దత్తిరాజేరు (గజపతినగరం) : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాటల్లోనే మోసం ఉంటుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. తొమ్మిదేళ్ల పాటు అధికారానికి దూరంగా ఉన్న బాబు ఈసారి మారి ఉంటారనుకుని ప్రజలు ఆయన్ను అధికారంలోకి తీసుకువస్తే .. మళ్లీ అవే మాయ మాటలు చెబుతున్నారన్నారు. ఎన్నాళ్లూ అయినా.. బాబు నైజం మారదని విమర్శించారు. శనివారం ఆయన దత్తిరాజే రు మండలంలోని పెదమానాపురం ఎంఎస్‌ఎన్ కళాశాల ఆవరణలో జరిగిన మండల కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడారు. టీడీపీ ప్ర భుత్వం ప్రజాహిత కార్యక్రమాలను విస్మరించి, ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతోందన్నారు.
చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తరువాత రుణ మాఫీ చేస్తారని రైతులు, డ్వాక్రా మహిళలు కళ్లల్లో ఒత్తులు పెట్టుకొని చూశారన్నారు. కానీ ఇప్పటికీ ఆయన మాయ మాటలే చెబుతున్నారని చెప్పారు. రుణమాఫీపై బాబు తొలి సంతకం చేసిన వెంటనే తమ ఇబ్బందులు తొలగిపోతాయని భావించిన రైతులు ఆ ఆశ నిరాశే అని తెలిసిన తరువాత ఆత్మ హత్యలు చేసుకుంటున్నారని ఆరోపించారు. ప్రస్తుతం ప్రకటించిన రూ. 50 వేల రుణమాఫీ కూడా అమలు కావడం కష్టమేనని చెప్పారు. ఆ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి కడుబండి శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ గ్రామస్థాయి నుంచి పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. రానన్నది రాజన్న రాజ్యమేనని తెలిపారు. ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలల్లోనే ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని చెప్పారు.
ప్రతిపక్ష పార్టీగా ప్రజా పక్షాన పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. పంచాయతీరాజ్ చాంబర్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మామిడి అప్పలనాయుడు మాట్లాడుతు పూటకోక మాట చెప్పే చంద్ర బాబును ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. రుణమాఫీ పేరుతో అధికారంలోకి వచ్చిన బాబుకు ప్రజా సంక్షేమం తెలియదన్నారు. ఆ పార్టీ దత్తిరాజేరు మండల అధ్యక్షుడు బోడసింగి సత్తిబాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎస్. కోట నియోజకవర్గ ఇన్‌చార్జి నెక్కల నాయుడు బాబు, జిల్లా ఎస్సీ సెల్ సభ్యుడు జయంత్‌కుమార్, జిల్లా ప్రచార కమిటీ అధ్యక్షుడు గొర్లె వెంకటరమణ, జెడ్పీటీసీ సభ్యురాలు గోటివాడ అప్పలమ్మ, గంట్యాడ మాజీ ఎంపీపీ వర్రి నరసింహులు, పార్టీ నాయకుడు ఈదుబిల్లి కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
జిల్లా, మండల కమిటీల ఎంపిక
జిల్లా కమిటీ సభ్యులుగా బోడసింగి సత్తిబాబు, జిల్లా గొర్లె పెంపకందారుల సహకార సంఘం అధ్యక్షుడు బమ్మిడి అప్పలనాయుడును నియమించినట్టు పార్టీ జిల్లా అధ్యక్షుడు కోలగట్ల తెలిపారు. అలాగే దత్తిరాజేరు మండల పార్టీ అధ్యక్షుడిగా కడుబండి రమేష్‌నాయుడు, యువజన నాయకులుగా పిళ్లా పైడిపినాయుడును నియోజకవర్గ ఇన్‌చార్జి కడుబండి శ్రీనివాసరావు ప్రకటించారు.
బాబు మాటల్లోనే మోసం
Published Sun, Dec 7 2014 1:36 AM | Last Updated on Fri, May 25 2018 9:17 PM
Advertisement