‘త్రీ రోజెస్’ ఆదరణ పొందుతుంది | senior actors arisetty Vinod | Sakshi
Sakshi News home page

‘త్రీ రోజెస్’ ఆదరణ పొందుతుంది

Published Mon, Jan 4 2016 2:22 AM | Last Updated on Sun, Sep 3 2017 3:01 PM

‘త్రీ రోజెస్’ ఆదరణ పొందుతుంది

‘త్రీ రోజెస్’ ఆదరణ పొందుతుంది

సీనియర్ నటుడు వినోద్
 గజపతినగరం: జెడ్పీటీసీ మాజీ సభ్యులు గార తవుడు నిర్మాతగా మారి తెరకెక్కిస్తున్న చిత్రం ‘త్రీ రోజెస్’ ప్రేక్షకాదరణ పొందుతుందని సీనియర్ నటులు ఆరిశెట్టి వినోద్ తెలిపారు. ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొనేందుకు వచ్చిన సందర్భంగా ఆయన కాసేపు విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే...

 నేను 1981లో కీర్తి, కాంత, కనకం సినిమాతో సినీ రంగప్రవేశం చేశా. మొదటి సినిమాకే మూడు నేషనల్ అవార్డులు దక్కాయి. ఇంత వరకు తాను మూడు వందల తెలుగు సినిమాలు, 30 తమిళ సినిమాలు, నాలుగు హిందీ సినిమాలు చేశాను. ముప్పై టీవీ సీరియళ్లలో కూడా నటించాను. అన్ని పాత్రలు వేయడం వల్ల జనాదరణ లభించింది. తెలుగు సినిమాల్లో చంటి, నల్లత్రాచు, లారీ డ్రైవర్, ఇంద్ర, నరసింహనాయుడు, భైరవద్వీపం నాకు మంచి గుర్తింపు తీసుకువచ్చాయి. ప్రస్తుతం మహేష్‌బాబు నటిస్తున్న బ్రహ్మోత్సవం చిత్రంలో నటిస్తున్నాను. సీవీ రెడ్డి డెరైక్షన్‌లో దివంగత నేత వైఎస్‌ఆర్ పాత్ర పోషించడం ఎన్నటికీ మరిచిపోలేను.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement