ఫోటోలతో బెదిరించి యువతిపై గ్యాంగ్ రేప్ | gang-rape-case-limelight-in-vizianagaram-district | Sakshi
Sakshi News home page

Published Sun, Sep 28 2014 7:48 PM | Last Updated on Fri, Mar 22 2024 11:24 AM

యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన విజయనగరం జిల్లా గజపతినగరం మండలం కురిటిపెంటలో ఆలస్యంగా వెలుగుచూసింది. ఇంటర్మీయట్ చదువుతున్న విద్యార్థినిపై అదే గ్రామానికి చెందిన ఐదుగురు యువకులు లైంగిక దాడి చేశారు. సెల్ఫోన్ తో ఫోటోలు తీసి ఆమెను బెదిరించి ఈ దారుణానికి పాల్పడ్డారు. ఈ విషయాన్ని ఎవరితో చెప్పుకోలేక బాధితురాలు ఇంటి నుంచి పారిపోయింది. ఆమెను వెతికి పట్టుకోవడంతో అసలు విషయం వెలుగుచూసింది. దీంతో బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి, కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement