ఏసీబీ అందర్నీ విచారిస్తోంది : ఎంపీ కవిత
హైదరాబాద్ : ఓటుకు కోట్లు కేసులో ఎంతటివారికైనా విచారణ తప్పదని నిజామాబాద్ ఎంపీ కవిత చెప్పారు. హైదరాబాద్లో గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ...ఈ కేసులో చట్టాలు కఠినంగా ఉన్నాయన్నారు.
ఓటుకు కోట్లు కేసులో ఏసీబీ లోతుగా దర్యాప్తు జరుగుతోందన్నారు. అవసరమైనప్పుడు ఏసీబీ అందర్నీ విచారిస్తోందని కవిత తెలిపారు.