సినిమా... సినిమా | Cinema noise in Gajapathinagaram | Sakshi
Sakshi News home page

సినిమా... సినిమా

Published Mon, Jan 4 2016 2:21 AM | Last Updated on Sat, Aug 11 2018 8:27 PM

సినిమా... సినిమా - Sakshi

సినిమా... సినిమా

 గజపతినగరంలో సినిమా సందడి
  ఉత్సాహంగా ‘త్రీ రోజెస్’ చిత్ర షూటింగ్
 
 గజపతినగరం, గజపతినగరం రూరల్: గజపతినగరం పట్టణంలో ఆదివారం సినిమా సందడి నెలకొంది. జెడ్పీటీసీ మాజీ సభ్యుడు గార తవుడు నిర్మాతగా మారి తెరకెక్కిస్తున్న తొలి చిత్రం ‘త్రీ రోజెస్’ ముహూర్తపు సన్నివేశాన్ని పట్టణంలో ఆదివారం చిత్రీకరించారు. కార్తీక క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రానికి శ్రీముత్యం దర్శకత్వం వహిస్తున్నారు. నాని, శ్రీకాంత్, కథానాయకులుగా చేస్తుండగా హని, రజియా హీరోయిన్లుగా నటిస్తున్నారు. స్థానిక అభయాంజనేయ స్వామి ఆలయంలో పూజలు నిర్వహించాక ముహూర్తపు షాట్ తెరకెక్కించారు.
 
  దీనికి మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనర్సయ్య క్లాప్ కొట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘త్రీ రోజెస్’ మంచి సందేశాత్మక చిత్రమని ఆయన తెలిపారు. ఈ సినిమా ద్వారా యువత నడవడికను చూపించనున్నారని చెప్పారు. నిర్మాత గార తవుడు మాట్లాడుతూ రాజకీయ రంగంలో ఆదరించినట్లుగానే సినిమా రంగంలోనూ తనను ఆదరించాలని కోరారు. యువతకు మంచి సందేశం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ స్క్రిప్టు విని వెంటనే నిర్మాణానికి ఒప్పుకున్నానని తెలిపారు.
 
 దర్శకుడు ముత్యం మాట్లాడుతూ హారర్, కామెడీ జానర్‌లో సినిమా ఉంటుందని చెప్పారు. అన్ని వర్గాల వారు మెచ్చుకునేలా సినిమాను రూపొందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో సీనియర్ నటులు ఆరిశెట్టి వినోద్, సహ నిర్మాత కె. పైడిపినాయుడు, నటులు నాని, డేవిడ్, రజియా తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో బొండపల్లి జెడ్పీటీసీ సభ్యుడు బండారు బాలాజీ, స్థానిక మండల పార్టీ అధ్యక్షుడు బూడి వెంకటరావు, మజ్జి రామకృష్ణ, బాలాజీ పాలిటెక్నికల్ విద్యాసంస్థల కరస్పాంటెండెంట్ రెడ్డి శాఖర్ బాబు, పురిటి పెంట సర్పంచ్ మండల సురేష్, బంగారమ్మ పేట మాజీ సర్పంచ్ బుగత రాజుతో పాటు పలువురు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement