
కేసు గురించి మాట్లాడొద్దు
‘ఓటుకు కోట్లు’ కేసు గురించి మాట్లాడవద్దని ఈ కేసులో ప్రధాన నిందితుడు రేవంత్‌రెడ్డికి హైకోర్టు సూచించింది.
రేవంత్‌రెడ్డికి హైకోర్టు సూచన
సాక్షి, హైదరాబాద్: ‘ఓటుకు కోట్లు’ కేసు గురించి మాట్లాడవద్దని ఈ కేసులో ప్రధాన నిందితుడు రేవంత్‌రెడ్డికి హైకోర్టు సూచించింది. కోర్టు సూచించినా కూడా వినకుండా వ్యాఖ్యలు చేస్తే కలిగే పర్యవసానాల గురించి రేవంత్‌రెడ్డికి చెప్పాలని ఆయన తరఫు న్యాయవాది కె.రవీంద్రకుమార్‌కు సూచించింది. బెయిల్ పొందిన రేవంత్‌రెడ్డి కేసు గురించి బహిరంగంగా మాట్లాడుతున్నారని, సాక్షులపై ప్రభావం చూపే అవకాశమున్నందున బెయిల్‌ను రద్దు చేయాలని ఏసీబీ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు బుధవారం విచారణ జరిపింది.
పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా ఆదేశించింది. తదుపరి విచారణను దసరా సెలవుల అనంతరం చేపడతామని జస్టిస్ రాజా ఇలంగో ఉత్తర్వులు జారీ చేశారు.