ఇంటర్ విద్యార్థిని స్నానం చేస్తుండగా సెల్‌ఫోన్‌తో చిత్రీకరణ | Inter student 'sexually assaulted' on Dreams teenagers | Sakshi

ఇంటర్ విద్యార్థిని స్నానం చేస్తుండగా సెల్‌ఫోన్‌తో చిత్రీకరణ

Sep 29 2014 1:18 AM | Updated on Jul 23 2018 8:49 PM

ఇంటర్ విద్యార్థిని స్నానం చేస్తుండగా సెల్‌ఫోన్‌తో చిత్రీకరణ - Sakshi

ఇంటర్ విద్యార్థిని స్నానం చేస్తుండగా సెల్‌ఫోన్‌తో చిత్రీకరణ

ఓ ఇంటర్ విద్యార్థిని తన ఇంట్లో స్నానం చేస్తుండగా దొంగచాటున సెల్‌ఫోన్‌తో చిత్రీకరించిన ఓ యువకుడు తన స్నేహితులతో కలిసి ఆమెను బెదిరించడం మొదలుపెట్టారు. బ్లాక్‌మెయిల్ చేస్తూ

ఓ ఇంటర్ విద్యార్థిని తన ఇంట్లో స్నానం చేస్తుండగా దొంగచాటున సెల్‌ఫోన్‌తో చిత్రీకరించిన ఓ యువకుడు తన స్నేహితులతో కలిసి ఆమెను బెదిరించడం మొదలుపెట్టారు. బ్లాక్‌మెయిల్ చేస్తూ తాము చెప్పిన రూమ్‌కు రప్పించుకుని కొద్ది రోజులుగా అత్యాచారం చేస్తున్నారు. యువకుల వేధింపులు భరించలేని విద్యార్థిని ఇల్లు విడిచి పారిపోయింది. విద్యార్థిని తల్లి కుటుంబ సభ్యులు సాయంతో ఆమె ఆచూకీ ఆదివారం కనుగొంది. జరిగిన సంఘటన తెలుసుకొంది. పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఆ యువకుల బండారం బయటపడింది. నిందితులపై నిర్భయ కేసు నమోదైంది. వివరాల్లోకి వెళ్తే...
 
 గజపతినగరం : పట్టణంలోని డ్రీమ్స్ మొబైల్ షాపులో పని చేస్తున్న ఐదుగురు యువకులు ఇంటర్ విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డారు. పురిటిపెంట న్యూకాలనీకి చెందిన ఓ విద్యార్థిని ఇంట్లో స్నానం చేస్తుండగా వీడియోను సెల్‌ఫోన్‌లో చిత్రీకరించిన యువకులు తమ కోర్కెను తీర్చకుంటే వీడియోను నెట్‌లో పెడతామని బెదిరించి మరీ అత్యాచారానికి పాల్పడినట్టు విద్యార్థిని తల్లి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదులో పేర్కొన్న వివరాలు ఇలా ఉన్నాయి. తన ఇంటి పక్కనే ఉన్న శివాజినాయక్ తన కుమార్తె స్నానం చేస్తుండగా వీడియోను తీసి బ్లాక్‌మెయిల్ చేసి తన స్నేహితులతో కలిసి అత్యాచారానికి పాల్పడ్డారని పేర్కొంది. శివాజినాయక్‌తో స్నేహితులు ప్రసన్నకుమార్, శ్రీకాంత్, భానుప్రసాద్, జితేంద్ర తన కుమార్తెను కొద్ది రోజులు పాటు వారు చెప్పిన చోటుకు రప్పించుకుని అత్యాచారం చేయడమే కాకుండా లైంగిక వేధింపులకు గురి చేశారని ఫిర్యాదులో పేర్కొంది.
 
 వీరి బాధలు భరించలేక పది రోజుల కిందట తన కుమార్తె ఇల్లు విడిచి వెళ్లిపోయయిందని తెలిపింది. కుటుంబ సభ్యుల సహాయంతో తీసుకువ చ్చి ప్రశ్నించగా జరిగిన సంఘటనను వివరించిందని తెలిపింది. విద్యార్థిని తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు బొబ్బిలి డీఎస్‌పీ ఇషాక్ అహ్మద్ నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు సీఐ వి.చంద్రశేఖర్ తెలిపారు.  ఇదిలా ఉండగా ఆదివారం రాత్రి పది గంటల సమయంలో ఎస్‌పీ గ్రేవెల్ ఇక్కడకు వచ్చి నిందితులను విచారించి వెళ్లారు. నిందితులపై నిర్భయ కేసు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్టు సీఐ తెలిపారు. నిందితులను కఠినంగా శిక్షించే విధంగా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కేఏ నాయుడు కోరారు. బాధిత విద్యార్థినికి అండగా ఉంటామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement