vote for crores case
-
‘ఓటుకు కోట్లు’ కేసులో కీలక పరిణామం
సాక్షి, న్యూఢిల్లీ: ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు నాయుడిని ముద్దాయిగా చేర్చాలంటూ దాఖలైన పిటిషన్‌ని సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం గురువారం విచారించింది. వేసవి సెలవుల తర్వాత వచ్చే ఏడాది జూలై 14న దీన్ని విచారణ చేస్తామని కోర్టు స్పష్టం చేసింది. పిటిషనర్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తరపున సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వాదనలు వినిపించారు. ‘ఓటుకు కోట్లు కేసు ఛార్జ్‌షీట్‌లో చంద్రబాబు పేరును 37 సార్లు ప్రస్తావించారు. అయినా ఆ కేసులో ఏసీబీ చంద్రబాబును ముద్దాయిగా చేర్చలేదు’ అని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ కేసులో చంద్రబాబు పేరు చేర్చి సీబీఐ దర్యాప్తు జరపాలని కోర్టును అభ్యర్ధించారు. రాజకీయ నేతల కేసులను త్వరితగతిన విచారణ జరపాలని ఇటీవలే సుప్రీం కోర్టు తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. (ఓటుకు కోట్లు కేసు: ఉదయ్‌సింహ అరెస్టు) -
ఓటుకు కోట్లు కేసు: ఉదయ్‌సింహ అరెస్టు
సాక్షి, హైదరాబాద్: ఏళ్లుగా నలుగుతున్న ఓటుకు కోట్లు కేసులో బుధవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఏ-3 గా ఉన్న ఉదయ్‌సింహను ఏసీబీ అధికారులు నేడు అరెస్టు చేశారు. ఇప్పటికే పలువురు నిందితుల డిశ్చార్జ్ పిటీషన్లు కొట్టివేసిన ఏసీబీ ప్రత్యేక కోర్టు అభియోగాలపై విచారణ ప్రారంభించింది. విచారణకు హాజరుకాని మరో నిందితుడు ఉదయ్‌సింహపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీచేసింది. నాన్ బెయిలబుల్ వారెంట్‌ను అమలు చేసిన ఏసీబీ అధికారులు ఆయన్ను అరెస్టు చేశారు. ఏసీబీ కోర్టులో ఉదయ్‌సింహను గురువారం హాజరుపరచనున్నారు. కాగా, ఈ కేసులో ఆడియో, వీడియో టేపుల ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు కీలకం కానుంది. నిందితులపై నమోదైన అభియోగాలపై విచారణ ప్రారంభం కావటంతో కీలక సూత్రదారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. (చదవండి: ఏసీబీ కోర్టులో ఓటుకు కోట్లు కేసు విచారణ..) -
బాబుకు ఆ అర్హత లేదు : ఎమ్మెల్యే ఆర్కే
హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన సీఎం చంద్రబాబుకు లీడర్ ఆఫ్ ది హౌస్‌గా కొనసాగే అర్హత లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి చెప్పారు. హైదరాబాద్‌లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. విచారణ అంటే ఎందుకంత భయమని చంద్రబాబును ఎమ్మెల్యే ఆర్కే సూటిగా ప్రశ్నించారు. ఓటుకు కోట్లు కేసులో సీఎం నిజాయితీ నిరూపించుకునేందుకు మంచి అవకాశం వచ్చిందన్నారు. కేసు విచారణ జరగకుండా బాబు స్టే ఎందుకు తెచ్చుకున్నారో చెప్పాలన్నారు. -
బాబుకు ఆ అర్హత లేదు : ఎమ్మెల్యే ఆర్కే
-
నిజాం షుగర్స్ ప్రైవేటుపరం చేసింది బాబే
* నిజామాబాద్ ఎంపీ కవిత మండిపాటు * టీడీపీ ప్రైవేటుపరం చే సినా కాంగ్రెస్ పట్టించుకోలేదు * ఫ్యాక్టరీని కాపాడుకునేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తోంది * రైతులకు ఇప్పటిదాకా రూ. 66 కోట్ల సాయం చేసింది * దీనిపై జేఏసీ ప్రజలను మభ్యపెట్టాలని చూస్తోంది సాక్షి, హైదరాబాద్: నిజాం దక్కన్ షుగర్స్ ఫ్యాక్టరీ 1937లోనే 98 శాతం నిజాం ప్రభుత్వ వాటా, 2 శాతం ప్రైవేటు వాటాతో మొదలై ఎంతో వైభవాన్ని చవిచూసిందని నిజామాబాద్ ఎంపీ కవిత తెలిపారు. గురువారం తెలంగాణ భవన్లో ఆమె విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణకు పెద్దలు ఇచ్చిన వారసత్వ సంపదైన ఈ సంస్థను 2002లో అప్పటి సీఎం చంద్రబాబు జాయింట్ వెంచర్ పేరిట డెల్టా పేపర్ మిల్స్‌కు 51 శాతం వాటా కట్టబెట్టి ప్రైవేటుపరం చేశారని విమర్శించారు. లాభాల్లో నడుస్తున్న ఫ్యాక్టరీని ప్రైవేటుపరం చేయడంపై అప్పట్లో పట్టించుకున్న వారు లేరన్నారు. నిజాం షుగర్స్ ప్రైవేటుపరం అయినప్పట్నుంచి యాజమాన్యం ఉద్దేశపూర్వకంగా నష్టాలు చూపుతూ వచ్చిందని, 2004 నుంచి పదేళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ సైతం ఈ విషయంలో ఏమీ పట్టించుకోలేదన్నారు. 2006లో నాటి ప్రభుత్వం హౌస్ కమిటీ వేసినా 2012 వరకు నిర్ణయాన్ని ప్రకటించలేదన్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక 2014 నుంచి ఇప్పటివరకు ఫ్యాక్టరీని కాపాడుకునేందుకు, రైతులను ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం రూ. 66 కోట్ల సాయం చేసిందని కవిత చెప్పారు. వరుస నష్టాలు చూపించి యాజమాన్యం లాకౌట్ ప్రకటించిందని, ఇప్పుడు ఈ వ్యవహారం బీఐఎఫ్ఆర్ (బోర్డ్ ఫర్ ఇండస్ట్రియల్ అండ్ ఫైనాన్షియల్ రికన్స్ట్రక్షన్) పరిధిలో ఉందని, ఆ సంస్థ నిర్ణయం తీసుకునే వరకు ఏమీ చేయలేమన్నారు. సహకార పద్ధతిలో నడుపుకుంటే మంచిది నిజాం షుగర్స్‌కు గత వైభవం రావాలంటే రైతులు సహకార పద్ధతిలో ఫ్యాక్టరీని నడిపేందుకు ముందుకొస్తే అప్పగించడానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సిద్ధంగా ఉన్నారని కవిత తెలిపారు. ఈ విషయంలో అన్ని ప్రాంతాల ప్రజాప్రతినిధులంతా అండగా ఉంటామన్నారు. వాస్తవాలు ఇలా ఉంటే పెద్దలమని చెప్పుకునే జేఏసీ మాత్రం ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. నిజామాబాద్‌లో అఖిలపక్ష సమావేశం అని చెప్పి విపక్షాలను పిలిచి తమను పిలవలేదని, తమను పిలిచి ఉంటే వాస్తవం ఏమిటో చెప్పేవారమన్నారు. లే ఆఫ్ ప్రకటించి నందు వల్ల 400 మంది ఉద్యోగులకు 50 శాతం వేతనాలు ఇవ్వాలని యాజమాన్యానికి కార్మికశాఖ ఇప్పటికే నోటీసులు ఇచ్చిందని, వీఆర్ఎస్ ఇప్పించేందుకూ ఒత్తిడి తెస్తామని చెప్పారు. తప్పు చేస్తే ఎంత పెద్దవారైనా తప్పించుకోలేరు ఓటుకు కోట్లు కేసుపై కవిత ‘‘తప్పు చేసిన వారు ఎంత పెద్దవారైనా తప్పించుకోలేరు. మన చట్టాలు ఇప్పటికే ఈ విషయాన్ని నిరూపించాయి. ఓటుకు కోట్లు కేసులో ఏసీబీ కోర్టు నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక డెరైక్షన్ అవసరం లేదు. ఇప్పటికే కేసు విచారణ జరుగుతోంది’’ అని కవిత పేర్కొన్నారు. ఈ కేసులో ఏపీ సీఎం చంద్రబాబు ప్రమేయంపై ఆరోపణల నేపథ్యంలో కేసును తిరిగి విచారించాలంటూ ఏసీబీ కోర్టు ఏసీబీని ఆదేశించడంపై కవిత ఈ మేరకు స్పందించారు. ఈ కేసుతో ప్రమేయమున్న వారిని ఏసీబీ విచారిస్తుందన్నారు. ఏసీబీ కోర్టు నోటీసు పూర్తిగా సాంకేతికపరమైనదని, దీనిపై ఏసీబీ అధికారులు కోర్టుకూ ఇదే చెప్పారన్నారు. కేసు కోర్టు పరిధిలో ఉన్నందున ఇంతకన్నా ఎక్కువ స్పందించలేన ని, కోర్టు ఆదేశాల నేపథ్యంలో ఏసీబీ శాఖాపరంగా కోర్టుకు వివరాలు అందిస్తుందన్నారు. విలేకరుల సమావేశంలో డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కె.విద్యాసాగర్‌రావు, షకీల్, జీవన్‌రెడ్డి, ఆలె వెంకటేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు. -
ఏసీబీ అందర్నీ విచారిస్తోంది : ఎంపీ కవిత
-
ఏసీబీ అందర్నీ విచారిస్తోంది : ఎంపీ కవిత
హైదరాబాద్ : ఓటుకు కోట్లు కేసులో ఎంతటివారికైనా విచారణ తప్పదని నిజామాబాద్ ఎంపీ కవిత చెప్పారు. హైదరాబాద్‌లో గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ...ఈ కేసులో చట్టాలు కఠినంగా ఉన్నాయన్నారు. ఓటుకు కోట్లు కేసులో ఏసీబీ లోతుగా దర్యాప్తు జరుగుతోందన్నారు. అవసరమైనప్పుడు ఏసీబీ అందర్నీ విచారిస్తోందని కవిత తెలిపారు. -
బాబు పదవి నుంచి తప్పుకోవాలి : ధర్మాన
శ్రీకాకుళం: ఓటుకు కోట్లు కేసులో ఏసీబీ విచారణ పూర్తయ్యేంత వరకు సీఎం చంద్రబాబు తన పదవి నుంచి స్వచ్ఛందంగా తప్పుకోవాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు డిమాండ్ చేశారు. శ్రీకాకుళంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ....కేసు విచారణ నిష్పక్షపాతంగా జరగాలంటే ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి పదవుల నుంచి తప్పుకోవడం సాంప్రదాయమన్నారు. గవర్నర్ నరసింహన్ ఈ మేరకు చంద్రబాబుకు తగు సూచనలు చేసి వ్యవస్థపై నమ్మకం పెంచాల్సిన అవసరముందని ఆయన చెప్పారు. ఓటుకు కోట్లు కేసు నుంచి తప్పించుకోవడానికి చంద్రబాబు చేసే ప్రయత్నాల వల్ల ప్రజలకు వ్యవస్థపై నమ్మకం పోతుందని ధర్మాన ఆవేదన వ్యక్తం చేశారు. -
హోదా కోసం కేంద్రంపై ఒత్తిడి : రావెల
మడకశిర : రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు తెలిపారు. కేంద్రంలో తమ మిత్రపక్షమైన బీజేపీ అధికారంలో ఉన్నప్పటికీ వివిధ రకాలుగా ఒత్తిడి తీసుకొచ్చి ప్రజల పక్షాన నిలబడతామన్నారు. అనంతపురం జిల్లాలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఓటుకు కోట్లు కేసుపై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయన్నారు. ఈ కేసులో ఆడియో, వీడియో టేపులు చెల్లవని సుప్రీంకోర్టు చెప్పినప్పటికీ ప్రతిపక్షాలు బురదజల్లుతున్నాయన్నారు. స్టింగ్ ఆపరేషన్లు చట్టవిరుద్ధమని ఆయన అన్నారు. సీఎం చంద్రబాబు రాష్ట్రాన్ని శరవేగంగా అభివద్ధి చేయడానికి చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. రక్షకతడుల ద్వారా అనంతపురం జిల్లా వ్యాప్తంగా వేరుశనగను కాపాడడానికి తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే ఈరన్న, ఎమ్మెల్సీ తిప్పేస్వామి పాల్గొన్నారు. -
'బ్రీఫ్డ్ మీ' వాయిస్ బాబుదే : వాసిరెడ్డి పద్మ
హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసు ప్రజాస్వామ్యానికి ఓ మచ్చ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ఆరోపించారు. హైదరాబాద్‌లో సోమవారం ఆమె మాట్లాడుతూ... సీఎం చంద్రబాబుపై మండిపడ్డారు. ఓటుకు కోట్లు కేసు ఆడియో టేపుల్లో బ్రీఫ్డ్ మీ అన్న వాయిస్ తనది కాదని చంద్రబాబు ఎప్పుడూ చెప్పలేదని వాసిరెడ్డి పద్మ అన్నారు. ఆ వాయిస్ బాబుదేనని ఫోరెన్సిక్ పరీక్షలు రుజువు చేస్తున్నాయని చెప్పారు. ఓటుకు కోట్లు కేసు నుంచి తప్పించుకునేందుకే చంద్రబాబు ఏపీ ప్రయోజనాలను తెలంగాణ సీఎం కేసీఆర్‌కు తాకట్టు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటుకు కోట్లు కేసును పునర్విచారణ చేయాలని సోమవారం ఏసీబీ కోర్టు ఆదేశించింది. వచ్చేనెల 29వ తేదీలోగా ఈ విచారణ పూర్తి చేయాలని ఏసీబీని కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. -
'బ్రీఫ్డ్ మీ' వాయిస్ బాబుదే
-
'హోదా విషయంలో మొదటి ముద్దాయి బాబే'
హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసు భయంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నింటా రాజీపడుతున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య ఆరోపించారు. హైదరాబాద్‌లో సోమవారం ఆయన మాట్లాడుతూ..ఏపీకి ప్రత్యేక హొదా అవసరం లేదని కేంద్రప్రభుత్వం తేల్చడంలో మొదటి ముద్దాయి చంద్రబాబేనన్నారు. పాలమూరు, డిండి ప్రాజెక్టులు పూర్తైతే ఏపీ ఎడారిగా మారుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కమీషన్ల కోసమే బాబు పోలవరం ప్రాజెక్టును కేంద్రప్రభుత్వానికి అప్పగించడం లేదని దుయ్యబెట్టారు. ఇప్పటికైనా చంద్రబాబు అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్లాలని రామచంద్రయ్య డిమాండ్ చేశారు. -
హైకోర్టును ఆశ్రయించిన మత్తయ్య
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు కోట్లు కేసులో మత్తయ్య సోమవారం హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు స్టే ఆర్డర్ ఉన్నప్పటికీ తనకు అధికారులు నోటీసులు ఇచ్చారని పిటిషన్లో తెలిపాడు. కేసు వివరాలు తెలియకుండా రెండు ప్రభుత్వాలు కుట్రపన్నుతున్నాయని పేర్కొన్నాడు. తనకు న్యాయవాదిని నియమించాలని మత్తయ్య హైకోర్టును కోరాడు. -
కేసు గురించి మాట్లాడొద్దు
రేవంత్‌రెడ్డికి హైకోర్టు సూచన సాక్షి, హైదరాబాద్: ‘ఓటుకు కోట్లు’ కేసు గురించి మాట్లాడవద్దని ఈ కేసులో ప్రధాన నిందితుడు రేవంత్‌రెడ్డికి హైకోర్టు సూచించింది. కోర్టు సూచించినా కూడా వినకుండా వ్యాఖ్యలు చేస్తే కలిగే పర్యవసానాల గురించి రేవంత్‌రెడ్డికి చెప్పాలని ఆయన తరఫు న్యాయవాది కె.రవీంద్రకుమార్‌కు సూచించింది. బెయిల్ పొందిన రేవంత్‌రెడ్డి కేసు గురించి బహిరంగంగా మాట్లాడుతున్నారని, సాక్షులపై ప్రభావం చూపే అవకాశమున్నందున బెయిల్‌ను రద్దు చేయాలని ఏసీబీ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు బుధవారం విచారణ జరిపింది. పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా ఆదేశించింది. తదుపరి విచారణను దసరా సెలవుల అనంతరం చేపడతామని జస్టిస్ రాజా ఇలంగో ఉత్తర్వులు జారీ చేశారు. -
రాష్ట్ర హోం సెక్రటరీకి ఏపీ నోటీసులు
సాక్షి, హైదరాబాద్/విజయవాడ లీగల్: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అడ్డంగా దొరికిపోయిన ‘ఓటుకు కోట్లు’ కేసుకు కౌంటర్‌గా ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై నమోదైన కేసులకు సంబంధించి విజయవాడ కోర్టు ఆదేశాలను సిట్ అధికారులు గురువారం తెలంగాణ హోం శాఖ ముఖ్య కార్యదర్శి రాజీవ్ త్రివేదీకి అందించారు. నోటీసులివ్వడానికి సిట్ బృందం తెలంగాణ సచివాలయానికి రావడంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇప్పటికే ఈ ట్యాపింగ్‌కు సంబంధించిన అంశాలతో కూడిన డేటాను నాలుగు కంపెనీలు సీల్డ్ కవర్లలో విజయవాడలోని చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో దాఖలు చేశాయి. 25 ఫోన్ నంబర్లకు సంబంధించిన అంశాలను వాటిలో పొందుపరిచినట్లు తెలిసింది. ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించిన తుది ఉత్తర్వులు వెలువడే వరకు తెలంగాణ అధికారులు ఇచ్చిన ఆదేశాలు, ఇతర డేటా వివరాలు సర్వీసు ప్రొవైడర్ల వద్ద ఉండే అవకాశం లేదని సిట్ భావిస్తోంది. ట్యాపింగ్ ఆదేశాలు తెలంగాణ హోం శాఖ ముఖ్య కార్యదర్శి ద్వారా వెళ్లినట్లు, ఆయన వద్ద మరికొంత డేటా సైతం ఉన్నట్లు సిట్ ఇటీవల విజయవాడ కోర్టులో మరో పిటిషన్ దాఖలు చేసింది. అందుబాటులో ఉన్న పూర్తి వివరాలు, డేటాకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా భద్రంగా ఉంచాలని, కోర్టు కోరినప్పుడు అందించేలా ఆదేశించాలని ఇందులో కోరారు. దీన్ని విచారించిన న్యాయస్థానం ఆ మేరకు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు నోటీసుల్ని తెలంగాణ హోం శాఖ ముఖ్య కార్యదర్శి రాజీవ్ త్రివేదీకి అందించడానికి సిట్ ప్రత్యేక బృందం గురువారం హైదరాబాద్‌లోని తెలంగాణ సచివాలయంలో ఆయన కార్యాలయానికి వెళ్లింది. సిట్ ద్వారా నోటీసుల్ని అందుకున్న అనంతరం రాజీవ్ త్రివేది మీడియాతో మాట్లాడుతూ ‘న్యాయస్థానం ఆదేశాలను సిట్ బృందం అందించింది. కోర్టు చెప్పిన ప్రకారం నడుచుకుంటాం. ఎప్పుడు కోరితే అప్పుడు మా వద్ద ఉన్న ఆధారాలను సమర్పిస్తాం’ అని చెప్పారు. ఏపీ సిట్ బృందం నోటీసులివ్వడానికి తమ హోం సెక్రటరీ కార్యాలయానికి వచ్చినట్లు తెలంగాణ సచివాలయం ఉద్యోగులకు తెలియడంతో వారంతా ఆ కార్యాలయం ఉన్న డి-బ్లాక్ దగ్గర గుమిగూడారు. నోటీసులు ఇచ్చి తిరిగి వస్తున్న సిట్ అధికారులు మీడియాతో మాట్లాడుతుండగా ఉద్యోగులు అభ్యంతరం చెప్పారు. సిట్ బృందంపై తీవ్రస్థాయిలో అసహనం వ్యక్తం చేశారు. ‘గో బ్యాక్’ అంటూ నినాదాలు చేస్తూ అక్కడ నుంచి తరిమికొట్టేందుకు ప్రయత్నించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు, సచివాలయ భద్రతాధికారులు ఉద్యోగుల్ని అదుపు చేసి సిట్ అధికారులను వాహనాలు ఎక్కించి పంపారు. అంతకుముందు టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో ముఖ్య డాక్యుమెంట్లను, సమాచారాన్ని తొలగించకుండా తెలంగాణ హోం శాఖ ముఖ్య కార్యదర్శికి నోటీసులు జారీ చేయాలని సిట్‌ను విజయవాడలోని చీఫ్ మెట్రో పాలిటన్ మేజిస్ట్రేట్ ఆదేశించారు. ఉన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు టెలిఫోన్ సర్వీసు ప్రొవైడర్లు సీల్డ్ కవర్లలో ఇచ్చిన కాల్ డేటాను హైకోర్టు రిజిస్ట్రార్‌కు కోర్టు పంపింది. ఏపీపీకి తెలియకుండా పిటిషన్ విజయవాడ పోలీసులు, సీఐడీ, సిట్ అధికారులు కొత్త సంప్రదాయానికి తెర తీశారు. సాధారణంగా ఏ పిటిషన్ అయినా దాఖలు చేసే ముందు సంబంధిత కోర్టు అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (ఏపీపీ)ని సంప్రదించాలి. కోర్టులో ఏపీపీకి తెలియకుండానే తెలంగాణ హోం శాఖ ముఖ్య కార్యదర్శికి నోటీసులు జారీ చేయాల్సిందిగా కోరుతూ సిట్ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. -
ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో కోచింగ్!
► ‘ఓటుకు కోట్లు’ కేసులో నిందితులకు ముందస్తు తర్ఫీదు ► ఏ ప్రశ్నకు ఏం సమాధానం చెప్పాలనే అంశంపై ముందే శిక్షణ ► అందరూ ఒకే జవాబు చెబుతుండడంతో విస్తుపోతున్న ఏసీబీ అధికారులు ► విచారణ కు ముందు, తర్వాత పార్టీ కార్యాలయానికి వెళ్లాల్సిందే! ► ‘ముఖ్య నేత’ ఆధ్వర్యంలో శిక్షణ కేంద్రం సాక్షి, హైదరాబాద్: ఏ ప్రశ్న వేస్తే ఏం సమాధానం చెప్పాలి..? ఏ ప్రశ్నకు మౌనం దాల్చాలి..? ఏం అడిగితే తలాతోకా లేని జవాబు చెప్పాలి..? ఇదేదో ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులకు ఇచ్చే తర్ఫీదు కాదు! ‘ఓటుకు కోట్లు’ కేసులో ఏసీబీ ముందు విచారణకు హాజరయ్యే నిందితులు, సాక్ష్యులకు టీడీపీ కార్యాలయమైన ఎన్టీఆర్ ట్రస్టు భవన్లో ఇస్తున్న ముందస్తు కోచింగ్!! విచారణాధికారులు ఏ ప్రశ్న వేస్తారు.. దానికి ఎలాంటి సమాధానాలివ్వాలి అన్న అంశంపై న్యాయవాదుల బృందం వారికి శిక్షణ ఇస్తున్నట్లు ఏసీబీ గుర్తించింది. నోటీసులు అందుకున్న ప్రతి ఒక్కరూ ఒకే రకమైన సమాధానాలు చెప్పడం చూసి విస్తుపోయిన ఏసీబీ అధికారులు అసలు విషయం ఏమిటని ఆరా తీస్తే ఈ సంగతి బయటపడింది. కొందరైతే ప్రశ్నపత్రం ముందే లీకైందా అన్నట్లు.. ఏసీబీ ప్రశ్నలకు తడుముకోకుండా సమాధానాలు చెప్పడం, మరికొన్నింటికి మౌనం దాల్చడం, చాలా వాటికి పొంతన లేని సమాధానాలు చెప్పడం లాంటివి చేస్తున్నారు. కేసులో అరెస్టైన సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మొదలు మంగళవారం విచారణకు హాజరైన శ్రీనివాసులునాయుడు దాకా.. విచారణలో వారు చెప్పిన సమాధానాల్లో చాలా అంశాలు అధికారులు అవాక్కయ్యేలా ఉన్నాయని ఏసీబీ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. ఓ వ్యక్తికి నోటీసు ఇచ్చారంటే ఇక వారికి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో మాక్ విచారణ మొదలవుతోంది. అంతేకాదు విచారణకు వచ్చే రోజున, తిరిగి వెళ్లేటప్పుడు ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌కు వెళ్లాల్సిందే. విచారణ తర్వాత ఏసీబీ అడిగిందేమిటి? వారు చెప్పిందేమిటనేది మళ్లీ అక్కడ వివరిస్తున్నారు. తర్ఫీదు ఇస్తున్నదెవరు? ‘ఓటుకు కోట్లు’ కేసులో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు రూ.50 లక్షలు ఇస్తూ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడటం, నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోన్లో మాట్లాడిన ఆడియో రికార్డులు బయటపడటంతో ఈ కేసు సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. దీంతో ఈ కేసులో టీడీపీ నేతలు కొందరిని ఏసీబీ ముందుకు వెళ్లకుండా చేయడం, విచారణకు హాజరయ్యే వారికి అవసరమయ్యే సాయం అందించడం పనిగా పెట్టుకున్నారని ఏసీబీ వర్గాలు చెపుతున్నాయి. ఈ కేసులో సూత్రధారులు, పాత్రధారులు ఎవరనే విషయం స్పష్టమైనప్పటికీ వాటిని న్యాయస్థానాల్లో నిరూపించడం కోసం ఏసీబీ పక్కాగా ఆధారాలు సేకరిస్తోంది. అందుకు అనుగుణంగా అనుమానితులందరికీ నోటీసులు ఇచ్చి విచారిస్తోంది. అయితే విచారణకు వారు సహకరించకుండా ఉండేందుకు ఎన్టీఆర్ ట్రస్టు భవన్ కేంద్రంగా ఓ ‘ముఖ్యనేత’ నేతృత్వంలో కొందరు ప్రముఖులు ఒక విభాగాన్ని నిర్వహిస్తున్నట్లు ఏసీబీ గుర్తించింది. ఈ విభాగంలో నిష్ణాతులైన న్యాయవాదులతో పాటు పలువురు మాజీ, ప్రస్తుత పోలీసు ఉన్నతాధికారులు ఉన్నట్లు అనుమానిస్తోంది. వారి ఆధ్వర్యంలోనే విచారణకు హాజరయ్యే వారందరికీ... ఏసీబీ వద్ద ఎలా వ్యవహరించాలో సలహాలు, సూచనలు ఇస్తున్నట్లు సమాచారం. ఈ తర్ఫీదు ఇస్తున్న వారు ఎవరనే అంశాలపై ఏసీబీ దృష్టి పెట్టింది. ఈ కేసులో విచారణకు డుమ్మా కొట్టిన వారు ఏపీలో ఆశ్రయం పొందినట్లుగా కూడా ఏసీబీ గుర్తించింది. అక్కడ వీరికి షెల్టర్ ఇచ్చిన వారికీ నోటీసులు ఇవ్వాలని భావిస్తోంది. -
‘ఓటుకు కోట్లు’లో శ్రీనివాసులునాయుడికి నోటీసులు
⇒ నేడు విచారణకు హాజరవ్వాలని ఏసీబీ ఆదేశం ⇒ త్వరలో ఇద్దరు ముఖ్యుల అరెస్టుకు రంగం సిద్ధం హైదరాబాద్: ‘ఓటుకు కోట్లు’ కేసులో చిత్తూరు టీడీపీ ఎమ్మెల్యే డీకే సత్యప్రభ కుమారుడు డీకే శ్రీనివాసులు నాయుడు(మాజీ ఎంపీ ఆదికేశవులు నాయుడు కుమారుడు)కి ఏసీబీ సోమవారం నోటీసులు జారీ చేసింది. శ్రీనివాసులు నాయుడు ప్రస్తుతం కర్ణాటకలో ఓ బేవరేజస్ కంపెనీకి ఎండీగా వ్యవహరిస్తున్నారు. ఆయనతోపాటు ఆయన కార్యాలయ ఇన్చార్జి విష్ణు చైతన్యకూ తాఖీదులు ఇచ్చింది. బెంగళూరు వెళ్లిన ఏసీబీ ప్రత్యేక బృందం సీఆర్పీసీ సెక్షన్ 160 కింద ఈ నోటీసులు అందజేసింది. మంగళవారం ఉదయం 10.30 గంట లకు హైదరాబాద్‌లో ఉన్న ఏసీబీ ప్రధాన కార్యాలయంలో విచారణకు హాజరు కావాల్సిందిగా ఆదేశించింది. ఈయనకు బేవరేజస్‌తో పాటు పలు వ్యాపారాలు ఉన్నట్లు సమాచారం. ఏసీబీ నుంచి నోటీసులు అందుకున్న వారిలో జిమ్మీబాబు, నారా లోకేశ్ డ్రైవర్ కొండల్‌రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లిన విషయం విదితమే. త్వరలో మరిన్ని సంచలనాలు! ‘ఓటుకు కోట్లు’ కేసులో త్వరలో టీడీపీకి చెందిన ఇద్దరు ముఖ్య నేతలను అరెస్టు చేయవచ్చని ఏసీబీ వర్గాలు తెలిపాయి. తమ వద్ద ఉన్న ఆధారాల మేరకు వారిద్దరినీ త్వరలోనే అరెస్టు చేసి విచారించే అవకాశం ఉంది. వీరిని అరెస్టు చేసిన తర్వాత టీడీపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొందరికి విచారణ కోసం నోటీసులు జారీ చేయంది. ఎవరి ఖాతా నుంచి ఎవరి ఖాతాకు డబ్బులు మళ్లించారు, ఈ నిధులను ఎమ్మెల్యేలకు ఎవరు ముట్టజెప్పారు వంటి వివరాలను ఏసీబీ బయటపెట్టబోతోంది. -
నాకే సంబంధం లేదు.. అంతా కక్షే
హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని టీడీపీ నేత ప్రదీప్ అన్నారు. ఎలాంటి సంబంధం లేకున్నా నోటీసులు ఇవ్వడం చూస్తుంటే కచ్చితంగా ప్రభుత్వ కక్ష సాధింపే చర్యే అన్న అనుమానం కలుగుతుందని అన్నారు. ఈ కేసులో తమ నేతలకు కూడా సంబంధం లేదని చెప్పారు. కోర్టులపై తమకు నమ్మకం ఉందని అన్నారు. ఏసీబీ ముందు వంద శాతం హాజరవుతానని, వారికి పూర్తి స్థాయిలో సహకరిస్తానని చెప్పారు. ఈ కేసులో ఇతర నిందితులైన సండ్ర వెంకట వీరయ్య, వేం నరేందర్ రెడ్డి తెలుసా అంటే తనకు వారు తెలియదని, తాను అంత పెద్ద స్థాయి నేతను కాదని వివరణ ఇచ్చారు. తాను కేవలం పార్టీ కార్యకర్తలాంటివాడిననే చెప్పారు. ఏసీబీ సోమవారం ఉదయం 10.30గంటలకు హాజరుకావాలని ఏసీబీ ఆదేశించిందని, ఆ మేరకు హాజరయ్యి వారికి సమాధానాలు ఇచ్చిన తర్వాత మీడియాతో అన్ని విషయాలు చెప్తానని తెలిపారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్ శ్రీనగర్ కాలనీ డివిజన్‌కు టీడీపీ అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. ఆయన నారా లోకేశ్‌కు కీలక సన్నిహితుడు అని కూడా తెలుస్తోంది.