హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు కోట్లు కేసులో మత్తయ్య సోమవారం హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు స్టే ఆర్డర్ ఉన్నప్పటికీ తనకు అధికారులు నోటీసులు ఇచ్చారని పిటిషన్లో తెలిపాడు. కేసు వివరాలు తెలియకుండా రెండు ప్రభుత్వాలు కుట్రపన్నుతున్నాయని పేర్కొన్నాడు. తనకు న్యాయవాదిని నియమించాలని మత్తయ్య హైకోర్టును కోరాడు.