
సాక్షి, హైదరాబాద్: ఏళ్లుగా నలుగుతున్న ఓటుకు కోట్లు కేసులో బుధవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఏ-3 గా ఉన్న ఉదయ్‌సింహను ఏసీబీ అధికారులు నేడు అరెస్టు చేశారు. ఇప్పటికే పలువురు నిందితుల డిశ్చార్జ్ పిటీషన్లు కొట్టివేసిన ఏసీబీ ప్రత్యేక కోర్టు అభియోగాలపై విచారణ ప్రారంభించింది. విచారణకు హాజరుకాని మరో నిందితుడు ఉదయ్‌సింహపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీచేసింది. నాన్ బెయిలబుల్ వారెంట్‌ను అమలు చేసిన ఏసీబీ అధికారులు ఆయన్ను అరెస్టు చేశారు. ఏసీబీ కోర్టులో ఉదయ్‌సింహను గురువారం హాజరుపరచనున్నారు. కాగా, ఈ కేసులో ఆడియో, వీడియో టేపుల ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు కీలకం కానుంది. నిందితులపై నమోదైన అభియోగాలపై విచారణ ప్రారంభం కావటంతో కీలక సూత్రదారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.
(చదవండి: ఏసీబీ కోర్టులో ఓటుకు కోట్లు కేసు విచారణ..)
Comments
Please login to add a commentAdd a comment