'బ్రీఫ్డ్ మీ' వాయిస్ బాబుదే : వాసిరెడ్డి పద్మ
హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసు ప్రజాస్వామ్యానికి ఓ మచ్చ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ఆరోపించారు. హైదరాబాద్లో సోమవారం ఆమె మాట్లాడుతూ... సీఎం చంద్రబాబుపై మండిపడ్డారు.
ఓటుకు కోట్లు కేసు ఆడియో టేపుల్లో బ్రీఫ్డ్ మీ అన్న వాయిస్ తనది కాదని చంద్రబాబు ఎప్పుడూ చెప్పలేదని వాసిరెడ్డి పద్మ అన్నారు. ఆ వాయిస్ బాబుదేనని ఫోరెన్సిక్ పరీక్షలు రుజువు చేస్తున్నాయని చెప్పారు. ఓటుకు కోట్లు కేసు నుంచి తప్పించుకునేందుకే చంద్రబాబు ఏపీ ప్రయోజనాలను తెలంగాణ సీఎం కేసీఆర్కు తాకట్టు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటుకు కోట్లు కేసును పునర్విచారణ చేయాలని సోమవారం ఏసీబీ కోర్టు ఆదేశించింది. వచ్చేనెల 29వ తేదీలోగా ఈ విచారణ పూర్తి చేయాలని ఏసీబీని కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే.