నాకే సంబంధం లేదు.. అంతా కక్షే | i dont have relation to vote for crores case: tdp pradeep | Sakshi
Sakshi News home page

నాకే సంబంధం లేదు.. అంతా కక్షే

Published Sun, Jul 19 2015 11:16 AM | Last Updated on Fri, Aug 17 2018 12:56 PM

నాకే సంబంధం లేదు.. అంతా కక్షే - Sakshi

నాకే సంబంధం లేదు.. అంతా కక్షే

హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని టీడీపీ నేత ప్రదీప్ అన్నారు. ఎలాంటి సంబంధం లేకున్నా నోటీసులు ఇవ్వడం చూస్తుంటే కచ్చితంగా ప్రభుత్వ కక్ష సాధింపే చర్యే అన్న అనుమానం కలుగుతుందని అన్నారు. ఈ కేసులో తమ నేతలకు కూడా సంబంధం లేదని చెప్పారు. కోర్టులపై తమకు నమ్మకం ఉందని అన్నారు. ఏసీబీ ముందు వంద శాతం హాజరవుతానని, వారికి పూర్తి స్థాయిలో సహకరిస్తానని చెప్పారు.

ఈ కేసులో ఇతర నిందితులైన సండ్ర వెంకట వీరయ్య, వేం నరేందర్ రెడ్డి తెలుసా అంటే తనకు వారు తెలియదని, తాను అంత పెద్ద స్థాయి నేతను కాదని వివరణ ఇచ్చారు. తాను కేవలం పార్టీ కార్యకర్తలాంటివాడిననే చెప్పారు. ఏసీబీ సోమవారం ఉదయం 10.30గంటలకు హాజరుకావాలని ఏసీబీ ఆదేశించిందని, ఆ మేరకు హాజరయ్యి వారికి సమాధానాలు ఇచ్చిన తర్వాత మీడియాతో అన్ని విషయాలు చెప్తానని తెలిపారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్ శ్రీనగర్ కాలనీ డివిజన్కు టీడీపీ అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. ఆయన నారా లోకేశ్కు కీలక సన్నిహితుడు అని కూడా తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement