బాబుకు ఆ అర్హత లేదు : ఎమ్మెల్యే ఆర్కే
హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో రెడ్హ్యాండెడ్గా దొరికిన సీఎం చంద్రబాబుకు లీడర్ ఆఫ్ ది హౌస్గా కొనసాగే అర్హత లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి చెప్పారు. హైదరాబాద్లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
విచారణ అంటే ఎందుకంత భయమని చంద్రబాబును ఎమ్మెల్యే ఆర్కే సూటిగా ప్రశ్నించారు. ఓటుకు కోట్లు కేసులో సీఎం నిజాయితీ నిరూపించుకునేందుకు మంచి అవకాశం వచ్చిందన్నారు. కేసు విచారణ జరగకుండా బాబు స్టే ఎందుకు తెచ్చుకున్నారో చెప్పాలన్నారు.