సాక్షి ప్రతినిధి, విజయనగరం: ఓ వైపు టిట్లీ పెను తుఫాన్... మరో వైపు ఉదయం నుంచి వీస్తున్న భారీ ఈదురుగాలులు... ఇంకో వైపు భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ హెచ్చరికలు ప్రజాభిమానం ముందు చిన్నబోయాయి. తమ కష్టాలు తీర్చే నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపడుతున్న ప్రజా సంకల్పయాత్ర నేపథ్యంలో ఇవేమీ ఖాతరు చేయని జనఝరి నడుమ 283వ రోజు పాదయాత్ర విజయవంతంగా సాగింది. చిక్కటి చిరునవ్వుతో.. ఆప్యాయత... ఆదరణతో జననేతకు ఎదురేగి స్వాగతం పలికారు. బుధవారం ఉదయం నుంచి జనాభిమానం నడుమ పాదయాత్ర చేపట్టిన జగన్‌కు అపూర్వ ఆదరణ లభించగా... సాయంత్రం గజపతినగరంలో నిర్వహించిన భారీ బహిరంగ సభకు వేలాది సంఖ్యలో తరలివచ్చిన ప్రజలు జగనన్నకు అండగా నిలిచారు.
సభ నిర్వహించిన విజయనగరం –రాయపూర్ జాతియ రహదారి జన సంద్రంగా మారింది. అన్నా మీ వెంటే ఉంటామంటూ అండగా నిలిచారు. బహిరంగ సభ జరుగుతున్న సమయంలో రామభద్రపురం నుంచి విజయనగరం వైపు వెళుతున్న మూడు ప్రైవేటు అంబులెన్స్‌లకు మార్గం ఇవ్వాలంటూ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ‘దారివ్వండి అన్నా... అక్కా’ అంటూ మానవతా ధృక్పథంతో స్పందించారు. ప్రభు త్వ అంబులెన్స్‌లు ఎలాగూ అందుబాటులో ఉండవు, కనీసం ప్రైవేటు అంబులెన్స్‌లకైనా దారివ్వండన్నా అం టూ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని ఎండగట్టారు.
ఎమ్మెల్యే అవినీతిపై నిప్పులు
నాలుగేళ్ల టీడీపీ ప్రభుత్వ పాలనలో ప్రజా సంక్షేమంపై స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై ప్రతిపక్షనేత, వైఎస్సార్‌సీపీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గజపతినగరం నియోజకవర్గం ఎమ్మెల్యే చేస్తున్న ఇసుక దోపిడీ, ఔట్‌సోర్సింగ్ పోస్టుల అమ్మకాల్లో అవినీతిపై తూర్పరబట్టా రు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల అమల్లో ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిపై జననేత విరుచుకుపడ్డారు. జననేత ప్రసంగాన్ని ఆద్యంతం ఉత్సాహంగా విన్న ప్రజలు జై జగన్ జైజై జగన్... అంటూ నినాదాలు చేశారు.
జనసందోహం నడుమ పాదయాత్ర
గజపతినగరం మండలం జిన్నాం గ్రామ పంచాయతీ శివారున ఏర్పాటు చేసిన శిబిరం నుంచి పాదయాత్రను ప్రారంభించిన జగన్ లింగాలవలస, లోగిశ క్రాస్ కొత్త శ్రీరంగరాజపురం మీదుగా నారాయణ గజపతిరాజపురం చేరుకున్నారు. మధ్యాహ్న భోజన విరామానంతరం గజపతినగరం వరకూ సాగింది. పాదయాత్రకు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన విద్యార్థులు, అభిమానులు, పార్టీ కార్యకర్తలు సంఘీభావం తెలిపారు. గ్రామాల్లో పెద్ద సంఖ్యలో మహిళలు, విద్యార్థులు, యువత, రైతన్నలు జననేతకు స్వాగతం పలికారు.
అన్నా మా వేదన పట్టించుకోండి...
పాదయాత్రలో ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డి వద్ద నియోజకవర్గ ప్రజలు తమ ఆవేదన వ్యక్తం చేశారు. డ్వాక్రా మహిళలకు రుణాలు సక్రమంగా ఇవ్వడం లేద నీ, లింగాలవలస గ్రామంలో తనతో పాటు 12 మంది సభ్యులను వెలుగు సిబ్బంది, బ్యాంకు అధికారులు కలి సి నిట్టనిలువునా ముంచారని వాపోయారు. రాష్ట్ర వ్యా ప్తంగా 2 లక్షల మంది ఫార్మసిస్టులు ఉన్నా పోస్టులను భర్తీ చేయడం లేదనీ, 20 ఏళ్లుగా ప్రభుత్వాస్పత్రుల్లో 4700 ఫార్మసిస్టు పోస్టులు ఖాళీగా ఉన్నా భర్తీ చేయడం లేదని తెలిపారు. క్షత్రియులకు కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలనీ పోరాట సంఘం కోరింది.
వైఎస్ హయాం లో వికలాంగులకు రుణాలు, మూడు సైకిళ్ల చక్రాలు అందివ్వగా, చంద్రబాబు బ్యాటరీ సైకిలు అందిస్తామని హామీ ఇచ్చి డిగ్రీ అర్హత ఉండాలని లింకు పెట్టారని, వాటికి కూడా జన్మభూమి కమిటీలకు అప్పజెప్పారని, వారికి నచ్చినవారికి మాత్రమే సంక్షేమ పథకాలు అందిస్తున్నారని ఎం కొత్తవలస గ్రామానికి చెందిన వికలాంగుడు ఆవేదన వ్యక్తం చేశారు. లింగాలవలస గ్రామంలోని పంట పొలాలకు తోటపల్లి రిజర్వాయర్ నుంచి వచ్చే సాగునీరు అందకపోవడంతో పంటలు సాగుచేసేందుకు రైతులంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామనీ, లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటు చేయాలని కోరారు.
పాదయాత్రలో పాల్గొన్న పార్టీ నాయకులు ః
పాదయాత్రలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల ఇన్‌చార్జి భూమన కరుణాకరరెడ్డి, రాష్ట్ర ప్రొగ్రామ్స్ కమిటీ కన్వీనర్ తల శిల రఘురాం, మాజీ మంత్రులు బొత్స సత్యనారా య ణ, మోపిదేవి వెంకటరమణ, మాజీ ఎంపీ బొత్స ఝా న్సీలక్ష్మి, ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి, బద్వేల్ ఎమ్మెల్సీ గోవిందరెడ్డి, సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర,రాష్ట్ర అధికార ప్రతినిధి నారమల్లి పద్మాజారెడ్డి, రా ష్ట్ర ప్రచార కమిటీ అధ్యక్షుడు విజయ్‌చందర్, జిల్లా రాజ కీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు, విజయనగరం, అరకు పార్లమెంటరీ జిల్లాల అధ్యక్షులు బెల్లాన చంద్రశేఖర్, శత్రుచర్ల పరీక్షిత్‌రాజ్, మాజీ ఎమ్మెల్యేలు బొత్స అప్పలనర్సయ్య, బడ్డుకొండ అప్పలనాయుడు, నెల్లిమర్ల, ఎస్‌కోట, బొబ్బిలి సమన్వయకర్తలు పెనుమత్స సాంబశివరాజు, కడుబండి శ్రీనివాసరా వు, శంబంగి వెంకటచిన అప్పలనాయుడు, రా ష్ట్ర కార్యదర్శి డాక్టర్ పెనుమత్స సురేష్‌బాబు, జిల్లా ఎస్సీ సెల్ కన్వీనర్ పీరుబండి జైహింద్‌కుమార్, ఘట్టంనేని ఆదిశేషగిరిరావు, జమ్మాన ప్రసన్నకుమార్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment