
ఫోన్లో మాట్లాడించింది ఎవరు.. ఏసీబీ ఆరా
తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచేందుకు కోట్లు వెదజల్లిన కేసులో మరికొన్ని కీలక అంశాలు బయట పడుతున్నాయి. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీవెన్సన్ను చంద్రబాబుతో ఫోన్లో మాట్లాడించింది ఎవరన్నదానిపై ఏసీబీ దర్యాప్తు కొనసాగుతోంది. ఆడియో టేపులలో వినిపించిన మొదటి గొంతును పోల్చేందుకు ఏసీబీ నిపుణులు ప్రయత్నిస్తున్నారు.
'అవర్ బాబుగారు వాంట్స్ టు టాక్ టు యూ.. బీ ఆన్ ద లైన్' అని చెప్పిన వ్యక్తి ఎవరో తెలుసుకునేందుకు ముమ్మరంగా దర్యాప్తు సాగుతోంది. సెబాస్టియన్ ద్వారానే చంద్రబాబు మాట్లాడినట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. గతంలోనే అనేక ఆపరేషన్లలో సెబాస్టియన్ మధ్యవర్తిత్వం వహించడంపై ఏసీబీ అధికారులు వివరాలను సేకరిస్తున్నారు.