సాక్షి, విజయనగరం: గజపతినగరం నియోజకవర్గంలో ఈవీఎం తనిఖీ అనుమానాస్పదంగా మారింది. గజపతినగరం అసెంబ్లీ సెగ్మెంట్ ఓట్లపై వైఎస్సార్‌సీపీ నేతలు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. పోలింగ్ బూత్ నంబర్ 20, పెదకాద ఈవీఎం తనిఖీ చేయాలని, వీవీప్యాట్ లెక్కించాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే వైఎస్సార్‌సీపీ ఫిర్యాదుకు సంబంధం లేకుండా అధికారులు మాక్ పోలింగ్ నిర్వహించడం వివాదస్పదంగా మారింది.
పెదకాద ఈవీఎంలో డేటా మొత్తం అధికారులు తొలగించారు. వీవీప్యాట్ బాక్స్‌లోనూ వీవీప్యాట్‌లు కనిపించలేదు. ఈవీఎంలో డేటా తొలగించి కొత్త గుర్తులను లోడ్ చేశారు. అయితే కొత్త గుర్తులతో మాక్ పోలింగ్ నిర్వహించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వైఎస్సార్‌సీపీ అడిగిన ఈవీఎం స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ కేంద్రం సీసీ ఫుటేజ్, బాటరీ లెవెల్ డేటాను ఎన్నికల అధికారులు ఇవ్వలేదు.
దీంతో ఒంగోలు తరహాలోనే మాక్ పోలింగ్‌తో అధికారులు డ్రామా నడిపిస్తున్నట్లు ఆరోపణలు వస్తన్నాయి. కొత్త గుర్తులతో 1400 ఓట్లు మాక్ పోలింగ్ జరిగింది. ఫ్యాన్, సైకిల్ గుర్తులు లేకుండానే మాక్ పోలింగ్ నిర్వహణ పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment