హైదరాబాద్ : విజయనగరం జిల్లా గజపతినగరం వద్ద కోర్బా ఎక్స్ప్రెస్కు శనివారం తృటిలో ప్రమాదం తప్పింది. స్థానిక రైల్వే ట్రాక్పై ఐరన్ రాడ్స్ భారీ సంఖ్యలో కట్టలుగా పడి ఉండటాన్ని కోర్బా ఎక్స్ప్రెస్ డ్రైవర్ గుర్తించాడు. దీంతో వేగంతో వెళ్తున్న ఎక్స్ప్రెస్ రైలుకు సెడన్ బ్రేకు వేసి నిలిపివేశాడు. అనంతరం ట్రాక్కు అడ్డంగా ఇనపరాడ్లు ఉన్న సమాచారాన్ని రైల్వే గార్డుకి, సమీపంలోని రైల్వే స్టేషన్ సిబ్బందికి, రైల్వే అధికారులకి అందించాడు.
దీంతో రైల్వే సిబ్బందితోపాటు పోలీసులు అక్కడికి చేరుకుని ట్రాక్పై భారీగా పడి ఉన్న ఇనుపరాడ్స్ తొలగించారు. అనంతరం పట్టాలను రైల్వే సిబ్బంది పరీక్షిస్తున్నారు. ట్రాక్పై ఇనుపరాడ్లు పడి ఉండటంపై ఇది అకతాయిల పనా లేక సంఘ విద్రోహ చర్యల పనా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తమకు పెద్ద ప్రమాదమే తప్పిందని ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.