‘టీడీపీ ఎమ్మెల్యే మోసం చేశారు’
‘టీడీపీ ఎమ్మెల్యే మోసం చేశారు’
Published Tue, Dec 29 2015 9:26 AM | Last Updated on Fri, Aug 10 2018 8:16 PM
శ్రీకాకుళం : గజపతినగరం ఎమ్మెల్యే కె. అప్పలనాయుడు తనను మోసం చేశారంటూ శ్రీకాకుళానికి చెందిన ఎన్.ఛాయాకుమారి అనే మహిళ సోమవారం జిల్లా ఎస్పీ ఎ.ఎస్.ఖాన్‌కు ఫిర్యాదు చేశారు. శ్రీకాకుళం గుజ రాతీపేటకు చెందిన ఛాయాకుమారికి కారాసు దీప అనే మహిళతో పరిచయం ఉంది. రూ.10 లక్షలు పెట్టుబడి పెడితే కొద్దిరోజుల వ్యవధిలో రూ.50 లక్షల వరకు లాభం వస్తుందని, ఇరీడియం రైస్‌పుల్లింగ్ కాయిన్ పేరిట ఓ ప్రాజెక్టు చేపట్టామని, ఇందులో టీడీపీ ఎమ్మెల్యే అప్పల నాయుడు కూడా భాగస్వామిగా ఉన్నారని దీప చెప్పడంతో గతేడాది నవంబర్‌లో రెండు విడతలుగా తాను డబ్బు చెల్లించానని ఛాయా తెలిపారు.
ఎమ్మెల్యే ఒత్తిళ్ల మేరకే డబ్బు చెల్లించానని, బ్యాంకు వివరాలు కూడా ఎమ్మెల్యే ఇచ్చారని తెలిపారు. డబ్బుల కోసం ప్రశ్నిస్తుంటే తనను ఢిల్లీ, విజయవాడ, విశాఖ ప్రాంతాలకు తిప్పి చివరకు శ్రీనివాస్ అనే ఎమ్మెల్యే బినామీ తనకు రూ.60 వేలు ఇచ్చి పంపించారన్నారు. ఘటనపై విచారిస్తామని ఎస్పీ చెప్పారు.
Advertisement
Advertisement