వీడి రూటే సెపరేటు!
దొంగలు వినూత్న రీతితో చోరీలకు పాల్పడుతున్నారు. ఇంతవరకు పాలవాడి పేరుతో.. జ్యోతిష్యం.. బంగారానికి మెరుగుపెడతామంటూ.. తెలిసినవాళ్లమంటూ... ఇలా రకరకాల పేర్లు చెప్పి మోసాలకు పాల్పడేవారు. అయితే, ఇందుకు భిన్నంగా ఆలోచిస్తున్నారు వీరు. ఆర్టీసీ కాంప్లెక్స్‌లో బస్సులో డాన్సులు వేసి .. పిచ్చిపట్టిన వారిలాగా వ్యహరించి.. ప్రయాణికుల దృష్టి అతని వైపు మరలేలా చేసి హ్యాండ్ బ్యాగ్‌లు, జేబుల్లో నగదును అపహరించిన సంఘటన తాజాగా చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించి హెల్ప్‌డెస్క్ పోలీసులు, స్థానికులు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి.. గజపతినగరానికి చెందిన ఆర్.సాయి ఆర్టీసీ కాంప్లెక్స్, బస్సుల్లో డాన్సులు చేస్తుంటాడు.
డాన్స్‌లు వేసి ప్రయాణికులను మరపించి మరో వ్యక్తితో జేబులు, బ్యాగ్‌లను అపహరించేలా చేస్తాడు. గురువారం ఇదే తరహాలో సాయి డాన్సులు చేస్తుండగా హెల్ప్‌డెస్క్ పోలీసులకు అనుమానం వచ్చింది. అతడిని విచారణ జరిపారు. తనకు మతిభ్రమించిందని అతను బదులిచ్చాడు. దీంతో పోలీసులు అనుమానం వచ్చి అతని జేబుల్లో వెతికారు. రూ.2 వేలు లభించాయి. ఆ రూ.2 వేలల్లో రూ.1500 తీసుకుని, తనకు మిగతా రూ.500 ఇచ్చి తనను వదిలేయూలని సారు ప్రాధేయపడ్డాడు.
పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ జరపగా.. తాను మతిస్థిమితం లేని వ్యక్తిగా నటించి ప్రయూణికుల హ్యాండ్‌బ్యాగ్‌లు, జేబుల్లో ఉన్న నగదు, బంగారు అభరణాలను దొంగిలిస్తానని అంగీకరించాడు. దీంతో నిందితుడిని హెల్ప్‌డెస్క్ సిబ్బంది ఒకటో పట్టణ పోలీసులకు అప్పగించారు. ఇటువంటి వ్యక్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.