korba express
-
విశాఖలో కోర్బా ఎక్స్‌ప్రెస్ రైలు అగ్ని ప్రమాదం (ఫొటోలు)
-
అగ్నిపథ్ ఆందోళనలతో నిలిచిన రైలు.. సమయానికి వైద్యం అందక వ్యక్తి మృతి
సాక్షి, విజయనగరం: త్రివిధ దళాల్లో రిక్రూట్మెంట్ కోసం కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళనలు దేశ వ్యాప్తంగా హింసాత్మకంగా మారిన విషయం తెలిసింది. ఆర్మీ అభ్యర్థులు సృష్టించిన అల్లర్లు రూ.కోట్లలో ఆస్తినష్టాన్ని మిగల్చడమే కాకుండా పలుచోట్ల ప్రాణాలను కూడా బలితీసుకున్నాయి. అగ్నిపథ్ ఆందోళన నేపథ్యంలో కోర్బా-విశాఖ ఎక్స్‌ప్రెస్‌ను కొత్తవలసలో నిలిపివేయడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. గుండె జబ్బు చికిత్స కోసం ఒడిశా నుంచి వస్తున్న జోగేష్ బెహరా(70) అనే వృద్ధుడు మృతి చెందాడు. విశాఖలో రైల్వే స్టేషన్ వద్ద ఆందోళన చేస్తున్న విద్యార్థి నాయకులను అరెస్టు చేస్తున్న పోలీసులు బెహరా కొంతకాలంగా గుండె జబ్బుతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలోనే చికిత్స కోసం ఒడిశా నుంచి విశాఖకు అతని కుటుంబ సభ్యులు కోర్బా-విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో బయల్దేరారు. అయితే అగ్నిపథ్ అల్లర్లతో విశాఖ వెళ్లాల్సిన రైలును అధికారులు కొత్తవలసలోనే నిలిపివేశారు. సమయానికి అంబులెన్స్ లేక కొత్తవలసలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స చేస్తుండగానే జోగేష్ బెహరా మృతి చెందారు. సమయానికి వైద్యం అందకనే జోగేష్ మృతిచెందాడని బాధితుడి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. విశాఖలో రైల్వే స్టేషన్ వద్ద ఆందోళన చేస్తున్న విద్యార్థి నాయకులను అరెస్టు చేస్తున్న పోలీసులు చదవండి: అగ్నిపథ్ ఆందోళనలు: ఏపీ ప్రభుత్వం అప్రమత్తం -
బంగారు బిస్కెట్ల దోపిడీ ముఠా అరెస్టు
సాక్షి, ఒంగోలు క్రైం: రైలులో ప్రయాణిస్తున్న సేలంకు చెందిన బంగారు వ్యాపారిని బెదిరించి బంగారు బిస్కెట్లను దోచుకున్న ముఠాను అరెస్టు చేసినట్లు రైల్వే జీఆర్పీ గుంతకల్ ఎస్పీ ఎం.సుబ్బారావు పేర్కొన్నారు. స్థానిక ఒంగోలు రైల్వే స్టేషన్‌లోని జీఆర్పీ పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. తమిళనాడు రాష్ట్రం సేలంకు చెందిన షేక్ ఇమ్రాన్ ఫిబ్రవరి 18న చత్తీస్ఘడ్ రాష్ట్రం రాయపూర్ నుంచి బంగారం కొనుగోలు చేసి సేలంకు కోర్బా ఎక్స్‌ప్రెస్ రైలులో వెళుతున్నాడు. ఇతని వద్ద గతంలో కారు డ్రైవర్‌గా పనిచేసిన విజయ్‌కుమార్ విషయాన్ని సేలంకు చెందిన తన స్నేహితులు ఆనంద్ ప్రకాష్, వివేక్ జైన్ం సోక్రటీస్లకు చెప్పారు. వీరంతా ముఠాగా ఏర్పడి బంగారాన్ని దోచుకునేందుకు పథకం రచించారు. అందులో భాగంగా కోర్బా ఎక్స్‌ప్రెస్‌లో రైలులో ఇమ్రాన్‌ను విజయవాడ నుంచి అనుసరించారు. రైలు ఒంగోలు రైల్వేస్టేషన్‌కు రాగానే ఈ ముగ్గురు ఇమ్రాన్ ఉన్న రిజర్వేషన్ బోగీలోకి వెళ్లారు. తాము తమిళనాడు పోలీసులమని చెప్పి, దొంగ బంగారం వ్యాపారం చేస్తున్నావని సమాచారం వచ్చిందని అందుకే అరెస్టు చేస్తున్నామని అదుపులోకి తీసుకుని అతని వద్ద ఉన్న 913 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఒంగోలు రైల్వే స్టేషన్రాగానే స్టేషన్లో దించి బయటకు తీసుకెళ్లారు. అప్పటికే సిద్ధం చేసుకోని ఉన్న కారులో ఎక్కించుకొని ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్ సమీపానికి తీసుకెళ్లి చీకట్లో వదిలేసి వెళ్లిపోయారు. దీంతో వెంటనే షేక్ ఇమ్రాన్ జీఆర్పీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసి ఒంగోలు జీఆర్పీ సీఐ టి.శ్రీనివాసరావు దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో సంబంధంలో ఉన్న తమిళనాడు రాష్ట్రం సేలంకు చెందిన ఆనంద్ ప్రకాష్, వివేక్ జైన్, సోక్రటీస్, కారు డ్రైవర్ విజయకుమార్‌లను అరెస్టు చేశామన్నారు. వారి వద్ద నుంచి రూ.29 లక్షల విలువైన 913 గ్రాముల బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. అదే విధంగా నిందితులు ఉపయోగించిన కారు టీఎన్ 30డీఎన్ 6669ను కూడా స్వాధీనం చేసుకున్నామని వివరించారు. దర్యాప్తులోజిల్లా ఎస్సీ పూర్తి సహకారం కేసు దర్యాప్తులో ప్రకాశం జిల్లా ఎస్పీ బి.సత్య ఏసుబాబు పూర్తిగా సహకరించారని జీఆర్పీ గుంతకల్ ఎస్పీ ఎం.సుబ్బారావు పేర్కొన్నారు. నిందితులు స్టేషన్లో దిగిన సమయం నుంచి సీసీ పుటేజ్‌ల ఆధారంగా, నగరంలోని సీసీ కెమేరాల పుటేజ్‌ల ఆధారంగానూ కేసు దర్యాప్తు కొనసాగింది. ఎస్పీ తన ఐటీ కోర్ సిబ్బందిచేత సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి కాల్‌డేటాలను సేకరించి నిందితులను పట్టుకోవటంలో పూర్తిగా సహకరించారని అభినందించారు. అదే విధంగా ఒంగోలు జీఆర్పీ పోలీస్‌స్టేషన్ సిబ్బందిని గుంతకల్ ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. సమావేశంలో జీఆర్పీ నెల్లూరు డీఎస్పీ జి.ఆంజనేయులు, ఒంగోలు జీఆర్పీ సీఐ టి.శ్రీనివాసరావు, చీరాల ఎస్సై జి.రామిరెడ్డి, హెడ్ కానిస్టేబుల్ ఎంజె.కిషోర్ బాబు, కానిస్టేబుళ్లు బి.శ్రీనివాసరావు, ఈపీఎస్ రెడ్డి, ఎస్కే బాషాతో పాటు పలువురు ఉన్నారు. -
మాకూ హృదయం ఉంది..
సాక్షి, వరంగల్: ఖాకీ అంటే వారిలో కరకుదనం ఉంటుందనుకుంటాం. కానీ మాకూ హృదయముంది.. మేమూ చేతనైన సేవ చేస్తాం అని చాటిచెప్పారు రైల్వే పోలీసులు. అస్వస్థతకు గురైన ఓ ప్రయాణికుడికి సత్వరం వైద్య చికిత్సలందించేందుకు రైల్వే స్టేషన్ మేనేజర్‌తో కలిసి సాయపడి మానవత్వం చాటుకున్నారు. ఈ సంఘటన వరంగల్ రైల్వే స్టేషన్లో మంగళవారం మధ్యాహ్నం జరిగింది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని జస్పూర్‌నగర్ జిల్లా కట్టసార్ గ్రామానికి చెందిన శంకర్‌రామ్(19) కేరళలోని ఓ టైర్లు తయారీ కంపెనీలో వర్కర్‌గా పనిచేస్తున్నాడు. తన గ్రామానికి వెళ్లేందుకు కోర్బా ఎక్స్‌ప్రెస్ రైలులో ప్రయాణిస్తున్నాడు. రైలు ఖమ్మం దాటగానే అతనికి తీవ్రమైన కడుపునొప్పి వచ్చింది. దీంతో సీటులోనే కూలబడి అల్లాడిపోతుండగా తోటి ప్రయాణికులు రైల్వే టీటీఈకు చెప్పారు. ఆయన వరంగల్ రైల్వే స్టేషన్ మేనేజర్ వెంకటేశ్వర్లుకు సమాచారం అందించారు. స్టేషన్ మేనేజర్ వెంటనే 108 సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన వారు స్టేషన్‌కు చేరారు. ప్లాట్‌ఫామ్-2లో రైలు ఆగగానే అక్కడ వేచి ఉన్న స్టేషన్ మేనేజర్ వెంకటేశ్వర్లు, జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ రాజేందర్, ఆర్పీఎఫ్ హెచ్‌సీ రాజిరెడ్డి, పీసీలు సదానందం, రియాజ్, సంజీవరావు, హోంగార్డు చిమ్నా నాయక్‌లు శంకర్‌రామ్‌ను చేతులమీద మోసుకుని ప్లాట్‌ఫాం-1పై ఉన్న108 వాహనం వద్దకు చేర్చారు. 108 సిబ్బంది తగిన చికిత్స అందిస్తూ ఎంజీఎంకు తరలించారు. పోలీసులు సకాలంలో స్పందించడంపట్ల ప్రయాణికులు వారిని అభినందించారు. శంకర్‌రామ్‌కు సంబంధించిన సమాచారాన్ని అతని కుటుంబ సభ్యులకు అందజేసినట్లు పోలీసులు తెలిపారు. -
కోర్బా ఎక్స్‌ప్రెస్‌కు తృటిలో తప్పి ప్రమాదం
హైదరాబాద్ : విజయనగరం జిల్లా గజపతినగరం వద్ద కోర్బా ఎక్స్‌ప్రెస్‌కు శనివారం తృటిలో ప్రమాదం తప్పింది. స్థానిక రైల్వే ట్రాక్‌పై ఐరన్ రాడ్స్ భారీ సంఖ్యలో కట్టలుగా పడి ఉండటాన్ని కోర్బా ఎక్స్‌ప్రెస్ డ్రైవర్ గుర్తించాడు. దీంతో వేగంతో వెళ్తున్న ఎక్స్‌ప్రెస్ రైలుకు సెడన్ బ్రేకు వేసి నిలిపివేశాడు. అనంతరం ట్రాక్‌కు అడ్డంగా ఇనపరాడ్లు ఉన్న సమాచారాన్ని రైల్వే గార్డుకి, సమీపంలోని రైల్వే స్టేషన్ సిబ్బందికి, రైల్వే అధికారులకి అందించాడు. దీంతో రైల్వే సిబ్బందితోపాటు పోలీసులు అక్కడికి చేరుకుని ట్రాక్‌పై భారీగా పడి ఉన్న ఇనుపరాడ్స్ తొలగించారు. అనంతరం పట్టాలను రైల్వే సిబ్బంది పరీక్షిస్తున్నారు. ట్రాక్‌పై ఇనుపరాడ్లు పడి ఉండటంపై ఇది అకతాయిల పనా లేక సంఘ విద్రోహ చర్యల పనా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తమకు పెద్ద ప్రమాదమే తప్పిందని ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.