సాక్షి గుంటూరు: టీడీపీ అధినేత చంద్రబాబు.. చంద్రన్న కానుకల పంపిణీ సందర్భంగా సభలో తొక్కిసలాట చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటన ముగ్గురు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. కాగా, సభ నిర్వాహకులు, చంద్రబాబు నిర్లక్ష్యంగానే ఈ ప్రమాదం జరిగింది.
ఇక, ఈ ఘటనపై ఏపీ మహిళా కమిషన్ ఛైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ సీరియస్ అయ్యారు. ఈ సందర్భంగా ప్రమాదంలో గాయపడిన మహిళలను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. అనంతరం, వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ.. ‘తొక్కిసలాటలో ముగ్గురు మహిళలు మృతిచెందడం బాధాకరం. ముందుజాగ్రత్త చర్యలు తీసుకోకపోవడం వల్లే ఈ ప్రమాదం చోటుచేసుకుంది. చంద్రబాబు ఆధ్వర్యంలోనే ప్రచారం కోసం కానుకల సభ జరిగింది.
కానుకల పేరుతో మహిళలకు ఆశ చూపించారు. ప్రజల ఇబ్బందులు పట్టించుకోకుండా కార్యక్రమం చేపట్టారు. పేద మహిళలంటే చంద్రబాబుకు చులకన. కందుకూరు సభ తర్వాత కూడా చంద్రబాబుకు పశ్చాత్తాపం లేదు. తొక్కిసలాట ఘటనపై అధికారులను సమగ్ర నివేదిక కోరాము. ఈ ఘటనపై ఉయ్యూరు ఫౌండేషన్, చంద్రబాబు వివరణ ఇవ్వాలి’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment