ఓటుకు నోటు కుంభకోణం విషయంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోన్ను ట్యాప్ చేశారన్న ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో దీనిపై కేంద్రానికి ఫిర్యాదు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు, డీజీపీ జాస్తి వెంకట రాముడు ఢిల్లీకి వెళ్తున్నారు.

అసలు తాము ముఖ్యమంత్రి ఫోన్ ట్యాప్ చేయలేదని ఏసీబీ చీఫ్ ఏకే ఖాన్ ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అయినా కూడా తమ ముఖ్యమంత్రి ఫోన్ను అక్రమంగా ట్యాప్ చేశారంటూ ఆంధ్రప్రదేశ్ సర్కారు వాదిస్తోంది.