
మృతి చెందిన రామయ్యమ్మ
గజపతినగరం రూరల్: మండలంలోని కొత్తబగ్గాం సమీపంలో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మహిళ గురువారం చికిత్స పొందుతూ మృతి చెందింది. వివరాల్లోకి వెళితే.. కొత్తబగ్గాం గ్రామానికి చెందిన కానూరు రామయ్యమ్మ (63) బుధవారం రాత్రి బహిర్బూమి వెళ్తుండగా, మెంటాడ నుంచి గజపతినగరం వైపు వస్తున్న వ్యాన్ బలంగా ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో రామయ్యమ్మ తీవ్రంగా గాయపడింది. వెంటనే క్షతగాత్రురాలిని విజయనగరం కేంద్రాస్పత్రికి తరలించగా, ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం మృతి చెందింది. మృతురాలి కుమారుడు నారాయణరావు ఫిర్యాదు మేరకు ఎస్సై పి. వరప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.