ఓటుకు నోటు కేసు: ఉదయ్‌ సింహా ఇంట్లో సోదాలు | It Raids On Cash For Vote Case Accused Uday Simha House | Sakshi
Sakshi News home page

ఓటుకు నోటు కేసు: ఉదయ్‌ సింహా ఇంట్లో సోదాలు

Published Thu, Sep 27 2018 8:33 PM | Last Updated on Thu, Sep 27 2018 8:35 PM

It Raids On Cash For Vote Case Accused Uday Simha House - Sakshi

హైదరాబాద్‌: ఓటుకు నోటు కేసులో ప్రధాన నిందితుల్లో ఒకరైన ఉదయ సింహ ఇంట్లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. చైతన్యపురి పరిధిలోని హరిపురి కాలనీలో ఉన్న ఆయన నివాసంలో ఐదుగురు సభ్యుల ఐటీ శాఖాధికారుల బృందం తనిఖీలు చేస్తున్నారు. అధికారులు ఆయన ఇంటికి వచ్చినపుడు ఉదయ సింహ తల్లి మాత్రమే ఉంది.  దీంతో అధికారులు ఉదయ సింహాకు ఫోన్‌ చేసి ఇంటి రావాలని చెప్పారు. దీంతో ఆయన హుటాహుటిన ఇంటికి చేరుకున్నారు. ఇంటికి చేరుకున్న వెంటనే ఆయన సమక్షంలోనే ఐటీశాఖాధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. పలు కీలకమైన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement