
సాక్షి, హైదరాబాద్ : ఓటుకు కోట్లు కేసులో సెబాస్టియన్ డిశ్చార్జ్ పిటిషన్‌పై ఏసీబీ కౌంటరు దాఖలు చేసింది. సెబాస్టియన్ ఫోన్‌తో కుట్రలో కీలక వివరాలు బయటపడ్డాయని ఏసీబీ తెలిపింది. సెబాస్టియన్ డిశ్చార్జ్ పిటిషన్ కొట్టివేయాలని ఏసీబీ కోర్టును కోరింది. విచారణ జాప్యం చేసేందుకే ఒకరి తర్వాత ఒకరు పిటిషన్లు దాఖలు చేశారని ఏసీబీ పేర్కొంది. ఓటుకు నోటు కేసుపై శుక్రవారం మరో సారి కోర్టులో వాదనలు జరగనున్నాయి.