సాక్షి, గుంటూరు: మహిళలను గౌరవించే చరిత్ర చంద్రబాబు, పవన్‌కు లేదని ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. బాబు, పవన్ భాగస్వామ్య ప్రభుత్వంలో మహిళలపై అనేక దాడులు జరిగాయని గుర్తు చేశారు. ‘‘పవన్ కల్యాణ్‌కు ఓపెన్ ఛాలెంజ్. మహిళల సమక్షంలో రచ్చబండకు సిద్ధమా?. చంద్రబాబు మహిళలకు చేసిన ఒక్క మేలైనా చెప్పాలి’’ అంటూ వాసిరెడ్డి పద్మ నిలదీశారు.
‘‘మహిళా పోలీసులను పెట్టాలనే ఆలోచన బాబుకు ఎందుకు రాలేదు?. మహిళా కమిషన్‌ను భ్రష్టు పట్టించాలనే మీ ఆటలు సాగవు. మహిళా కమిషన్‌పై చిందులు వేయడం పవన్, చంద్రబాబు మానుకోవాలి. మహిళల అదృశ్యంపై పవన్ నొటికొచ్చినట్లు మాట్లాడారు. బాబు హయాంలో మహిళలకు సమాన వాటా ఎప్పుడైనా ఇచ్చారా?. పవన్‌ది రాజకీయ కోపమా? రాష్ట్ర ప్రభుత్వంపై కోపమా?. మిసైన మహిళల్లో 78 శాతం మంది తిరిగి వచ్చారని డీజీపీ వెల్లడించారు. ఎక్కడా జరగనిది ఏపీలోనే జరుగుతోందని పవన్ ప్రచారం చేస్తున్నారు. తప్పు చేసిన వారిని మహిళా కమిషన్ ప్రశ్నిస్తుంది’’ అని వాసిరెడ్డి పద్మ పేర్కొన్నారు.
చదవండి: బాబు బాటలో పవన్.. నమ్మినవారినే నట్టేట ముంచేశాడా?
‘‘రాజ్యసభలో కేంద్రమంత్రి ప్రకటన చేశారంటూ పవన్ హడావిడి చేస్తున్నారు. టాప్ టెన్‌లో ఉన్న మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో లెక్కలు ఎందుకు అడగడం లేదు. ఏపిలోని మహిళల మిస్సింగ్ గురించి పవన్ ఎందుకు తాపత్రయపడుతున్నారు. రాష్ట్రంపై ఎందుకు విషం చిమ్ముతున్నారు. మిస్సింగ్ కేసుల్లో ఆంధ్రప్రదేశ్ 11వ స్థానంలో ఉంది. ఏపీపై మాత్రమే పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడుతున్నారు?. మొదటి పది రాష్ట్రాల గురించి ఒక్క మాట కూడా ఎందుకు ప్రస్తావించడం లేదు’’ అంటూ వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment