ఈ చిన్నారుల పేర్లు జాస్మిన్(8), మోనిష(6). గజపతినగరంలో తప్పిపోయి తిరుగుతున్న వీరిని పోలీసుల సమాచారంతో చైల్డ్‌లైన్ సభ్యులు తమ కార్యాలయానికి తీసుకొచ్చారు.
విజయనగరం ఫోర్ట్, న్యూస్‌లైన్ : ఈ చిన్నారుల పేర్లు జాస్మిన్(8), మోనిష(6). గజపతినగరంలో తప్పిపోయి తిరుగుతున్న వీరిని పోలీసుల సమాచారంతో చైల్డ్‌లైన్ సభ్యులు తమ కార్యాలయానికి తీసుకొచ్చారు. తమ అమ్మ కనిపించడం లేదని, ఆమె కోసం వెదుకుతూ వెళ్లామని ఈ చిన్నారులు చెబుతున్నారు. తమది పట్టణంలోని ఖాదర్‌నగర్ అని తెలిపారు. అంతకుమించి వివరాలు చెప్పలేకపోతున్నారు. గజపతినగరం వైపు వెళ్లి.. అక్కడ నుంచి ఎటువెళ్లాలో తెలియక బిక్కుబిక్కుమంటున్న వారి గురించి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే చైల్డ్‌లైన్ 1098 సంస్థ సభ్యులకు సమాచారమిచ్చారు. చైల్డ్‌లైన్ సభ్యులు గజపతినగరం చేరుకుని బాలికలిద్దరినీ విజయనగరంలోని కార్యాలయానికి తీసుకొచ్చి, భోజనం పెట్టారు. ఈ చిన్నారుల తరఫు వారు ఎవరైనా వస్తే అప్పగిస్తామని సంస్థ సభ్యులు తెలిపారు.