్ కార్యాలయంలో ప్రారంభమైన మామిడి క్రయ, విక్రయ కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ, విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో ఉన్న రైతుబజార్లను స్వయంగా పరిశీలించి అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు. చీపురుపల్లి, ఎచ్చెర్ల, విశాఖపట్నంలో ఉన్న మూడు రైతుబజార్లలో ఎంత వ్యాపారం జరుగుతుందీ తెలుసుకుంటున్నట్లు తెలిపారు. 50 బజార్ల ఆధునీకరణ రాష్ట్ర వ్యాప్తంగా 80 రైతు బజార్లుండగా అందులో 50 ఆధునీకరించామని, మరో పదింటిని జూన్ నెలాఖరులోగా ఆధునీకరిస్తామని మల్లికార్జునరావు చెప్పారు. ‘పొలం నుంచి ఇంటికి’ నినాదంలో భాగంగా విశాఖపట్నం, ఆనందపురం, చోడవరంలో ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మామిడితో పాటు పలు రకాల కూరగాయలను స్టాల్స్‌లో పెట్టి రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తామన్నారు. ఇందుకోసం ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ ప్రాంతీయ సంచాలకుడు కె.శ్రీనివాసరావు,ఉపసంచాలకుడు పి.వి.సుధాకర్, ఎ.డి. బి.శ్రీనివాసరావు, బొండపల్లి జెడ్పీటీసీ సభ్యుడు బండారు బాలాజీ, మార్కెట్యూర్డు సెక్రటరీ ఆర్.ప్రభాకర్,సూపర్వైజర్ అరుణకుమారి, తదితరులు పాల్గొన్నారు. -
హత్య కేసు నిందితులకు రిమాండ్
గజపతినగరం: తుమ్మికాపల్లిలో గ్రామంలో ఈ నెల 8న జరిగిన హత్య కేసుకు సంబంధించి ఇద్దరు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ కె.కె.వి.విజయ్‌నాథ్ తెలిపారు. ప్రియుడితో వివాహేతర సంబంధమే భర్త హత్యకు దారి తీసిందని చెప్పారు. బుధవారం గజపతినగరం సర్కిల్ కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. సింహాద్రి సత్యనారాయణ, సన్యాసమ్మ భార్యాభర్తలు. సన్యాసమ్మకు అప్పలరాజుతో మూడేళ్లుగా వివాహేతర సంబంధం ఉంది. ఆదివారం రాత్రి భర్త సత్యనారాయణ మద్యం సేవించి నిద్రిస్తున్న సమయంలో సన్యాసమ్మ తన ప్రియుడు అప్పలరాజును ఇంటికి రమ్మని కబురు చేసింది. అప్పలరాజు సన్యాసమ్మ ఇంటికి చేరాక సత్యనారాయణకు మెలకువ వచ్చింది. దీంతో భార్యాభర్తలిద్దరూ వాగ్వాదానికి దిగారు. అనంతరం సత్యనారాయణ బయటకు వెళ్లేందుకు ప్రయత్నించాడు. బయటకు వెళ్తే తనను చంపివేస్తాడంటూ సన్యాసమ్మ తన భర్త హత్యకు దారి తీసే విధంగా అప్పలరాజును ప్రేరేపించింది. ఇద్దరూ కలిసి పక్కనే ఉన్న సుత్తితో సత్యనారాయణ తల, మర్మాంగంపై దాడి చేశారు. దీంతో సత్యనారాయణ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని సోదరి కర్రి లక్ష్మి ఫిర్యాదు మేరకు దర్యాప్తు జరిపినట్లు సీఐ తెలిపారు. నిందితులిద్దరినీ మంగళవారం బోడసింగిపేట వద్ద అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. సమావేశంలో ఎస్ఐ పి.వరప్రసాద్ సిబ్బంది పాల్గొన్నారు. -
అగ్నిప్రమాదంలో రూ.4 లక్షల ఆస్తి నష్టం
గజపతినగరం (విజయనగరం) : ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం సంభవించి రూ. 4 లక్షల విలువైన ధాన్యం కుప్పలు తగలబడ్డాయి. ఈ సంఘటన విజయనగరం జిల్లా గజపతినగరం మండలం ముచ్చర్ల గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రైతు ధాన్యం కుప్పలను ఒక్కచోటకు చేసి వరి గడ్డితో కప్పి ఉంచాడు. ధాన్యాన్ని అమ్మడం కోసం ఏర్పాట్లు చేసుకుంటున్న క్రమంలో ప్రమాదవశాత్తు మంటలంటుకొని ధాన్యం మెత్తం కాలి బుడిదయ్యాయి. దీంతో రైతు కన్నీరుమున్నీరవుతున్నాడు. -
‘త్రీ రోజెస్’ ఆదరణ పొందుతుంది
సీనియర్ నటుడు వినోద్ గజపతినగరం: జెడ్పీటీసీ మాజీ సభ్యులు గార తవుడు నిర్మాతగా మారి తెరకెక్కిస్తున్న చిత్రం ‘త్రీ రోజెస్’ ప్రేక్షకాదరణ పొందుతుందని సీనియర్ నటులు ఆరిశెట్టి వినోద్ తెలిపారు. ఈ సినిమా షూటింగ్లో పాల్గొనేందుకు వచ్చిన సందర్భంగా ఆయన కాసేపు విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే... నేను 1981లో కీర్తి, కాంత, కనకం సినిమాతో సినీ రంగప్రవేశం చేశా. మొదటి సినిమాకే మూడు నేషనల్ అవార్డులు దక్కాయి. ఇంత వరకు తాను మూడు వందల తెలుగు సినిమాలు, 30 తమిళ సినిమాలు, నాలుగు హిందీ సినిమాలు చేశాను. ముప్పై టీవీ సీరియళ్లలో కూడా నటించాను. అన్ని పాత్రలు వేయడం వల్ల జనాదరణ లభించింది. తెలుగు సినిమాల్లో చంటి, నల్లత్రాచు, లారీ డ్రైవర్, ఇంద్ర, నరసింహనాయుడు, భైరవద్వీపం నాకు మంచి గుర్తింపు తీసుకువచ్చాయి. ప్రస్తుతం మహేష్‌బాబు నటిస్తున్న బ్రహ్మోత్సవం చిత్రంలో నటిస్తున్నాను. సీవీ రెడ్డి డెరైక్షన్‌లో దివంగత నేత వైఎస్ఆర్ పాత్ర పోషించడం ఎన్నటికీ మరిచిపోలేను. -
సినిమా... సినిమా
గజపతినగరంలో సినిమా సందడి ఉత్సాహంగా ‘త్రీ రోజెస్’ చిత్ర షూటింగ్ గజపతినగరం, గజపతినగరం రూరల్: గజపతినగరం పట్టణంలో ఆదివారం సినిమా సందడి నెలకొంది. జెడ్పీటీసీ మాజీ సభ్యుడు గార తవుడు నిర్మాతగా మారి తెరకెక్కిస్తున్న తొలి చిత్రం ‘త్రీ రోజెస్’ ముహూర్తపు సన్నివేశాన్ని పట్టణంలో ఆదివారం చిత్రీకరించారు. కార్తీక క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రానికి శ్రీముత్యం దర్శకత్వం వహిస్తున్నారు. నాని, శ్రీకాంత్, కథానాయకులుగా చేస్తుండగా హని, రజియా హీరోయిన్లుగా నటిస్తున్నారు. స్థానిక అభయాంజనేయ స్వామి ఆలయంలో పూజలు నిర్వహించాక ముహూర్తపు షాట్ తెరకెక్కించారు. దీనికి మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనర్సయ్య క్లాప్ కొట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘త్రీ రోజెస్’ మంచి సందేశాత్మక చిత్రమని ఆయన తెలిపారు. ఈ సినిమా ద్వారా యువత నడవడికను చూపించనున్నారని చెప్పారు. నిర్మాత గార తవుడు మాట్లాడుతూ రాజకీయ రంగంలో ఆదరించినట్లుగానే సినిమా రంగంలోనూ తనను ఆదరించాలని కోరారు. యువతకు మంచి సందేశం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ స్క్రిప్టు విని వెంటనే నిర్మాణానికి ఒప్పుకున్నానని తెలిపారు. దర్శకుడు ముత్యం మాట్లాడుతూ హారర్, కామెడీ జానర్లో సినిమా ఉంటుందని చెప్పారు. అన్ని వర్గాల వారు మెచ్చుకునేలా సినిమాను రూపొందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో సీనియర్ నటులు ఆరిశెట్టి వినోద్, సహ నిర్మాత కె. పైడిపినాయుడు, నటులు నాని, డేవిడ్, రజియా తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో బొండపల్లి జెడ్పీటీసీ సభ్యుడు బండారు బాలాజీ, స్థానిక మండల పార్టీ అధ్యక్షుడు బూడి వెంకటరావు, మజ్జి రామకృష్ణ, బాలాజీ పాలిటెక్నికల్ విద్యాసంస్థల కరస్పాంటెండెంట్ రెడ్డి శాఖర్ బాబు, పురిటి పెంట సర్పంచ్ మండల సురేష్, బంగారమ్మ పేట మాజీ సర్పంచ్ బుగత రాజుతో పాటు పలువురు పాల్గొన్నారు. -
‘టీడీపీ ఎమ్మెల్యే మోసం చేశారు’
శ్రీకాకుళం : గజపతినగరం ఎమ్మెల్యే కె. అప్పలనాయుడు తనను మోసం చేశారంటూ శ్రీకాకుళానికి చెందిన ఎన్.ఛాయాకుమారి అనే మహిళ సోమవారం జిల్లా ఎస్పీ ఎ.ఎస్.ఖాన్‌కు ఫిర్యాదు చేశారు. శ్రీకాకుళం గుజ రాతీపేటకు చెందిన ఛాయాకుమారికి కారాసు దీప అనే మహిళతో పరిచయం ఉంది. రూ.10 లక్షలు పెట్టుబడి పెడితే కొద్దిరోజుల వ్యవధిలో రూ.50 లక్షల వరకు లాభం వస్తుందని, ఇరీడియం రైస్‌పుల్లింగ్ కాయిన్ పేరిట ఓ ప్రాజెక్టు చేపట్టామని, ఇందులో టీడీపీ ఎమ్మెల్యే అప్పల నాయుడు కూడా భాగస్వామిగా ఉన్నారని దీప చెప్పడంతో గతేడాది నవంబర్‌లో రెండు విడతలుగా తాను డబ్బు చెల్లించానని ఛాయా తెలిపారు. ఎమ్మెల్యే ఒత్తిళ్ల మేరకే డబ్బు చెల్లించానని, బ్యాంకు వివరాలు కూడా ఎమ్మెల్యే ఇచ్చారని తెలిపారు. డబ్బుల కోసం ప్రశ్నిస్తుంటే తనను ఢిల్లీ, విజయవాడ, విశాఖ ప్రాంతాలకు తిప్పి చివరకు శ్రీనివాస్ అనే ఎమ్మెల్యే బినామీ తనకు రూ.60 వేలు ఇచ్చి పంపించారన్నారు. ఘటనపై విచారిస్తామని ఎస్పీ చెప్పారు. -
పింఛన్ ఠంఛన్‌గా అందేనా?
గజపతినగరం: పాత సీసాలో కొత్త సారాలా ఉంది పింఛన్ల పంపిణీ విధానం మార్పు పరిస్థితి! పోస్టాఫీసుల ద్వారా సామాజిక పింఛన్లను పంపిణీ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్న జిల్లా యంత్రాంగం దీనికి తగిన ఏర్పాట్లు, సౌకర్యాలు లేకుండా పోస్టాఫీసులకు బదలాయిస్తోంది. జిల్లాలో ఎంతో మంది సిబ్బంది, అధికారులు, కంప్యూటర్ ఆపరేటర్లు, డేటా ఎంట్రీ సిబ్బంది పనిచేస్తున్నప్పటికీ పింఛన్ల పంపిణీలో నిత్యం సమస్యలు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు కనీస సౌకర్యాలు కానీ, వసతులు, సిబ్బంది కానీ లేని పోస్టాఫీసులకు ఈ భారీ కార్యక్రమాన్ని అప్పగించడంపై పలు విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా 2.41లక్షల పింఛన్ల పంపిణీని ఇక నుంచి పోస్టల్ శాఖ చేస్తుందని సెర్ఫ్ కార్యదర్శి హెచ్ అరుణ్‌కుమార్, జిల్లా మంత్రి కిమిడి మృణాళినితో పాటు కలెక్టర్ కూడా ప్రకటించి సిబ్బందికి అప్పగించేశారు. జిల్లాలో 921 పంచాయతీలుండగా వీటి పరిధిలో కేవలం 600 పోస్టల్ కార్యాలయాలున్నాయి. ఇందులో సబ్ పోస్టు కార్యాలయాలతో పాటు బ్రాంచి కార్యాలయాలు, హెడ్‌పోస్టాఫీసులున్నాయి. అయితే జిల్లాలో బ్రాంచి పోస్టాఫీసులే ఎక్కువ. వాటిలో సిబ్బంది చాలా తక్కువ ఉంటారు. అలాగే ఇరుకైన అద్దెగదుల్లో ఈ కార్యాలయాలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ కంప్యూటర్లు, ప్రింటర్లు, ఇతర పరికరాలు చాలా తక్కువ! ఇటువంటి కార్యాలయాల్లో పింఛన్ల పంపిణీ ఎలా చేస్తారని పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఈ సిబ్బందికి పింఛన్ల పంపిణీపై కనీసం అవగాహన లేదు. ఎంతో అనుభవం ఉన్న జిల్లా యంత్రాంగం పింఛన్ల పంపిణీకి తలమునకలై నానా అగచాట్లూ పడిన సందర్భాలున్నాయి.ప్రస్తుతం 19 మండలాల్లో పోస్టాఫీసుల ద్వారా పింఛన్లు పంపిణీ అవుతున్నప్పటికీ ఎక్కువగా పోస్టాఫీసులు లేని చోట్ల సీఎస్పీల ద్వారా పంపిణీ చేసేవారు. జిల్లావ్యాప్తంగా ఉన్న దాదాపు 400 మంది సీఎస్పీలను ఇటీవలే తొలగించిన యంత్రాంగం వారికి వేతనాలు కూడా ఇవ్వలేదు. అలాగే ఇంకా బయోమెట్రిక్ ప్రింట్లు పింఛనర్ల నుంచి ఇప్పటికీ తీసుకోవట్లేదు. దీంతో బయోమెట్రిక్ ద్వారా పంపిణీ ఎలా సాధ్యమన్న విషయం అధికారులకే తెలియాలి. ఇందుకోసం జిల్లాలో జనవరిలో మాన్యువల్‌గా కొన్నిచోట్ల పింఛన్లు పంపిణీ చేసి వచ్చే ఫిబ్రవరి నుంచి అన్ని పింఛన్లనూ బయోమెట్రిక్ ద్వారా పంపిణీ చేయాలని ప్రభుత్వ నిర్ణయంలో సడలింపు ఇచ్చారు. దేశంలోనే అత్యంత పెద్ద నెట్వర్క్ కలిగిన భారత తపాలాశాఖ తమ కార్యాలయాలకు మౌలిక సదుపాయాల కల్పనలో మాత్రం బాగా వెనక బడింది. ఇటీవల ఉపాధి కూలీల వేతనాల చెల్లింపు తప్ప పెద్దగా పనుల్లేకపోవడంతో కేంద్ర ప్రభుత్వం మౌలిక సదుపాయాల కల్పనకు వెనుకాడుతోందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. మారుమూల గ్రామాల్లో ఉన్న పోస్టాఫీసులను బ్రాంచ్ పోస్టాఫీసులుగా మార్చారు. ఇవి సబ్ పోస్టాఫీస్ కంట్రోల్లో ఉంటాయి. బ్రాంచ్ పోస్టాఫీస్ పని3గంటలు మాత్రమే.అయితే ఇప్పు డు పింఛన్ల పేమెంట్ బయోమెట్రిక్ పద్ధతిలో జరుపుతారు. పీఓటీడీ(పాయింట్ ఆఫ్ ట్రాంజాక్షన్ డివైస్) మిషన్లద్వారా పింఛనుదారుల వేలిముద్రలను తీసుకుని పేమెంట్ చేయాలి. ఈ విధంగా ఆయితే 3గంటల సమయంలో ఎంత మందికి పింఛన్ల పంపిణీ జరుగుతుందనేది ప్రశ్న. దీనికి తోడు గ్రామా ల్లో విపరీతంగా కరెంట్ కోతలు ఉన్నాయి. మిషన్లు చార్జింగ్లేకపోతే అవి మొరాయిం చే పరిస్థితి ఉంది. ఇక సబ్ పోస్టాఫీసుల్లో సాధారణ లావాదేవీలతో పాటు ఈపిం ఛన్ల పంపిణీ చేయాలంటే కష్టసాధ్యమే. చాలా గ్రామాల్లో సిగ్నల్స్ సరిగ్గా ఉండ వు. దీని కోసం సిగ్నల్ ఉన్న చోటుకు పీఓటీడీని తీసుకువెళ్లాలి. అక్కడికే వృద్ధు లు, వికలాంగులు రావాల్సి ఉంటుంది. వీటిని అధిగమించి తపాలాశాఖ విజయవంతంగా ఈ పింఛన్లను సక్రమంగా పంపిణీ చేస్తుందో లేక పిం ఛనుదారులను ఇబ్బందులకు గురిచేస్తుందో మరికొద్ది రోజుల్లో స్పష్టం కానుంది. -
బాబు మాటల్లోనే మోసం
దత్తిరాజేరు (గజపతినగరం) : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాటల్లోనే మోసం ఉంటుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. తొమ్మిదేళ్ల పాటు అధికారానికి దూరంగా ఉన్న బాబు ఈసారి మారి ఉంటారనుకుని ప్రజలు ఆయన్ను అధికారంలోకి తీసుకువస్తే .. మళ్లీ అవే మాయ మాటలు చెబుతున్నారన్నారు. ఎన్నాళ్లూ అయినా.. బాబు నైజం మారదని విమర్శించారు. శనివారం ఆయన దత్తిరాజే రు మండలంలోని పెదమానాపురం ఎంఎస్ఎన్ కళాశాల ఆవరణలో జరిగిన మండల కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడారు. టీడీపీ ప్ర భుత్వం ప్రజాహిత కార్యక్రమాలను విస్మరించి, ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతోందన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తరువాత రుణ మాఫీ చేస్తారని రైతులు, డ్వాక్రా మహిళలు కళ్లల్లో ఒత్తులు పెట్టుకొని చూశారన్నారు. కానీ ఇప్పటికీ ఆయన మాయ మాటలే చెబుతున్నారని చెప్పారు. రుణమాఫీపై బాబు తొలి సంతకం చేసిన వెంటనే తమ ఇబ్బందులు తొలగిపోతాయని భావించిన రైతులు ఆ ఆశ నిరాశే అని తెలిసిన తరువాత ఆత్మ హత్యలు చేసుకుంటున్నారని ఆరోపించారు. ప్రస్తుతం ప్రకటించిన రూ. 50 వేల రుణమాఫీ కూడా అమలు కావడం కష్టమేనని చెప్పారు. ఆ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి కడుబండి శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ గ్రామస్థాయి నుంచి పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. రానన్నది రాజన్న రాజ్యమేనని తెలిపారు. ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలల్లోనే ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని చెప్పారు. ప్రతిపక్ష పార్టీగా ప్రజా పక్షాన పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. పంచాయతీరాజ్ చాంబర్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మామిడి అప్పలనాయుడు మాట్లాడుతు పూటకోక మాట చెప్పే చంద్ర బాబును ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. రుణమాఫీ పేరుతో అధికారంలోకి వచ్చిన బాబుకు ప్రజా సంక్షేమం తెలియదన్నారు. ఆ పార్టీ దత్తిరాజేరు మండల అధ్యక్షుడు బోడసింగి సత్తిబాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎస్. కోట నియోజకవర్గ ఇన్చార్జి నెక్కల నాయుడు బాబు, జిల్లా ఎస్సీ సెల్ సభ్యుడు జయంత్‌కుమార్, జిల్లా ప్రచార కమిటీ అధ్యక్షుడు గొర్లె వెంకటరమణ, జెడ్పీటీసీ సభ్యురాలు గోటివాడ అప్పలమ్మ, గంట్యాడ మాజీ ఎంపీపీ వర్రి నరసింహులు, పార్టీ నాయకుడు ఈదుబిల్లి కృష్ణ, తదితరులు పాల్గొన్నారు. జిల్లా, మండల కమిటీల ఎంపిక జిల్లా కమిటీ సభ్యులుగా బోడసింగి సత్తిబాబు, జిల్లా గొర్లె పెంపకందారుల సహకార సంఘం అధ్యక్షుడు బమ్మిడి అప్పలనాయుడును నియమించినట్టు పార్టీ జిల్లా అధ్యక్షుడు కోలగట్ల తెలిపారు. అలాగే దత్తిరాజేరు మండల పార్టీ అధ్యక్షుడిగా కడుబండి రమేష్‌నాయుడు, యువజన నాయకులుగా పిళ్లా పైడిపినాయుడును నియోజకవర్గ ఇన్చార్జి కడుబండి శ్రీనివాసరావు ప్రకటించారు. -
బాధితులకు తక్షణమే న్యాయం చేయాలి
గజపతినగరం: ప్రేమ పేరుతో నమ్మించి మోసం చేసిన నయ వంచకులను తక్షణమే అరెస్టు చేసి బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ ఏఐఎస్ఎఫ్, ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో బుధవారం స్థానిక పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. బొండపల్లి మండలం బోడసింగిపేట గ్రామానికి బి. ఆనంద్ అనే విద్యార్థి అదే గ్రామానికి చెందిన విద్యార్థినిని ప్రేమించి పెళ్లి చే సు కుంటానని చెప్పి మోసం చేశాడని ప్రస్తుతం అవిద్యార్థి వయస్సు 17సంవత్సరాలని చెబుతూ తప్పించుకు తిరుగుతన్నాడని మండిపడ్డారు. సర్టిఫికెట్లతో సంబంధం లేకుండా వైద్య పరీక్షలు నిర్వహించి నిందితుడికి ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే దత్తిరాజేరు మండలంలోని చిన చామలాపల్లిలో మోసానికి గురైన యువకుడి పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధితురాలికి గర్భం తొలగించిన గజపతినగరం ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్ ప్రసన్నలక్ష్మిని, అలాగే పెదమానాపురం ఎస్సై మహేష్‌ను తక్షణమే సస్పెండ్ చేయాలని పట్టుబట్టారు. బాధితులకు న్యాయం జరగని పక్షంలో జిల్లా అంతటా ఆందోళనలను ఉద్ధృతం చేయనున్నట్లు హెచ్చరించారు. ఈ సందర్భంగా సీఐ, వి. చంద్రశేఖర్ మాట్లాడుతూ బాధితులకు తగు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటానని ఆందోళనకారుకు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఏఐవైఎఫ్, జిల్లా కార్యదర్శి,బుగత ఆశోక్, ఏఐఎస్ఎఫ్, జిల్లా సహయ కార్యదర్శి సాయికిరణ్, మహిళా సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బాయిరమణమ్మ, ఎల్, పుణ్యవతి, ఎస్.కె. చాంద్ బీబీ తదితరులు పాల్గొన్నారు. -
బాలికను మింగినది
గజపతినగరం రూరల్: వారంతా ఆటపాటలు, సరదా సంతోషాలు తప్ప, కల్లాకపటం తెలియని, ప్రమాద విషయాలు పట్టని చిన్నారులు. కార్తీకమాసం కదా అని అంతా కలిసి పిక్నిక్కి వెళ్లారు. మధ్యాహ్నం వరకు ఆటపాటలతో కేరింతలు కొట్టారు. భోజనాలు చేసి సరదాగా స్నానానికి వెళ్లారు. చిన్నారులు కదా నాతో జలకాలాడడానికి వచ్చారన్న జాలి లేకుండా చం పావతి నది నలుగురు చిన్నారులకు తన గర్భంలోకి లాగేసింది. అష్టకష్టాలు పడి ఓ ముగ్గురు చిన్నారులు బయట పడగలిగినప్పటికీ ఓ బాలిక మాత్రం విగతజీవిగా మారింది. విహారంలో విషాదం సంభవించిన సంఘటన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని కొత్త బగ్గాం గ్రామానికి చెందిన 15మంది పిల్లలు ఆదివారం ఇదే మండలంల్నో కొణిశ గ్రామానికి పిక్నిక్కు వెళ్లారు. చిన్నారులంతా ఆటపాటలతో గడిపి భోజనాలు చేసిన అనంతరం సమీపంలో ఉన్న చంపావతి నదిలో స్నానాల కోసం దిగారు. పిల్లల్లో కొంతమంది ఒడ్డున,మరికొంతమంది నది మధ్యలోకి వెళ్లి స్నానాలు చేయసాగారు. అందరూ 15సంవత్సరాల లోపు వయస్సు వారే.అయితే దురదృష్ట వశాత్తు సిరిపురపు రేణుక అనే బాలిక నదిలో స్నానం చేస్తుండగా పెద్దగోతిలో పడిపోయి రక్షించండి బాబోయ్ అని కేకలు వేస్తూ మునిగి పోతున్న సమయంలో ఒడ్డున కూర్చున్న అర్జి నాగలక్ష్మి రేణుకను రక్షించబోయి ఆమెతో పాటు నీటిలో మునుగుతూ తేలుతూ ఉంది.ఇంతలో రేణుక తమ్ముడు రఘు, నాగలక్ష్మి తమ్ముడు నరేంద్ర అక్కలిద్దరినీ రక్షించబోయి వారు కూడా నదిలో మునిగి పోతూ పెద్ద కేకలు వేయగా అదే గ్రామానికి చెందిన కన్నూరి శ్రీను అనే వ్యక్తి పరుగుపరుగున వచ్చి ఆముగ్గురినీ ఒక్కొక్కరినీ బయటకు నెట్టివేసి వారి ప్రాణాలను కాపాడాడు. శ్రీను ఆసమయంలో లేక పోతే రేణుకతో పాటు ఆముగ్గురు విగత జీవులై ఉండేవారని గ్రామస్తులు తెలిపారు. రేణుక ఆచూకీ కోసం మూడు గంటల పాటు వెతుకులాట నదిలో మునిగిపోయిన రేణుక కోసం స్థానికులతో పాటు ఎస్సై డి.సాయికృష్ణ బృందం,అగ్నిమాపక సిబ్బంది,స్థానిక తహశీల్దార్ ప్రసాద్ పాత్రో ఇతర అధికారులు శాయశక్తులా మూడుగంటల పాటు వెతికారు. అయితే చివరికి రేణు కకు వరుసకు అన్నయ్య అయిన సిరిపురపు సూర్యనారాయణ, పోలీసు బృందానికి ఆమె మృతదేహం దొరకింది. దీంతో రేణుక బంధువులు, గ్రామ ప్రజల కన్నీటితో గ్రామం ఒక్కసారిగా విషాదంలో మునిగిపోయింది. రేణుక తల్లి దండ్రులు రమణ,సత్యవతి కూలి పనికోసం తిరుపతి వలస వెళ్లారు. ఆ దంపతులకు రేణుక,రఘు అనే ఇద్దరు పిల్లలు ఉండడంతో వారిద్దరు అమ్మమ్మ సంరక్షణలో ఉన్నారు. రేణుక మృతిచెందిన సమాచారం తెలుసుకున్న తల్లిదండ్రులు రోదిస్తూ తిరుపతి నుంచి బయల్దేరారు. గ్రామ సర్పంచ్ సంజీవరావు సహాయంతో పోలీసుల సమక్షంలో స్థానిక ప్రభుత్వాస్పత్రిలో శవపంచనామా నిర్వహించారు. వేగావతిలో విద్యార్థి గల్లంతు విశ్వనాథపురం(పాచిపెంట): సాలూరులోని సత్యసాయి జూనియర్ కళాశాల విద్యార్థి దాసరి వంశీ (17) పాచిపెంట మండలం విశ్వనాథపురంలోని వేగావతి నదిలో ఆదివారం గల్లంగయ్యాడు. సహ విద్యార్థుల సమాచారం మేరకు పోలీసులు గాలింపు చేపట్టారు. వివరాలిలా ఉన్నాయి. కళాశాలకు చెందిన విద్యార్థులు పిక్నిక్ కోసం వేగావతి నది వద్దకు వచ్చారు.సరదాగా నదిలో దిగిన విద్యార్థి ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో తోటి విద్యార్థులు పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందించారు. దీంతో ఎస్సై రవికుమార్‌తో పాటు ఉప తహశీల్దార్ గిరిధర్,సాలూరు అగ్నిమాపక సిబ్బంది సాయంత్రం వరకూ గాలింపు చేపట్టినా మృతదేహం లభించలేదు. వంశీ తండ్రి చిన్నప్పుడే చనిపోయాడు. ఒక్కగానొక్క కొడుకును తల్లి పాచిపనులు చేసుకుంటూ చదివిస్తోంది. కుమారుడు గల్లంతయ్యాడన్న విషయం తె లుసుకున్న తల్లి భోరున విలపించడంతో ఎవరికీ ఆపతరం కాలేదు. వంశీ సాలూరు అగురువీధికి చెందినవాడు. -
కోర్బా ఎక్స్‌ప్రెస్‌కు తృటిలో తప్పి ప్రమాదం
హైదరాబాద్ : విజయనగరం జిల్లా గజపతినగరం వద్ద కోర్బా ఎక్స్‌ప్రెస్‌కు శనివారం తృటిలో ప్రమాదం తప్పింది. స్థానిక రైల్వే ట్రాక్‌పై ఐరన్ రాడ్స్ భారీ సంఖ్యలో కట్టలుగా పడి ఉండటాన్ని కోర్బా ఎక్స్‌ప్రెస్ డ్రైవర్ గుర్తించాడు. దీంతో వేగంతో వెళ్తున్న ఎక్స్‌ప్రెస్ రైలుకు సెడన్ బ్రేకు వేసి నిలిపివేశాడు. అనంతరం ట్రాక్‌కు అడ్డంగా ఇనపరాడ్లు ఉన్న సమాచారాన్ని రైల్వే గార్డుకి, సమీపంలోని రైల్వే స్టేషన్ సిబ్బందికి, రైల్వే అధికారులకి అందించాడు. దీంతో రైల్వే సిబ్బందితోపాటు పోలీసులు అక్కడికి చేరుకుని ట్రాక్‌పై భారీగా పడి ఉన్న ఇనుపరాడ్స్ తొలగించారు. అనంతరం పట్టాలను రైల్వే సిబ్బంది పరీక్షిస్తున్నారు. ట్రాక్‌పై ఇనుపరాడ్లు పడి ఉండటంపై ఇది అకతాయిల పనా లేక సంఘ విద్రోహ చర్యల పనా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తమకు పెద్ద ప్రమాదమే తప్పిందని ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. -
స్నానం చేస్తుండగా బాలికను వీడియో తీసిన యువకుడు
-
లైంగికదాడికి పాల్పడిని నిందితులకు రిమాండ్
విజయనగరం : స్నానం చేస్తున్న బాలిక వీడియో తీసి సామూహిక అత్యాచారానికి పాల్పడిన గ్యాంగ్‌ను విజయనగరం జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. గజపతి మండలం పురిటిపెంటకు చెందిన బాలిక స్నానం చేస్తుండగా అదే గ్రామానికి చెందిన శివాజీ నాయక్ అనే యువకుడు వీడియో తీశాడు. దీన్ని అడ్డుపెట్టుకుని స్నేహితులతో కలిసి బాలికపై పలు సార్లు అత్యాచారం చేశాడు. బెదిరింపులు పెరిగిపోవడంతో ఏం చేయాలో తెలియక ఇంటి నుంచి వెళ్లిపోయింది. దీంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. బాలికను అదుపులోకి తీసుకుని విచారించిన పోలీసులు జరిగిన విషయాన్ని తెలుసుకున్నారు. బాలిక ఇచ్చిన సమాచారంతో ప్రధాన నిందితుడు శివాజి నాయక్‌తో పాటు నలుగురు స్నేహితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు. వారందరిని సోమవారం రాత్రి రిమాండ్‌కు తరలించారు. -
ఇంటర్ విద్యార్థిని స్నానం చేస్తుండగా సెల్‌ఫోన్‌తో చిత్రీకరణ
ఓ ఇంటర్ విద్యార్థిని తన ఇంట్లో స్నానం చేస్తుండగా దొంగచాటున సెల్‌ఫోన్‌తో చిత్రీకరించిన ఓ యువకుడు తన స్నేహితులతో కలిసి ఆమెను బెదిరించడం మొదలుపెట్టారు. బ్లాక్మెయిల్ చేస్తూ తాము చెప్పిన రూమ్‌కు రప్పించుకుని కొద్ది రోజులుగా అత్యాచారం చేస్తున్నారు. యువకుల వేధింపులు భరించలేని విద్యార్థిని ఇల్లు విడిచి పారిపోయింది. విద్యార్థిని తల్లి కుటుంబ సభ్యులు సాయంతో ఆమె ఆచూకీ ఆదివారం కనుగొంది. జరిగిన సంఘటన తెలుసుకొంది. పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఆ యువకుల బండారం బయటపడింది. నిందితులపై నిర్భయ కేసు నమోదైంది. వివరాల్లోకి వెళ్తే... గజపతినగరం : పట్టణంలోని డ్రీమ్స్ మొబైల్ షాపులో పని చేస్తున్న ఐదుగురు యువకులు ఇంటర్ విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డారు. పురిటిపెంట న్యూకాలనీకి చెందిన ఓ విద్యార్థిని ఇంట్లో స్నానం చేస్తుండగా వీడియోను సెల్ఫోన్లో చిత్రీకరించిన యువకులు తమ కోర్కెను తీర్చకుంటే వీడియోను నెట్లో పెడతామని బెదిరించి మరీ అత్యాచారానికి పాల్పడినట్టు విద్యార్థిని తల్లి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదులో పేర్కొన్న వివరాలు ఇలా ఉన్నాయి. తన ఇంటి పక్కనే ఉన్న శివాజినాయక్ తన కుమార్తె స్నానం చేస్తుండగా వీడియోను తీసి బ్లాక్మెయిల్ చేసి తన స్నేహితులతో కలిసి అత్యాచారానికి పాల్పడ్డారని పేర్కొంది. శివాజినాయక్తో స్నేహితులు ప్రసన్నకుమార్, శ్రీకాంత్, భానుప్రసాద్, జితేంద్ర తన కుమార్తెను కొద్ది రోజులు పాటు వారు చెప్పిన చోటుకు రప్పించుకుని అత్యాచారం చేయడమే కాకుండా లైంగిక వేధింపులకు గురి చేశారని ఫిర్యాదులో పేర్కొంది. వీరి బాధలు భరించలేక పది రోజుల కిందట తన కుమార్తె ఇల్లు విడిచి వెళ్లిపోయయిందని తెలిపింది. కుటుంబ సభ్యుల సహాయంతో తీసుకువ చ్చి ప్రశ్నించగా జరిగిన సంఘటనను వివరించిందని తెలిపింది. విద్యార్థిని తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు బొబ్బిలి డీఎస్పీ ఇషాక్ అహ్మద్ నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు సీఐ వి.చంద్రశేఖర్ తెలిపారు. ఇదిలా ఉండగా ఆదివారం రాత్రి పది గంటల సమయంలో ఎస్పీ గ్రేవెల్ ఇక్కడకు వచ్చి నిందితులను విచారించి వెళ్లారు. నిందితులపై నిర్భయ కేసు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్టు సీఐ తెలిపారు. నిందితులను కఠినంగా శిక్షించే విధంగా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కేఏ నాయుడు కోరారు. బాధిత విద్యార్థినికి అండగా ఉంటామని తెలిపారు. -
ఫోటోలతో బెదిరించి యువతిపై గ్యాంగ్ రేప్
-
ఫోటోలతో బెదిరించి యువతిపై గ్యాంగ్ రేప్
విజయనగరం: యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన విజయనగరం జిల్లా గజపతినగరం మండలం కురిటిపెంటలో ఆలస్యంగా వెలుగుచూసింది. ఇంటర్మీయట్ చదువుతున్న విద్యార్థినిపై అదే గ్రామానికి చెందిన ఐదుగురు యువకులు లైంగిక దాడి చేశారు. సెల్‌ఫోన్ తో ఫోటోలు తీసి ఆమెను బెదిరించి ఈ దారుణానికి పాల్పడ్డారు. ఈ విషయాన్ని ఎవరితో చెప్పుకోలేక బాధితురాలు ఇంటి నుంచి పారిపోయింది. ఆమెను వెతికి పట్టుకోవడంతో అసలు విషయం వెలుగుచూసింది. దీంతో బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి, కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
బాధితులకు న్యాయం జరిగే వరకూ పోరాటం
గజపతినగరం: జిల్లాకు చెందిన 24 మంది కూలీల మృతికి కారణమైన చెన్నై భవన యజమానిపై న్యాయ పోరాటం చేసి బాధితులకు న్యాయం జరిగేలా, మరింత పరిహారం అందేలా కృషి చేస్తామని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు సుజయ్ కృష్ణ రంగారావు, పీడిక రాజన్నదొర, మాజీ ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి చెప్పారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు బాధితుల తరఫున చెన్నై హైకోర్టులో పోరాడేందుకు ప్రత్యేక న్యాయవాదిని నియమి స్తున్నట్టు తెలిపారు. చెన్నైలోని 12 అంతస్తుల భవనం కూలిన ఘటనలో మృతి చెందిన దత్తిరాజేరు మండలం కోరపు కృష్ణాపురంలో కూలీల కుటుంబీకులకు బుధవారం వైఎస్ఆర్ సీపీ నాయకులు ఆర్థిక సాయం అందజేశారు. మృతులు పతివాడ బంగారునాయుడు, సిరిపురపు రాము, కర్రితౌడమ్మ, పేకేటి అప్పలరాము, పేకేటిలక్ష్మి(భార్యాభర్తలు), వనం దుర్గ, పతివాడ గౌరీశ్వరి కుటుంబాలతో పాటు తీవ్రంగా గాయపడిన మంత్రి మీనమ్మకు పార్టీ తరఫున చెక్కులు పంపి ణీ చేశారు. ఒక్కొక్క మృతుని కుటుంబానికిరూ.75 వేలు చొప్పున, గాయపడిన మీనమ్మకు రూ.20 వేలు సాయం అందజేశారు. ఈ సందర్భంగా బొబ్బిలి ఎమ్మెల్యే సుజయ్‌కృష్ణ రంగారావు మాట్లాడుతూ చెన్నై ఘటనలో మృతి చెందిన, తీవ్రంగా గాయపడిన వారిని ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ప్రభుత్వాలు ఆదుకోలేదని విమర్శించారు. జిల్లాలో ఉపాధి హా మీ పథకం సక్రమంగా అమలు కాకపోవడంతో కూలీ పనుల కోసం ఇతర రాష్ట్రాలకు వె ళ్లాల్సిన పరిస్థితులు వస్తున్నా యన్నారు. త్వరలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో తమ పార్టీ ఎమ్మెల్యేలు ఉపాధి హామీ పథకంలో లోపాలపై ప్రశ్నించనున్నట్టు తెలిపారు. సాలూరు ఎమ్మెల్యే పీడక రాజన్నదొర మాట్లాడుతూ సాలూరు నియోజకవర్గం పరిధిలో తూరుమామిడి, గైశీల గ్రామాల్లో ఇద్దరు కూలీలు తీవ్రంగా గాయపడ్డా వారిని పట్టించుకోలేదన్నారు. గైశీల గ్రామానికి చెందిన సుశీల తీవ్రంగా గాయపడి విశాఖ కేజీహెచ్‌కు వెళితే రెండు రోజుల పాటు నామమాత్రంగా వైద్య పరీక్షలు జరిపి ఇంటికి పం పించివేశారని ఆరోపించారు. ప్రస్తుతం ఆమె వికలాంగురాలై మంచం దిగలేని పరిస్థితిలో ఉందన్నారు. సుశీలకు విక లాంగ పింఛన్ కింద రూ.1500 తక్షణమే అందజేయడంతో పాటు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ దృష్టి కి తీసుకు వెళ్లనున్నట్టు తెలిపారు. కష్టాల్లో ఉన్న కుటుంబాల్లో ధైర్యం నింపేందుకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లాకొస్తే, శవరాజకీయాలు చేస్తున్నారని టీడీపీ నేతలు విమర్శలు చేయడం శోచనీయమన్నారు. అంతకుముందు మాజీ ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ తరఫున బాధితులకు సాయం చేస్తున్నట్టు చెప్పారు. బాధితులు అధైర్య పడొద్దని పార్టీ అండగా ఉంటుందని చె ప్పారు. ముందుగా జిల్లా పార్టీ అధ్యక్షుడు పెనుమత్స సాంబశివరాజు బాధితుల కుటుంబాలకు చెక్కులు అందజేశారు. అనంతరం మిగతా నాయకులు చెక్కులు పంపిణీ చేశారు. గజపతినగరం నియోజకవర్గ ఇన్చార్జ్ కడుబండి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కురుపాం ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి, మాజీ ఎమ్మెల్యే చత్రుచర్లచంద్రశేఖర్ రాజు, పార్వతీపురం, ఎస్‌కోట నియోజకవర్గాల ఇన్ఛార్జ్లు జమ్మాన ప్రసన్నకుమార్, నెక్కల నాయుడుబాబు, మాజీ ఎంపీపీ వర్రి నర్సింహమూర్తి,పార్టీనాయకులు పరీక్షీత రాజ్, ఎస్. బంగారునాయుడు, బమ్మిడి అప్పలనాయుడు, గంటా తిరుపతిరావు, రెడ్డి గురుమూర్తి, ఎం.శ్రీనివాసరావు, బోడసింగిసత్తిబాబు,వింద్యవాసి, ఎం. లింగాలవలస సర్పంచ్‌లు కోలావెంకటసత్తిబాబు, పప్పలసింహచలం, కోడి బాబుజి, దనానరాంమూర్తి, మృత్యంజయరావు,రౌతు సరిసింగరావు. తదితరులు పాల్గొన్నారు. -
వీడి రూటే సెపరేటు!
దొంగలు వినూత్న రీతితో చోరీలకు పాల్పడుతున్నారు. ఇంతవరకు పాలవాడి పేరుతో.. జ్యోతిష్యం.. బంగారానికి మెరుగుపెడతామంటూ.. తెలిసినవాళ్లమంటూ... ఇలా రకరకాల పేర్లు చెప్పి మోసాలకు పాల్పడేవారు. అయితే, ఇందుకు భిన్నంగా ఆలోచిస్తున్నారు వీరు. ఆర్టీసీ కాంప్లెక్స్‌లో బస్సులో డాన్సులు వేసి .. పిచ్చిపట్టిన వారిలాగా వ్యహరించి.. ప్రయాణికుల దృష్టి అతని వైపు మరలేలా చేసి హ్యాండ్ బ్యాగ్‌లు, జేబుల్లో నగదును అపహరించిన సంఘటన తాజాగా చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించి హెల్ప్‌డెస్క్ పోలీసులు, స్థానికులు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి.. గజపతినగరానికి చెందిన ఆర్.సాయి ఆర్టీసీ కాంప్లెక్స్, బస్సుల్లో డాన్సులు చేస్తుంటాడు. డాన్స్‌లు వేసి ప్రయాణికులను మరపించి మరో వ్యక్తితో జేబులు, బ్యాగ్‌లను అపహరించేలా చేస్తాడు. గురువారం ఇదే తరహాలో సాయి డాన్సులు చేస్తుండగా హెల్ప్‌డెస్క్ పోలీసులకు అనుమానం వచ్చింది. అతడిని విచారణ జరిపారు. తనకు మతిభ్రమించిందని అతను బదులిచ్చాడు. దీంతో పోలీసులు అనుమానం వచ్చి అతని జేబుల్లో వెతికారు. రూ.2 వేలు లభించాయి. ఆ రూ.2 వేలల్లో రూ.1500 తీసుకుని, తనకు మిగతా రూ.500 ఇచ్చి తనను వదిలేయూలని సారు ప్రాధేయపడ్డాడు. పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ జరపగా.. తాను మతిస్థిమితం లేని వ్యక్తిగా నటించి ప్రయూణికుల హ్యాండ్‌బ్యాగ్‌లు, జేబుల్లో ఉన్న నగదు, బంగారు అభరణాలను దొంగిలిస్తానని అంగీకరించాడు. దీంతో నిందితుడిని హెల్ప్‌డెస్క్ సిబ్బంది ఒకటో పట్టణ పోలీసులకు అప్పగించారు. ఇటువంటి వ్యక్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. -
చంద్రబాబు మాటలు నమ్మొద్దు
గజపతినగరం రూరల్, న్యూస్‌లైన్ : టీడీపీ అధినేత చంద్రబాబు ఎలాగైనా అధికారంలోకి రావాలన్న ఉద్దేశంతో ఆచరణ సాధ్యం కాని హామిలిస్తున్నారని, ఆయన మాటలను ఎవరూ నమ్మవద్దని వైఎస్సార్ సీపీ గజపతినగరం ఎమ్మెల్యే అభ్యర్థి కడుబండి శ్రీనివాసరావు అన్నారు. రాష్ట్రాభివృద్ధి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనతోనే సాధ్యమని తెలిపారు. ఆదివారం మండల కేంద్రంలోని వైఎస్సార్ విగ్రహం ఆవరణలో కాంగ్రెస్, టీడీపీలకు చెందిన వందలాది మంది నా యకులు, కార్యకర్తలు వైఎస్సార్ సీపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజనకు టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్ ప్రధాన కారణమన్నారు. ఆ మూడు పార్టీలకు ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. టీడీపీ ప్రజల విశ్వసనీయతను పూ ర్తిగా కోల్పోయిందన్నా రు. తమ పార్టీ మేనిఫెస్టో అన్ని వర్గాలకు మేలు చేసే విధం గా ఉందని తెలిపారు. అనంతరం టీడీపీ మండల మాజీ అధ్యక్షుడు గెద్ద రవి, మాజీ ఎంపీపీ కర్రి దేవి, కర్రి శ్రీనివాసరావు, టీడీపీ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి మండల లక్ష్మునాయుడు,ఎం. గుమడాం ఎంపీటీసీ మాజీ సభ్యుడు అల్లు శ్రీనివాసరావు, గెద్ద బాను, శీర రమణ తదితరులతో పాటు 2000 వేల కుటుంబాలు పార్టీలో చేరాయి. వారికి కడుబండి కండువాలు వేసి, పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకుడు గెద్ద రవి మాట్లాడుతూ టీడీపీలో దొంగలు చేరి ఆ పార్టీని పూర్తిగా నాశనం చేశారన్నారు. పార్టీలో 26 ఏళ్ల పాటు కష్టపడిన తమలాంటి వారికి గుర్తింపు లేకుండా చేశారని విమర్శించారు. ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థిని ఓడిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాంజీ రాజు, జెడ్పీటీసీ అభ్యర్థ్దిని తాడ్డి పార్వతమ్మ, ఏండ్రాపు శ్రీను, బూడి వెంకటరావు, దేవుడు జేఈ మంత్రి నర్సింగరావు, తదితరులు పాల్గొన్నారు. -
ఓటరు జాబితా సవరణ ప్రక్రియకు ఏర్పాట్లు
విజయనగరం కలెక్టరేట్, న్యూస్‌లైన్ : జిల్లాలో ఓటరు జాబితా సవరణ ప్రక్రియను వేగవంతం చే సేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఫొటోలతో కూడిన ఓటరు జాబితాను రూపకల్పన చేయడంతో పాటు 18 ఏళ్లు నిండిన యువతీ యువకులందరినీ ఓటర్లు గా చేర్చాలన్న ఆదేశాలతో అధికారులు సన్నద్ధమయ్యారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారం కార్యక్రమాలు చేపడుతున్నారు.ప్రధానంగా ఓటరు చేర్పుకు అవసరమైన ఫారం- 6, చనిపోయిన వారి పేరు తొలగించేందుకు ఫారం-7, చిరునామా, తప్పులు సవరించడానికి ఫారం- 8తో పాటూ పోలింగ్ స్టేషన్ మార్పు కోసం ‘ఫారం -8ఎ’లను కలెక్టరేట్లోని స్ట్రాంగ్ రూమ్‌లో అందుబాటులో ఉంచారు. వీటిని నియోజక వర్గాల వారీగా ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ చిన్నారావు ఆధ్వర్యంలో పంపిణీ చేస్తున్నారు. బుధవారం చీపురుపల్లి, గజపతినగరం నియోజకవర్గాలకు సంబంధించిన దరఖాస్తులను తరలించారు. -
మాజీ ఎమ్మెల్యే వంగపండు మృతి
గజపతినగరం, దత్తిరాజేరు, న్యూస్‌లైన్ : మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వంగపండు నారాయణప్పలనాయుడు మృతితో దత్తిరాజేరు మండలం గోభ్యాం కన్నీటి సంద్రంలో మునిగింది. నారాయణప్పలనాయుడు కొన్ని నెలలుగా గుండె జబ్బుతో బాధపడుతూ గజపతినగరం మండలం పురిటిపెంట న్యూకాలనీలో మృతి చెందారు. అంత్యక్రియలు బుధవారం ఉదయం గోభ్యాంలో నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వంగపండు నారాయణప్పలనాయుడు (వీఎన్) 1931లో జన్మించారు. 1956లో ఆ గ్రామ సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పెదమానాపురం నుంచి ఒకసారి, గజపతినగరం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యూరు. 1967లో పెదమానాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఇండిపెం డింట్గా పోటీ చేసి, అప్పటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వాసిరెడ్డి కృష్ణమూర్తినాయుడుపై తొలిసారిగా విజయం సాధించారు. . 1978లో గజపతినగరం నియోజకవర్గం నుంచి జనతాపార్టీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. 1983లో కాంగ్రెస్ టిక్కెట్ రాకపోవడంతో ఇండిపెండింట్‌గా పోటీ చేసి టీడీపీ నేత జంపన సత్యనారాయణరాజు చేతిలో ఓటమి పాలయ్యారు. 1985లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో సత్యనారాయణరాజుపై విజయం సా ధించారు. 1989, 1994, 1999 ఎన్నికల్లో ఆయన ఓటమిపాలయ్యూరు. పోరలి పీఏసీఎస్ అధ్యక్షుడిగా ఎన్నికై కేంద్ర సహకార బ్యాంకు ఉపాధ్యక్షుడిగా పదవిలో కొనసాగా రు. కుటుంబ నేపథ్యం వంగపండుకి భార్య అక్కమ్మ, ముగ్గురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమారుడు శ్రీరామ్మూర్తి దత్తిరాజేరు మండల పరిషత్ ఉపాధ్యక్షుడిగా పదవి బాధ్యతలు నిర్వర్తించారు. చిన్న కుమారుడు కృష్ణ గొభ్యాం సర్పంచ్‌గా బాధ్యతలు చేపట్టారు. ప్రముఖుల సంతాపం వంగపండు మృతితో గజపతినగరం పట్టణంలో విషాదఛాయలు అలముకున్నాయి. గజపతినగరం, మెంటాడ, దత్తిరాజేరు, బొండపల్లి మండలాల నుంచి కార్యకరక్తలు, నాయకులు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి మృతదేహం వద్ద నివాళులు అర్పించారు. ఎమ్మెల్యే బొత్స అప్పలనర్సయ్య హైదరాబాద్ నుంచి ఫోన్లో వం గపండు కుటుంబ సభ్యులను పరామర్శించారు. వైఎస్సార్ సీపీ నాయకులు కడుబండి శ్రీనివాసరావు, వేచలపు చినరామినాయుడు, పెద్దినాయుడు, శారదానాయుడు, మక్కువ శ్రీధర్, మాజీ మంత్రి పడాల అరుణ, టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి కె. ఎ. నాయుడు, డీసీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి మజ్జి శ్రీనివాసరావు, తదితరులు కుటుంబ సభ్యులను పరామర్శించారు. గోభ్యాం చేరిన మృతదేహం నారాయణప్పలనాయుడు మృతదేహాన్ని సాయంత్రం గ్రామానికి తీసుకువచ్చారు. వైఎస్సార్ సీపీ ఉత్తరాంధ్ర జిల్లాల సమన్యయకర్త ఆర్వీ సుజయ్‌కృష్ణ రంగరావు, మాజీ ఎమ్మెల్సీ వాసిరెడ్డి వరదరామారావు, రామభద్రపురం జెడ్పీటీసీ మాజీ సభ్యుడు అప్పికొండ శ్రీరాములనాయుడు కుటుంబ సభ్యులను పరామర్శించి, సంతాపం తెలిపారు. వంగపండు మృతి తీరని లోటు : అటవీశాఖ మంత్రి శత్రుచర్ల విజయనగరం కంటోన్మెంట్ : మాజీ ఎమ్మెల్యే వంగపండు నారాయణప్పలనాయుడు మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని రాష్ట్ర అటవీ శాఖా మంత్రి శత్రుచర్ల విజయరామరాజు అన్నారు. వంగపండు మృతి పట్ల మంగళవారం ఆయన ఒక ప్రకటనలో సంతాపం ప్రకటించారు. అలాగే కురుపాం ఎమ్మెల్యే జనార్దనథాట్రాజ్ కూడా నారాయణప్పలనాయుడు మృతికి సంతాపం తెలిపారు. -
అమ్మను వెదికేందుకని...
విజయనగరం ఫోర్ట్, న్యూస్‌లైన్ : ఈ చిన్నారుల పేర్లు జాస్మిన్(8), మోనిష(6). గజపతినగరంలో తప్పిపోయి తిరుగుతున్న వీరిని పోలీసుల సమాచారంతో చైల్డ్‌లైన్ సభ్యులు తమ కార్యాలయానికి తీసుకొచ్చారు. తమ అమ్మ కనిపించడం లేదని, ఆమె కోసం వెదుకుతూ వెళ్లామని ఈ చిన్నారులు చెబుతున్నారు. తమది పట్టణంలోని ఖాదర్నగర్ అని తెలిపారు. అంతకుమించి వివరాలు చెప్పలేకపోతున్నారు. గజపతినగరం వైపు వెళ్లి.. అక్కడ నుంచి ఎటువెళ్లాలో తెలియక బిక్కుబిక్కుమంటున్న వారి గురించి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే చైల్డ్‌లైన్ 1098 సంస్థ సభ్యులకు సమాచారమిచ్చారు. చైల్డ్‌లైన్ సభ్యులు గజపతినగరం చేరుకుని బాలికలిద్దరినీ విజయనగరంలోని కార్యాలయానికి తీసుకొచ్చి, భోజనం పెట్టారు. ఈ చిన్నారుల తరఫు వారు ఎవరైనా వస్తే అప్పగిస్తామని సంస్థ సభ్యులు తెలిపారు. -
చోరీకి పాల్పడింది 15 ఏళ్లలోపు వారే..
గజపతినగరం, న్యూస్‌లైన్ : వారిద్దరి వయసూ 15, 12 ఏళ్లు. కానీ.. పెద్ద నేరమే చేశారు. ఓ ఇంట్లో పని చేసిన బాలుడు.. మరో బాలునితో కలసి ఆ ఇంటికే కన్నం వేశాడు. ఇంటి యజమాని లేని సమయంలో చోరీకి పాల్పడ్డారు. చోరీ ఘటనపై యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. ఇద్దరు బాలలనూ అదుపులోకి తీసుకున్నారు. చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను స్థానిక సీఐ ఎం.శ్రీనివాసరావు మంగళవారం వెల్లడించారు. మండలంలోని పురిటిపెంట గ్రామం న్యూకాలనీలో ఎల్లపు సంతోష్నవీన్ తల్లి గౌరితో కలసి నివాసం ఉంటున్నాడు. పెదచామలాపల్లి గ్రామంలో డెయిరీఫారానికి సంబంధించి పనులు చేపట్టడంతో ప్రతి రోజూ తల్లితోపాటు ఆయన ఉదయం వెళ్లి సాయంత్రం ఇంటికి వస్తుండేవాడు. గత నెల 29న సాయంత్రం ఇంటికి వచ్చేసరికి తలుపులు విరగ్గొట్టి ఉన్నాయి. బీరువాలో గల నగదుతోపాటు, బంగారు నగలు అపహరణకు గురైనట్లు గుర్తించి, వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై టి.కామేశ్వరరావు క్లూస్ టీంతో వచ్చి దర్యాప్తు చేపట్టారు. ఇంట్లో పని చేసినవాడే... దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. కొద్ది రోజుల్లోనే కేసును ఛేదించారు. గతంలో నవీన్ ఇంట్లో చామలాపల్లి గ్రామానికి చెందిన బాలుడు(12) పని చేసేవాడు. ఇంట్లో పని చేస్తున్న సమయంలో బాలుడు.. యజమాని సెల్‌ఫోన్‌తోపాటు, కొంత మొత్తం నగదును అపహరించాడు. ఇది గమనించిన నవీన్ బాలునిపై చేసుకున్నాడు. ఇంకెప్పుడైనా ఇలాంటి పనులు చేస్తే సహించేది లేదని మందలించాడు. ఇది మనసులో పెట్టుకున్న బాలుడు.. యజమానిపై కక్ష పెంచుకున్నాడు. తన పిన్ని కొడుకైన తాడేందరవలస గ్రామానికి చెందిన మరో బాలుడు(15)తో కలసి నవీన్ ఇంట్లో చోరీకి పథకం రచించాడు. గత నెల 29న నవీన్ ఇంట్లో ఎవరూ లేని సమయంలో లోపలికి ప్రవేశించి, బీరువాను పగలగొట్టారు. అందులో ఉన్న రూ.92,500 నగదు, మూడు తులాల బంగారు ఆభరణాలు, 15 తులాల వెండి వస్తువులు, రూ.63 వేల విలువ చేసే వీడియో కెమెరా, ఒక ల్యాప్‌టాప్‌ను అపహరించారు. బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు... సోమవారం సాయంత్రం తాడేందరవలస గ్రామంలో ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరూ మైనర్లే కావడంతో విజయనగరం బాలనేరస్తుల కోర్టుకు అప్పగిస్తున్నట్లు సీఐ తెలిపారు. కార్యక్రమంలో ఎస్సై టి.కామేశ్వరరావు పాల్గొన్నారు. -
వేర్వేరు ప్రమాదాల్లో పది మందికి గాయాలు
గజపతినగరం, న్యూస్‌లైన్ : వేర్వేరు ప్రమాదాల్లో పదిమంది గాయాలపాలయ్యారు. వివరాలిలా ఉన్నాయి. మండల పరిధిలోని మరుపల్లి జంక్షన్ వద్ద ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. విజయనగరం నుంచి బొబ్బిలి వైపు వెళ్తున్న ఆటో ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయి అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆమదాలవలసకు చెందిన పాపారావు, సంధ్యారాణి, కృష్ణవేణి, దుర్గాప్రసాద్, అలజంగి భవానీ, కొణిశి గ్రామానికి చెందిన పాసల కొండదేముడు, దేవుపల్లి గ్రామానికి చెందిన ఎం.పైడిరాజు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను 108 వాహనంలో స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వీరిలో పాపారావు, కృష్ణవేణి, దుర్గాప్రసాద్, అలజంగి భవానీల పరిస్థితి విషమంగా ఉండడంతో జిల్లా కేంద్రాస్పత్రికి రిఫర్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేశారు. గుణుపూరుపేట వద్ద.. డెంకాడ : మండలంలోని గుణుపూరుపేట సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు గాయపడ్డారు. పూసపాటిరేగ మండలం కుమిలి నుంచి విజయనగరం వైపు వస్తున్న ఆటో ఊడుకులపేట వద్ద బోల్తా పడింది. ఈ ఘటనలో కుమిలికి చెందిన బమ్మిడి నర్సమ్మ, దున్న అప్పలనర్సమ్మ, గుణుపూరుపేటకు చెందిన కొండపు కొత్తయ్య గాయపడ్డారు. కూరగాయలు తీసుకుని విజయనగరంలోని రైతు బజార్లో విక్రయించేందుకు ఆటోలో వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను జిల్లా కేంద్రాస్పత్రికి తరలించి, పోలీసులు కేసు నమోదు చేశారు. -
ఉండవల్లిపై మండిపడ్డ షర్మిల