ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం సంభవించి రూ. 4 లక్షల విలువైన ధాన్యం కుప్పలు తగలబడ్డాయి.
గజపతినగరం (విజయనగరం) : ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం సంభవించి రూ. 4 లక్షల విలువైన ధాన్యం కుప్పలు తగలబడ్డాయి. ఈ సంఘటన విజయనగరం జిల్లా గజపతినగరం మండలం ముచ్చర్ల గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది.
గ్రామానికి చెందిన రైతు ధాన్యం కుప్పలను ఒక్కచోటకు చేసి వరి గడ్డితో కప్పి ఉంచాడు. ధాన్యాన్ని అమ్మడం కోసం ఏర్పాట్లు చేసుకుంటున్న క్రమంలో ప్రమాదవశాత్తు మంటలంటుకొని ధాన్యం మెత్తం కాలి బుడిదయ్యాయి. దీంతో రైతు కన్నీరుమున్నీరవుతున్నాడు.